రాష్ట్రీయం

AP Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్ బస్సు- ట్యాంకర్ ఢీ, అక్కడికక్కడే ఇద్దరు డ్రైవర్లు మృతి

Hazarath Reddy

Bandi Sanjay on BRS Govt: కేసీఆర్ సర్కారు 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బీఆర్ఎస్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇదిగో నా రాజీనామా.. నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’ అంటూ సవాల్ విసిరారు.

Hyderabad: హైదరాబాద్‌లో రూ. 69.04 లక్షల విలువైన రూ. 2000 నకిలీ నోట్ల మార్పిడి గుట్టు రట్టు చేసిన పోలీసులు, నలుగురు అరెస్ట్

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఫేక్ కరెనీ నోట్ల గుట్టును రట్టు చేశారు పోలీసులు, మోచి కాలనీలో రూ. 69.04 లక్షల విలువైన రూ. 2000 నకిలీ నోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీటిపై Children Bank of India" అని ముద్రించిన Fake Notesని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో ఇదిగో..

Video: షాకింగ్ వీడియో ఇదిగో, దుర్వాసన వస్తోందని ఇంట్లో నుంచి వృద్ధురాలిని ఈడ్చుకువెళ్లిన పక్కింటి మహిళ, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నూజివీడు పోలీసులు

Hazarath Reddy

కృష్ణా జిల్లా - నూజివీడులో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్ళారు. చాట్రాయి మండలం గుడిపాడులో అడిమిల్లి లూర్దమ్మ అనే వృద్ధురాలు అనారోగ్య కారణాల వల్ల దుర్వాసన వస్తుందని ఆమె ఇంటిపక్కనే ఉన్న సికాకొల్లు శ్యామల దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, పని సరిగా చేయని వీఆర్ఓ చెంప చెళ్లు మనిపించిన మహిళ, కర్నూలు జిల్లాలో ఘటన

Hazarath Reddy

కర్నూలు - తొమ్మిది ఎకరాల భూమి రెడ్ మార్క్ నుంచి తొలగించాలని పదే పదే కోరినా పట్టించుకోని విఆర్ఓ వేణు గోపాల్.నిన్న గోనెగొండ్ల తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగిన బాధితురాలు, భర్త మాజీ సర్పంచ్ వీరన్న. విసిగిపోయి చెంప చెళ్లుమనిపించిన మహిళ.

Vijayasai Reddy Counter to Chiranjeevi: సినీ రంగమేమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా? చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, కోట్లకు పడగలెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటున్నారంటూ ట్వీట్

VNS

ఏపీ ప్రభుత్వంపై నటుడు చిరంజీవి(Actor Chiranjeevi) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వరుస కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya saireddy) చిరంజీవి వ్యాఖ్యలపై ట్విటర్‌ (Twitter) వేదిక ద్వారా విరుచుకుపడ్డారు. సినీ రంగమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు.

Telangana Elections 2023: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటు కోసం కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విబేధాలు, అజారుద్దీన్, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య భగ్గుమన్న గొడవలు

Hazarath Reddy

జూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో అజారుద్దీన్‌ వర్గం సమావేశం నిర్వహించగా పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం అడ్డుకుంది

Group 2 Candidates Protest: గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందే, TSPSC కార్యాలయాన్ని ముట్టడించిన అభ్యర్థులు, ప్రిపరేషన్‌కు తగిన సమయం ఇవ్వాలంటూ డిమాండ్

Hazarath Reddy

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలను (Group 2 Exams) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించారు. హైదరాబాద్ లోని ఆఫీస్ వద్దకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు.

Advertisement

Video: వీడియో ఇదిగో,  బోర్ స్విచ్ వేస్తూ కరెంట్ షాక్ కొట్టి మహిళ అక్కడికక్కడే మృతి, సీసీటీవీ పుటీజీ బయటకు 

Hazarath Reddy

కూకట్‌పల్లిలో బోర్ స్విచ్ వేస్తూ షాక్ కొట్టి మహిళ మృతి. ఆల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్‌లో విద్యుత్ షాక్ కొట్టి గంగాభవాని(33) అనే వివాహిత మృతి

Telangana: వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలంటూ అతని ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని కుటుంబం ఆత్మహత్యాయత్నం. గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి ఆరున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.

