రాష్ట్రీయం

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఓ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నగరంలోని వారాసిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఘటన చోటు చేసుకుంది.

Cyclone Mythili Update: ఏపీకి తప్పిన మిధిలీ తుపాను ముప్పు, అయినా పొంచి ఉన్న మరో గండం, రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న సైక్లోన్

Hazarath Reddy

త్వరలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Vote at Home: 28 వేల మందికి ఇంటి వద్దే ఓటు హక్కు.. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 మందికి అవకాశం

Rudra

28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.

Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌, మూడు 10 రూపాయల నోట్లతో స్కిల్ స్కామ్ నడిపారంటూ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు

Advertisement

Weather Forecast: విశాఖకు 420 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం, అల్లకల్లోలంగా మారిన సముద్రం, రానున్న మూడు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది బుధవారం రాత్రి విశాఖ­పట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Vijayashanti Quits BJP: అనుకున్నదే అయింది! బీజేపీకి షాక్‌ ఇచ్చిన రాములమ్మ, మరోసారి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న విజయశాంతి, కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరం, మెదక్ పార్లమెంట్ సీటు ఆఫర్‌ చేసిన కాంగ్రెస్‌

VNS

అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి (BJP) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను (Vijayashanti Quits BJP) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పంపించారు. గత కొంతకాలంగా ఆమె రాష్ట్ర పార్టీ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన, బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, పలు పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

VNS

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా (Air Circulation In Bay Of Bengal) మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Air Circulation In Bay Of Bengal) తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్ 480కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.

IT Raids in TS: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధిపై ఐటీ రైడ్స్‌, ఒకేసారి 40 బృందాలతో విస్తృతంగా సోదాలు, తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభం

VNS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు ముమ్మరమయ్యాయి(IT RAIDS). 40 బృందాలతో హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో (Miryalaguda)ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Telangana Elections 2023: రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా, జాతీయ పార్టీలు మూలకు వెళతాయంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పడటం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హ‌వా ఉండ‌దు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Skill Development Scam Case: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్రబాబు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

Andhra Pradesh Politics: దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవండి, ఆ ముగ్గురికి సవాల్ విసిరిన మాజీ వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Hazarath Reddy

ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.

CM Jagan Palnadu Tour: పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని తెలిపిన సీఎం జగన్, వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు

Advertisement

Cyclone Midhili Update: ఏపీకి మిధిలీ తుపాను గండం, బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం, భారీ వర్షాలతో తమిళనాడు విలవిల

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 15న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.

IMD Warning: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుకు వెదర్‌ అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరికలు జారీచేసిన ఐఎండీ

VNS

బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు (IMD) వెల్లడించారు. అల్పపీడన ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో సముద్ర తీరప్రాంతాల్లో భారీగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారిణి సునంద చెప్పారు.

Btech Ravi Arrested: కడపలో అర్ధరాత్రి ఉద్రిక్తత, టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్‌, 14 రోజుల రిమాండ్‌ విధింపు, కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు, ఇంతకీ ఏ కేసులో అరెస్టు చేశారంటే?

VNS

కడప రిమ్స్ ఆస్పత్రితో వైద్య పరీక్షల అనంతరం రవిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. గతంలో యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు టీడీపీ నేత నారా లోకేష్ కడప పర్యటనకు వచ్చారు. లోకేష్ పర్యటనలో కడప విమానాశ్రయం వద్ద రవి ఆందోళన చేశారని, పోలీసులకు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

HC on Pension: ఏపీలో పెన్షన్ల విధానంపై హైకోర్టు సంచలన తీర్పు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానంపై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది.

Advertisement

Telangana Elections 2023: వీడియో ఇదిగో, నేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే, తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

నేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లేనంటూ తుమ్మల నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే నా ఆలోచన. ఏపీ నుండి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయం నేను ఉంచుకోను. ఈ టీడీపీ పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నానని తెలిపారు.

Sadar Utsav Mela: ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్‌ లో ‘సదర్’ ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 3 వరకు ట్రాఫిక్ మళ్లింపు.. పూర్తి వివరాలు ఇదిగో!

Rudra

సదర్‌‌‌‌ ఉత్సవ మేళాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు.

Harish Rao About CM Post: కేటీఆర్‌ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ

Rudra

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

Hyderabad Fire Accident: నాంపల్లి ఘటన మరువక ముందే శాలిబండలో కూడా అగ్నిప్రమాదం...తృటిలో తప్పిన భారీ ప్రమాదం..

ahana

హైదరాబాద్‌లోని శాలిబండలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో పాటు 30 మంది అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Advertisement
Advertisement