రాష్ట్రీయం
Telangana Politics: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్‌, కంభం అనిల్‌ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆ‍హ్వానించారు.
Hyderabad Rains: నిమజ్జనం సాగుతుండగానే హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని హైదరాబాద్ పోలీసులు సూచన
Hazarath Reddyవినాయక నిమజ్జనం జరుగుతున్న వేళ హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా అకస్మాత్తుగా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి సాయంత్రం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది
Yuvagalam padayatra Postponed: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా, అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ నేపథ్యంలో కీలక నిర్ణయం
Hazarath Reddyటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే.
Skill Development Scam Case: చంద్రబాబు అరెస్ట్, ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు
Hazarath Reddyఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.
Ganesh Immersion 2023: వీడియో ఇదిగో, మట్టి గణేషుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Hazarath Reddyనగరంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వినాయకుడిని తమ ఇంట్లోనే నిమజ్జనం చేశారు. మట్టి గణేషుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వీడియో ఇదిగో..
Khairatabad Ganesh Immersion: బైబై వినాయకా..ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి, మహాగణపతి నిమజ్జనోత్సవం వీడియో ఇదిగో..
Hazarath Reddyఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం (Khairatabad Mahaganesh) అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్‌ మార్గ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు
Bandlaguda Laddu Auction: రూ.కోటి 26 లక్షలు పలికిన బండ్లగూడ లడ్డు, రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డు, భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జనాలు
Hazarath Reddyహైదరాబాద్ నగరం మొత్తం జై బోలో గణేష్ మహరాజ్ నామస్మరణతో మారుమోగుతోంది. వినాయక ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు వేలాది వినాయకులు నిమజ్జనాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూ వేలంపాటలు కూడా పోటీపోటీగా సాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూ కళ్లు చెదిరే ధర పలికింది.
Ganesh Laddu Auction: ఏకంగా కోటీ 20లక్షలు పలికిన గణేషుడి లడ్డు, మాదాపూర్‌లో రికార్డు బద్దలు కొట్టే వేలంపాట, రిచ్‌మండ్ విల్లాలోని గణేషుడి లడ్డూకు భారీ డిమాండ్
VNSనవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి లడ్డు వేలంలో (Ganesh Laddu Auction) రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని (Madapur) రిచ్‌మండ్‌ విల్లాలో (Richmond Villa’s) గణనాథుడి లడ్డూ రూ.కోటి 20 లక్షలు పలికింది. ఇక మైహోమ్‌ భుజాలోని (My Home Bhooja) గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్‌ (Chiranjeevi Goud) అనే వ్యక్తి దక్కించుకున్నారు.
Ganesh Immersion: కొనసాగుతున్న మహా నిమజ్జనం, జీహెచ్‌ఎంసీ పరిధిలో హుస్సెన్‌ సాగర్‌ సహా 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు, 40వేల మందితో భారీగా బందోబస్తు
VNSగణేష్ మహా నిమజ్జనం (Ganesh Immersion) కొనసాగుతోంది. మూడు కమిషనరేట్ల పరిధిలో మహా నిమజ్జనానికి పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లను ఏర్పాటు చేసింది. అలాగే జీహెచ్ఎంసీలో మరో 100 చోట్ల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ తోపాటు ఇతర నీటి కొలనుల వద్ద 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది.
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలకు రోడ్డు మీదకు వస్తున్న మొసలి పిల్లలు, చింతల బస్తిలో నాలా నుండి బయటకు వచ్చిన చిన్న మొసలి పిల్ల వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కడ్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల బస్తిలోని ఓ నాలా నుండి బయట పడ్డ చిన్న మొసలి పిల్ల. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల కోసం ఎదురుచూస్తున్న పోలీసులు.
Andhra Pradesh: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అగ్ర నేతలతో సహా 26 మందికి హైకోర్టు నోటీసులు, పిటిషన్‌పై విచారణ నాలుగు వారాలకు వాయిదా
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత పిటిషన్‌లను విచారించిన జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా పలు దూషణలు పర్వం కొనసాగిన సంగతి విదితమే. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది.
Andhra Pradesh: రహదారి భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం,రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో రహదారి భద్రత కోసం రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారి ప్రాజెక్టుల అంచనాలో 2 శాతం రహదారి భద్రతా నిధికి జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
AP Assembly Session 2023: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా, జీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌తో సహా పలు కీలక బిల్లులకు ఆమోదం
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయిదోరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సభలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఇక శాసన మండలిలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి.
Telangana Rains: తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌, రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం
Hazarath Reddyరాగల మూడురోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది
Hyderabad Rains: అకస్మాత్తుగా హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, ఇంటికి వెళ్లే వారు అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచన
Hazarath Reddyహైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు రోడ్డులన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్‌ నగర్, మలక్ పేట, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్‌ వినాయకుడు నిమజ్జనం పూర్తి వివరాలు ఇవిగో, ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ
Hazarath Reddyమహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది.
Skill Development Scam Case: చంద్రబాబుకు రెండు కోర్టుల్లో చుక్కెదురు, బాబు పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు, బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
Hazarath Reddyస్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జెల్లో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ కోసం ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.
TSPSC Group-1 Prelim Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించండి, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థంచిన తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌
Hazarath Reddyతెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నారా లోకేష్‌
Hazarath Reddyఅమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది
Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా, పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు విముఖత చూపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపించారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది