రాష్ట్రీయం

Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో రూ. 10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన 200 మంది రౌడీ మూకలు, గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసి..

Hazarath Reddy

రూ. 10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన రౌడీ మూకలు..200 మంది యువకులు గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసిన ఐరన్ రేకులను తొలగించి విధ్వంసం.. దువ్వాడ పోలీసుల రంగప్రవేశంతో రౌడీ మూకలు పరార్..విశాఖపట్నం, గాజువాక లో ఘటన..

Skill Development Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా, సుప్రీంకోర్టులో తమ వాదనలను గట్టిగా వినిపించిన ఇరు పక్షాల న్యాయవాదులు

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Tirumala Srivari Brahmotsavam: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ నెల 15వ తేదీ నుంచి 9 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు, 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20వ పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

CM KCR Wife in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌ సతీమణి శోభ, ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు

Hazarath Reddy

తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆమె.. మంగళవారం వేకువజామున అర్చన సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు

Advertisement

Andhra Pradesh Shocker: యువకుడితో బీచ్‌కు వెళ్లి గుట్టపై నుంచి పడిపోయిన యువతి, భయంతో ఆమెను వదిలేసి యువకుడు పరార్, రాత్రి నుంచి 12 గంటల పాటు నరకం చూసిన బాధితురాలు

Hazarath Reddy

విశాఖనగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.

Amaravati Inner Ring Road Case: సాయంత్రం ఐదు గంటల వరకూ సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో విచారించనున్న సీఐడీ

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను సీఐడీ ప్రశ్నిస్తోంది.

Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు, చంద్రబాబు ఎఫ్‌ఐఆర్‌ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Hazarath Reddy

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.

Gold Rates Increased: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు.. 24 గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200

Rudra

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది.

Advertisement

TSRTC Special Buses for Dasara: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులు.. అదనపు చార్జీలు లేకుండానే..

Rudra

బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సుల ఏర్పాటు

Krishna Express Cancelled: నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ రద్దు.. రైల్వే అధికారుల ప్రకటన.. మరో మూడు ప్యాసింజర్ రైళ్ల రద్దు 15 వరకూ పొడిగింపు

Rudra

నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.

Elections in TS: నవంబర్‌ లో తెలంగాణ ఎన్నికలు.. గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్.. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, గ్రూప్-4 ఫలితాల విడుదలపై సందేహాలు

Rudra

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దూకుడు.. నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌.. 15న బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో.. 16 నుంచి సీఎం కేసీఆర్‌ వరుసగా జిల్లాల పర్యటనలు

Rudra

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు.

Advertisement

Telangana Assembly Election 2023: తెలంగాణలో ముచ్చటగా మూడో సారి కేసీఆరే సీఎం, అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో హ్యాట్రిక్ విజయాలతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరోసారి అధికారంలోకి రావాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ఆకాంక్షించారు.

Telangana Assembly Elections 2023: హుస్నాబాద్ నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించనున్న సీఎం కేసీఆర్, ఈ నెల 15న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు.

KTR Speech in Bhupalpally: రేపో మాపో మా పులి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్త‌ాడు, అందరి లెక్కలు సరిచేస్తాడు, భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు.

KA Paul on Chandrababu Bail Petition: టీడీపీ వాళ్లు ప్రజా శాంతి పార్టీలో చేరితే మంచిది, తెలుగు దేశం పార్టీ పని అయిపోయిందని తెలిపిన కేఎ పాల్

Hazarath Reddy

సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో పుట్టిపెరిగిన చంద్రబాబు.. చివరికి దేవుడిని కూడా తనకు శత్రువుని చేసుకున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు.చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్‌ రాకపోవడం ఊహించిందేనని అన్నారు.

Advertisement

Tatikonda Rajaiah: రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తాటికొండ రాజయ్య, కార్పోరేషన్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే

Hazarath Reddy

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు అవకాశం దక్కలేదు.

Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, ఏకంగా రాజమండ్రి జైల్ సెటప్ వేసి.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వినూత్నంగా నిరసన తెలిపిన తెలుగు తమ్ముళ్లు

Hazarath Reddy

శ్రీకాళహస్తిలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగు తమ్ముళ్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద రాజమండ్రి సెంట్రల్ జైలు సెట్టింగ్ వేశారు. జైలు లోపల ఉన్నట్టుగా జైలులో నుంచే తమ పార్టీ అధినాయకుడికి మద్దతుగా నిరసన తెలిపారు. తమ నాయకుడు జైల్లో నుంచి కూడా రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

Skill Development Scam Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు రేపటికి వాయిదా, దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది

Skill Development Scam Case: చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో దక్కని ఊరట, బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్‌లు డిస్మిస్‌ చేసిన కోర్టు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement
Advertisement