రాష్ట్రీయం
Nara Lokesh: వాహనదారుడికి సారీ చెప్పిన మంత్రి లోకేశ్..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ట్వీట్..ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
Arun Charagondaరెండు రోజుల క్రితం విశాఖలో పర్యటించారు మంత్రి నారా లోకేశ్. ఈ సందర్భంగా లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం రోడ్డు పక్కన నిలిపిన మరో కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా లోకేశ్ దృష్టికెళ్లారు సదరు వాహనదారుడు.
Andhra Pradesh: చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఆర్ కృష్ణయ్యను తెలుగు ప్రజలు క్షమించరు, మాజీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, సాంబార్లో పిండి ముద్దలు, అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు, నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఘటన
Hazarath Reddyఏలూరు జిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వండిన సాంబార్లో పిండి ముద్దలు.. డిహెచ్ 5 మెస్ లోని సాంబారులో పిండి ముద్దలు.. అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు..
Tension Erupt in Kamareddy: యూకేజీ చిన్నారిపై పీఈటీ టీచర్ దారుణం, స్కూలును ముట్టడించిన బంధువులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, సీఐ తలకు గాయం
Hazarath Reddyకామారెడ్డిలోని జీవదాన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ టీచర్ అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. UKG చదువుతున్న చిన్నారిపై పీఈటీ టీచర్ అత్యాచారానికి పాల్పడటంతో బంధువులు, పాప తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు
Tirupati Laddu Dispute: హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలా ? చురకలు అంటించిన వైసీపీ నేత పోతిన మహేష్
Hazarath Reddyబాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేష్ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పాయింట్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.
Tirupati Laddu Dispute: వీడియో ఇదిగో, తిరుపతి లడ్డూ ఘటనలో మాది తప్పు అని నిరూపిస్తే నీ బూట్లు తుడుస్తా, పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు
Hazarath Reddyలడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు.
MLA Koneti Adimulam: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్ రిలీఫ్, లైంగిక వేధింపుల కేసును కొట్టేసిన హైకోర్టు
Arun Charagondaఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన మహిళ కోర్టుకు హాజరై తాను చేసిన ఆరోపణలు, FIRలో అంశాలన్నీ అవాస్తవమని, కేసును కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించడంతో కేసును హైకోర్టు కొట్టేసింది.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన భార్యాభర్తలు, భార్యకు తీవ్ర గాయాలు
Hazarath Reddyమెదక్‌లోని వెల్కమ్ బోర్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తూ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఎగిరి అవతల పడ్డారు. మెదక్ మున్సిపాలిటీ మిషన్ భగీరథలో పనిచేస్తున్న సల్మాన్ కు అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.
KTR Inspection Of STP: మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం, పాకిస్తాన్ కంపెనీకి సుందరీకరణ పనులా?..కేటీఆర్ ఫైర్,హైడ్రాపై త్వరలో ఓ నిర్ణయం
Arun Charagondaపబ్లి సిటీ స్టంట్లతో సీఎం రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టిపిని సందర్శించింది బీఆర్ఎస్ బృందం. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్... మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.
R Krishnaiah To Joins Congress: కాంగ్రెస్‌లోకి ఆర్ కృష్ణయ్య?, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటీ
Arun Charagondaమరో నాలుగేళ్లు ఉండగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. ఈ నేపథ్యంలో ఇవాళ కృష్ణయ్యతో భేటీ అయ్యారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. విద్యానగర్‌లోని కృష్ణయ్య నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.
Telugu States Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
Edupayala Vana Durga Bhavani Temple: నీట మునిగిన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం, భారీ వర్షాలతో గర్బగుడిలోకి ప్రవేశించిన నీరు..వీడియో ఇదిగో
Arun Charagondaమెదక్ లోని ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం రెండో రోజుల జలదిగ్బందంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గర్భగుడిలోనికి ప్రవేశించింది వరద. ఆలయం ఎదుట ఉదృతంగా ప్రవహిస్తుంది మంజీరా నది. దీంతో ఈ నెలలో 12 రోజులు ఆలయం మూతపడింది.
CM Revanth Reddy On Hydra Demolitions: ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందే, బాధిత పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, పాతబస్తీ మెట్రోపై కీలక రివ్యూ
Arun Charagondaహైదరాబాద్ మెట్రో, ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు.
Centipede Found in Dal: వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
Hazarath Reddyహైదరాబాద్ అబిడ్స్లోని తాజ్ మహల్ హోటల్లో ఓ కస్టమర్ పప్పు ఆర్డర్ చేయగా, అందులో జెర్రీ దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. పప్పు తిన్న వారి పరిస్థితి ఏంటని అడిగారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు.
R Krishnaiah Resigns: ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్య, పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజీనామా
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు.
Tirupati Laddu Dispute: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyతిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.
Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ వివాదం, పవన్ కల్యాణ్‌కు కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుమల లడ్డూ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే.
Hyderabad: మల్లంపేటలో దారుణం, మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లిన దొంగ, సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఏసీపీ
Hazarath Reddyహైదరాబాద్ మల్లంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలో మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శారద (50)ను గొంతు నులిమి హత్య చేసి ఒంటిపై నగలు, సెల్ ఫోన్ దోచుకెళ్లాడు దొంగ.
Temple Chariot Set on Fire: అనంతపురంలో రాములోరి రథానికి నిప్పు పెట్టిన దుండగులు, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు
Hazarath Reddyసోమవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లాలోని కనేకల్ మండలం హనకనహల్‌లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. అనంతపురం జిల్లాలో రామాలయ రథం దగ్ధం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.
Karthi Apologises To Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంపై వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ, వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమిళ్ హీరో
Hazarath Reddyతిరుపతి లడ్డూ వివాదంపై తన వ్యాఖ్యలకు ఎదురుదెబ్బ తగిలిన కార్తీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల శుద్ధి కర్మ సమయంలో నటుడి ప్రారంభ వ్యాఖ్యలు విమర్శించబడ్డాయి.