రాష్ట్రీయం

Vangaveeti Radhakrishna Health Update: వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటు, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో టీడీపీ నేత

Hazarath Reddy

టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు.

Tirupati Laddu Row: రేపు తిరుమలలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌, డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ పిలుపు

Hazarath Reddy

తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.

Drun And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్‌చల్, ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లిన డ్రైవర్, ఆటోను సీజ్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందు బాబు హల్చల్ చేశాడు. చంపాపేటలోని ప్రధాన రహదారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మీర్ చౌర్ ట్రాఫిక్ పోలీసులు. ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా.. ఏకంగా పోలీసులపైకే ఆటోను తీసుకెళ్లాడు డ్రైవర్. ఫుల్‌గా తాగి ఉన్నట్లు నిర్దారణ కాగా ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.

MLA Raja Singh Slams Jagan: నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు, జగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

Arun Charagonda

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు.

Advertisement

Hydra Demolition: సంగారెడ్డిలో చెరువులో కట్టిన మూడంతస్తుల భవనం, బాంబులతో పేల్చేసిన అధికారులు..వీడియో ఇదిగో

Arun Charagonda

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి పెద్ద చెరువులో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. చెరువులో కట్టిన ఈ భవనాన్ని బాంబులతో కూల్చేశారు అధికారులు. శిథిలాలు తగిలి ఇద్దరికి గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Bhatti Vikramarka America Tour: అమెరికా పర్యటనలో బిజీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హువర్ డ్యామ్‌ను సందర్శించిన భట్టి, మైనింగ్ ఎగ్జిబిషన్‌లో ఆధునిక యంత్రాల పరిశీలన

Arun Charagonda

అమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీ బిజీగా ఉన్నారు. నెవాడా, ఆరిజోనా పర్యటనలో భాగంగా హూవర్ డ్యామ్ ను సందర్శించారు భట్టి. అలాగే లాస్ వెగాస్ లో మైనింగ్ ఎగ్జిబిషన్ లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం చర్చలు జరిపారు.

Food Poison At Hostel: ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత, చికెన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు..వీడియో

Arun Charagonda

ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో చికెన్ తిని 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Protests Against Musi Riverfront: మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే, అధికారులను అడ్డుకున్న స్థానికులు...వీడియో ఇదిగో

Arun Charagonda

మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులకు చుక్కెదురైంది. సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతీనగర్, సత్యా నగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగారు.

Advertisement

Harsha Sai: హర్షసాయి కోసం పోలీసుల ముమ్మర గాలింపు, విజయవాడలో ఉన్నట్లు అనుమానం, బంధువులను ఆరా తీసిన పోలీసులు!

Arun Charagonda

యూట్యూబర్ హర్షసాయి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు పోలీసులు. ఇంకా పరారీలోనే యూట్యూబర్ హర్షసాయి ఉన్నారు. నిన్న వైజాగ్ లో వెతికిన సైబరాబాద్ పోలీసులు...విజయవాడలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Land Mafia Sells Graveyard: స్మశన వాటికను వదలని రియల్టర్లు, ఓ వ్యక్తి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్న వైనం, ఎక్కడ అంత్యక్రియలు చేయాలని బాధితుల ఫైర్

Arun Charagonda

మంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు ఆగడం లేదు. స్మశానవాటికను కూడా వదల్లేదు రియల్టర్లు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ వ్యక్తి అంత్యక్రియలు కూడా చేయకుండా అడ్డుకున్నారు.

Revanth Reddy On Indiramma Housing Scheme: ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు, రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, విధివిధానాలు రూపొందించాలని సూచన

Arun Charagonda

ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్ష‌ల సంఖ్య‌లో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విష‌యంలో తెలంగాణ వెనుక‌బ‌డి ఉంద‌ని, ఈ ద‌ఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గ‌రిష్ట సంఖ్య‌లో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Staff To Hydraa: హైడ్రాకు సిబ్బంది కేటాయింపు, ప‌లు శాఖ‌ల నుంచి 169 మందిని డిప్యూటేష‌న్ పై హైడ్రాకు పంపుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

VNS

హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (Hydraa)కు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Government Order) ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాలో కొత్తగా వివిధ కేటగిరిల్లో 169 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ విభాగాల్లో డిప్యూటేషన్‌పై సిబ్బంది నియామకం (Saff For Hydraa) చేపట్టింది.

Advertisement

Liquor Shops To Increase In Telangana: తెలంగాణ‌లో పెరుగ‌నున్న మ‌ద్యం షాపులు, ప్ర‌తి 14వేల మందికి ఒక షాపుకు అనుమ‌తిచ్చేందుకు య‌త్నాలు

VNS

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్‌ మద్యం మాల్స్‌కు లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమాలోచనలు పూర్తి అయ్యాయి. ఇందుకోసం ఎక్సైజ్‌ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అనే అంశాన్ని అధికారులు తెరమీదకి తెచ్చారు.

IMD Alert For Telangana: రాబోయే రెండో రోజుల పాటూ తెలంగాణ‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, హైద‌రాబాద్ స‌హా ఈ జిల్లాల‌కు అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ

VNS

తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains) ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా (Rain Alert) పయనిస్తుందని పేర్కొంది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు విరాళాలు, ఆపదలో రాష్ట్రప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని సీఎం చంద్రబాబు వెల్లడి, వరద బాధితులకు రూ.602 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాల ప్రజల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు అందాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బుధవారం తెలిపారు.

Tirupati Laddu Dispute: చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా ? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు, ఆయన పాపాలు కడిగేందుకే పూజలు చేస్తున్నామని పేర్ని నాని ప్రకటన

Hazarath Reddy

తిరుపతి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీనిపై పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్‌25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.

Advertisement

Kodali Nani Slams Chandrababu: వీడియో ఇదిగో, నువ్వు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడివేనా? చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్, ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించావో చెప్పాలంటూ డిమాండ్

Hazarath Reddy

తిరుపతి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీనిపై కొడాలినాని, తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్‌25) మీడియాతో మాట్లాడారు. అసలు చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా అని కొడాలి నాని ప్రశ్నించారు. స్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారు.

BFSI Skill Programme: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, మరో 35 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

Tirupati Laddu Dispute: తిరుమల మీద చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళన, ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

తిరుమల పవిత్రతకు చంద్రబాబు నాయుడు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు

S.A. Rahman Quits YSRCP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై, రాజీనామా చేసిన వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్, టీడీపీలో చేరునున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

వైసీపీకి తాజాగా మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.

Advertisement
Advertisement