Viral Video: కర్మ ఫలితం ఇలానే ఉంటుంది, కారును తప్పించుకుని డివైడర్‌ని ఢీకొట్టిన బైకర్, క్యాప్షన్ ఇవ్వండంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

ఈ వీడియోలో ఓ వ్యక్తి క్రాస్ రోడ్డు నుంచి నేరుగా మెయిన్ రోడ్డు మీదకు దూసుకువచ్చాడు. మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆ తర్వాత కారు డ్రైవర్ కి సెల్యూట్ చేస్తూ ముందుకు వెళుతే రోడ్డు డివైడర్ ని ఢీకొట్టాడు బైకర్..ఈ వీడియోని షేర్ చేస్తూ క్యాప్సన్ ఇవ్వండి అన్నారు సజ్జనార్

Devudu Name: చిన్నారికి 'దేవుడు' అని పేరుపెట్టిన సీఎం జగన్... గోదావరి ముంపు ప్రాంత పర్యటనలో ఘటన.. వీడియో వైరల్

Rudra

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జంట తమ పసికందును సీఎం జగన్ చేతుల్లో పెట్టి, తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరింది. అంతేకాదు, ఆంగ్లంలో డీ అనే అక్షరంతో ఆ పేరు మొదలయ్యేలా ఉండాలని ఆ దంపతులు తెలిపారు.

Advertisement

Fumes in Vande Bharat Train: వీడియో ఇదిగో, వందే భారత్ టాయిలెట్‌లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు, ఆందోళనకు గురైన ప్రయాణికులు

Hazarath Reddy

వందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి ఎస్సై మీద దాడి చేసిన మందుబాబు, రోడ్డుపై పడుకొని హల్‌చల్ చేసిన యువకుడు

Hazarath Reddy

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రాత్రిపూట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కోటగిరి మండలం, కొత్తపల్లికి చెందిన ఓ యువకుడు బాగా మద్యం తాగి భార్యతో స్వగ్రామానికి వెళ్తుండగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 360 శాతం ఆల్కహాల్ ఉన్నట్టు మిషన్లో వచ్చింది.

Bholashankar's Movie: చిరంజీవి భోళాశంకర్ మూవీకి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిరాకరించిన జగన్ సర్కారు

Hazarath Reddy

ఈ నెల 11న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు.

Andhra Pradesh:పేద పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, కొత్తగా పెళ్లైన వధువుల తల్లుల ఖాతాల్లోకి రూ.141.60 కోట్ల నిధులు జమ చేసిన సీఎం జగన్

Hazarath Reddy

2023 ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

Advertisement

Viral Video: ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణమా? షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని హెచ్చరిక

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం.

Bhumana Karunakar Reddy Met CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, వీడియో ఇదిగో

Hazarath Reddy

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్‌ గా నియమితులైన భూమన కరుణాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా సీఎంకు తిరుపతి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

Telangana: ఎంపీడీఓ ఆఫీసులో పైనుంచి ఊడి పడిన సీలింగ్‌పై ప్లాస్టర్లు, భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలో అధికారులు హెల్మెట్ ధరించడం ద్వారా భద్రతా చర్యలను అవలంబించారు. నాసిరకం భవనాలు ప్లాస్టర్లు పడిపోవడంతో వారికి ముప్పు పొంచి ఉంది. అందుకని వారు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం చేయలేమంటూ ఇలా హెల్మెట్లతో ఆఫీసుకు వచ్చారు. వీడియో ఇదే..

Video: జాగ్రత్త.. దొంగలు ఏ వస్తువును వదలడం లేదు, షాపు ముందు ఉన్న కరెంట్ బల్బ్ ను దొంగ ఎలా ఎత్తుకెళ్లాడో వీడియోలో చూడండి

Hazarath Reddy

దొంగలు ఏ వస్తువును వదలడం లేదు. తాజాగా కరెంట్ బల్బ్ దొంగతనం చేసిన వీడియో బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని కిషన్ బాగ్‌లో ఓ వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ దారిలో షాపు ముందు ఉన్న కరెంట్ బల్బ్ దొంగతనం చేసి ఎత్తుకువెళ్లాడు. వీడియో ఇదిగో..

Advertisement
Advertisement