రాష్ట్రీయం

Telangana: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ఇదిగో, తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ సమావేశం

Hazarath Reddy

Pragathi Bhavan Turns Praja Bhavan: ప్రజా భవన్‌గా మారిన ప్రగతి భవన్, బారికేడ్లు, గ్రిల్స్‌ తొలగించిన అధికారులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని ప్రగతిభవన్‌ (Pragathi Bhavan) ముందు ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన (Traffic Restriction Lifted) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ ముందు ఉన్న బారికేడ్ల తొలగింపు పనులను అధికారులు తాజాగా చేపట్టారు. గ్యాస్‌ కట్టర్లు, జేసీబీల సాయంతో వాటిని తొలగిస్తున్నారు.

Revanth Reddy Swearing-In: వీడియో ఇదిగో, సోనియాగాంధీకి పాదాభి వందనం చేసిన రేవంత్ రెడ్డి దంపతులు, అభినందనలు తెలిపిన కాంగ్రెస్ అధినేత్రి

Hazarath Reddy

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఫైలుపైనే సీఎంగా ఆయన తొలి సంతకం చేశారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే వేదికపై ఉన్న సోనియాగాంధీకి, ఇతర పెద్దలకు రేవంత్ రెడ్డి తన భార్య గీత, కూతురు, అల్లుడిని పరిచయం చేశారు.

Seethakka Swearing-In Video: వీడియో ఇదిగో, గవర్నర్ సీతక్కను పిలవగానే హోరెత్తిన ఎల్బీ స్టేడియం, దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేసిన గిరిజన బిడ్డ

Hazarath Reddy

తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో పాటు, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది.

Advertisement

Telangana Cabinet Meeting: వీడియోలు ఇవిగో, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్‌ భేటీ, ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన మంత్రి వర్గం

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు.ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై కేబినెట్‌ చర్చించింది.

NTR Statue Vandalised: బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేసిన దుండగులు, బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్‌

Hazarath Reddy

బాపట్ల జిల్లా లోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. దీనిపై స్థానిక టిడిపి నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చశారు..కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.. కాగా ఈ ఘటనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.

Kodali Nani Slams TDP: ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్కకు టీడీపీకి తేడా లేదు, చంద్రబాబు, జనసేనపై మండిపడిన కొడాలి నాని, ఇద్దరు కలిసినా జగన్‌ వెంట్రుక సైతం పీలకలేరంటూ ధ్వజం

Hazarath Reddy

తెలుగు దేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు (Kodali Nani Slams TDP) చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు జనసేన-బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుర్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి ఏంటో చూశామన్నారు.

CM Jagan Wishes to New Telangana CM: సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం నెలకొనాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణలో కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌.. ‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.

Advertisement

CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి రెండు సంతకాలు ఇవిగో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం, దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై చేశారు

CM Revanth Reddy First Speech: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం హైలెట్స్ ఇవిగో, ప్రగతి భవన్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు

Telangana Ministers List 2023: తెలంగాణ హోం శాఖా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క, మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

PM Modi Wishes New Telangana CM: కొత్త సీఎం రేవంత్ రెడ్డికి తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిక భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ..తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను అని అన్నారు.

Advertisement

Telangana Government Formation 2023: తెలంగాణకు తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, దళిత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే తొలి కాంగ్రెస్ దళిత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు.

Revanth Reddy Swearing-In Ceremony: వీడియో ఇదిగో, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి కొలువు దీరారు. నేడు(గురువారం) మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రి, రెండో వ్యక్తిగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు.

Telangana Government Formation 2023: ఎనుమల రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

ఎల్బీ స్టేడియంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు.

Pune Shocker: సరదా కోసం స్నేహితుడి వెనక భాగంలో ఎయిర్ కంప్రెసర్ గొట్టం దూర్చిన మరో స్నేహితుడు, ఒక్కసారిగా గాలి పేలుడు రావడంతో గాయాలతో యువకుడు మృతి

Hazarath Reddy

దూరపు బంధువు ‘సరదా కోసం’ పురుషుని వెనక ఉండే పురీషనాళంలోకి ఎయిర్ కంప్రెసర్ గొట్టం పెట్టడంతో అంతర్గత గాయాలతో ఓ యువకుడు చనిపోయాడు.మహారాష్ట్రలోని పూణేలోని హదప్సర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీలోని మూడవ అంతస్తులో ఇద్దరూ సరదా గేమ్ ఆడుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

Advertisement

Telangana CM Swearing-In: సీతక్కకు మంత్రి పదవి, మొత్తం 12 మంది మంత్రులతో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీళ్లే

Hazarath Reddy

నేడు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ముఖ్యనేతలుగా ఉన్న ముగ్గురికీ కేబినెట్‌లో చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Andhra Pradesh SI Results: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్ఐ ప‌రీక్షా ఫ‌లితాలు వ‌చ్చేశాయ్! లక్షా 50వేల మంది ప‌రీక్ష రాస్తే క్వాలిఫై అయిన‌వారు ఎంత మంది అంటే?

VNS

ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ తుది పరీక్ష తుది ఫలితాలు (SI results) విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆన్ లైన్ లో ఈ ఫలితాలను విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం 411 ఉద్యోగాలకు గాను గత ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించారు.

Revanth Reddy: కొలువుదీర‌నున్న కాంగ్రెస్ స‌ర్కార్, ప్ర‌మాణ‌స్వీకారం దృష్ట్యా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్ల‌లో వ‌చ్చేవారు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో రావాలంటూ సూచ‌న‌

VNS

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా.. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు (ట్రాఫిక్‌) కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు.

Cyclone Michaung Update: పూర్తిగా బలహీన పడిన మైచాంగ్ తుఫాను, ఇకపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపిన ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర

Hazarath Reddy

మైచాంగ్ తుఫాను పూర్తిగా బలహీనపడిందని, ఎలాంటి వినాశకరమైన ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర (IMD Director General Mrityunjay Mohapatra ) బుధవారం తెలిపారు.

Advertisement
Advertisement