రాష్ట్రీయం
Food Poison at Jangaon: జనగామలోని ఏబీవీ కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 15 మంది ఇంటర్ విద్యార్థులకు అస్వస్థత (వీడియో)
Rudraజనగామలోని ఏబీవీ కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తున్నది. ఈ ఘటనలో 15 మంది ఇంటర్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
YS Jagan Tirumala Tour: నేడు తిరుమలకు జగన్.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు
Rudraతిరుమల లడ్డూ వివాదంపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.
Clash at Devara Movie: 'దేవర' సినిమా ప్రదర్శనలో ఘర్షణ.. కడప రాజా థియేటర్ లో యువకుల వీరంగం.. సిబ్బందిని చితకబాదుతూ గలాటా (వీడియోతో)
Rudraకడపలోని రాజా ధియేటర్ లో 'దేవర' మూవీ ప్రదర్శన సమయంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టికెట్స్ లేకుండానే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లోకి దూసుకొచ్చిన క్రమంలో వాగ్వాదం జరిగింది.
Nara Lokesh on Red Book: ఏపీలో రెడ్ బుక్ పాలన మొదలైంది! ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
VNSఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్‌బుక్ (AP Red Book) అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.
AP Government Ordinance: మద్యం షాపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, అన్నీ రద్దు చేస్తూ ఆర్డినెన్స్
VNSప్రభుత్వం రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ రాబోతుంది. ఇటీవల కొత్త లిక్కర్ పాలసీకి క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014-19 వరకు ఉన్న మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నారు.
YSRCP New District Psresidents: పార్టీని ప్రక్షాళన చేస్తున్న జగన్, పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులు, కొత్తగా నియమితులైనది వీరే..
Hazarath Reddyవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Perni Nani on Pawan Kalyan: ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా? పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన పేర్ని నాని
Hazarath Reddyడిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి నీచ రాజకీయాలేంటి? అంటూ పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు
Musi River Survey: వీడియో ఇదిగో, నేను పెట్రోల్ పోసుకొని సచ్చిపోతా, నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి అంటూ బాధితుడు ఆందోళన, మూసీ నది పరివాహక ప్రాంతంలో అధికారులు సర్వే
Hazarath Reddyనా చావుకి రేవంత్ రెడ్డినే కారణం ఓ బాధితుడు వీడియో విడుదల చేశాడు. నువ్వు మంచి చేస్తావని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుండి వరంగల్ పోయి మరీ ఓటు వేసి గెలిపిస్తే.. మాకు అన్యాయం చేస్తున్నావు. నేను పెట్రోల్ పోసుకొని సచ్చిపోతా.. నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసి పరివాహక ప్రాతంలో బాధితుడి ఆందోళన చేపట్టాడు.
Andhra Pradesh: జనసేనలో చేరిన బాలినేని,సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyమాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో... బాలినేనికి అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి, జనసేనలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఇటీవలే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
Telangana: వీడియో ఇదిగో, రైల్వే పట్టాలపై రాళ్లు పెట్టి హైదరాబాద్ యువకుడు వీరంగం, రైల్వే గేట్ మెన్ రావడంతో అక్కడి నుంచి పరార్
Hazarath Reddyహైదరాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద ఓ యువకుడు వీరంగం... రైల్వే పట్టాలపై రాళ్లు పెట్టాడు. అనంతరం రైల్వే ట్రాక్పై కూర్చున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మల్టీ ఇంజన్ లోకో పైలట్ యువకుడిని గమనించి వెంటనే మాధవనగర్ గేట్మెన్‌కు సమాచారం ఇచ్చాడు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, కాకినాడలో పది అడుగుల భారీ కొండచిలువను చంపిన యువకులు
Hazarath Reddyకాకినాడ జిల్లా రామచంద్రపురం గ్రామంలో ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో చిక్కుకున్న కొండచిలువ. గమనించిన గ్రామస్తులు ప్రాణ భయంతో కర్రలతో కొట్టి దానిని హతమార్చారు. ఏలూరు కాల్వకు వరద నీరు భారీగా చేరడంతో కొండచిలువలు వస్తున్నాయని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
KA Paul on Tirumala: తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోర్టులో పిల్ వేసినట్లు తెలిపిన ప్రజాశాంతి పార్టీ అధినేత వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు.
Janasena Protests: మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతల ఆందోళన, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్
Arun Charagondaవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద జనసైనికులు ఆందోళన చేపట్టారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే పవన్ కళ్యాణ్ కి పేర్ని నాని క్షమాపణలు చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Couple Romance on Bike: వీడియో ఇదిగో, అబ్బాయి ముందర పార్టుపై యువతి కూర్చుని.. పట్టపగలు బైకు మీద వెళుతూ ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్
Hazarath Reddy21 సెకన్ల క్లిప్‌లో ఒక అమ్మాయి ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ఒడిలో కూర్చొని, పట్టపగలు రద్దీగా ఉండే రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు అతన్ని కౌగిలించుకొని ముద్దుపెట్టుకోవడం చూపిస్తుంది.
KTR: ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇదేనా..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్నల వర్షం, అర్హతలు లేని బావమరిది కంపెనీకి వేల కోట్లు కట్టబెట్టడమేనా ఇన్నోవేటివ్!
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా కడిగిపారేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి ? అని రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం.. నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్ లైన్ మానేజ్మెంటు చెయ్యడం ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు.
Vijayasai Reddy Slams Atchannaidu: దేహం పెరిగినట్టుగా బుద్ధి పెరగలేదు నీకు, నీ కుల పార్టీలోకి నేను రావడమా అంటూ అచ్చెన్నాయుడిపై సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి
Hazarath Reddyటీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... "అచ్చెన్నాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె!
Prakash Raj vs Pawan Kalyan: గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం, పవన్ కల్యాణ్‌పై మరో కౌంటర్ వదిలిన ప్రకాష్ రాజ్
Hazarath Reddyతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా, ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. "గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?" అని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు.
Andhra Pradesh: వీడియోలు ఇవిగో, పవన్‌కి పాలాభిషేకం చేసిన వృద్ధురాలు, ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించారని ఆనందం వ్యక్తం చేసిన మహిళ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఓ వృద్దురాలు పాలాభిషేకం చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వృద్ధురాలు పవన్ ఫోటోకి పాలాభిషేకం చేసింది.ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించినందుకు ఆమె హర్షాతిరేకం వ్యక్తం చేసింది.
Nizamabad Shocker: కూతురు మరణంతో మనస్తాపం..వియ్యంకుడి హత్య, నిజామాబాద్ జిల్లా కంజర్ గ్రామంలో విషాద సంఘటన
Arun Charagondaనిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో విషాదం నెలకొంది. కూతురు మరణానికి కారణం వియ్యంకుడు నరహరిని హత్య చేశారు సత్యనారాయణ. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సత్యనారాయణ కుమార్తె. దీంతో కోపం పెంచుకున్న సత్యనారాయణ...వియ్యంకుడిని హతమార్చాడు.
Tirupati Laddu Row: వీడియో ఇదిగో, వందేభారత్ రైలులో భజనలు చేస్తూ తిరుపతికి మాధవీలత, నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్న బీజేపీ మహిళా నేత
Hazarath Reddyవందేభారత్ రైలులో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు.