రాష్ట్రీయం

CM KCR on Chandrababu: వీడియో ఇదిగో, మన శత్రువులు అంటూ చంద్రబాబుపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

గతంలో ఆంధ్రలో 1 ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు కొనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో 50 ఎకరాలు కొంటున్నారని తెలంగాణ ఏర్పడకూడదు అని కోరుకున్న మన శత్రువులు చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు - సీఎం కేసీఆర్

Golconda Bonalu 2023: గోల్కొండలో మొదలైన బోనాల పండుగ, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించిన మంత్రులు

Hazarath Reddy

ఆషాఢ బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్ట‌మొద‌ట‌గా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.

Railway Coach Factory Inauguration: కొండకల్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనున్నది. రైల్‌ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలువనున్నది.

Telangana: పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, శంకుస్థాపన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు.

Advertisement

Kollur Double Bedroom Houses Inauguration: కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, రూ.1,489.29 కోట్ల వ్యయంతో హౌసింగ్ నిర్మాణం

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో (Kollur) రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

Andhra Pradesh: రూ. 60 కోట్ల అక్రమాస్తులు, ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దాడులు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ (Bhimavaram Municipal Commissioner) ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జూన్‌ 21 (బుధవారం) దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులను వెలికితీశారు.

Margadarsi Chit Fund Scam: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసు, రామోజీరావు, శైలజా కిరణ్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు, జూలై 5న గుంటూరు సీఐడీ ఆఫీసుకు రావాలని ఆదేశాలు

Hazarath Reddy

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ఈ నాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌లు విచారణకు రావాలంటూ మరోసారి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇద్దరూ గుంటూరులోని సీఐడీ రీజనల్‌ ఆఫీస్‌కి జూలై5వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.

Andhra Pradesh Bus Fire: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో భారీగా మంటలు, అప్రమత్తమై రోడ్డు పక్కన బస్సును నిలిపివేసిన డ్రైవర్, ప్రయాణికులంతా సేఫ్

Hazarath Reddy

ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నడిరోడ్డుపై బస్సు దగ్ధం అయింది.ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బుధవారం హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరికి 27 మంది ప్రయాణికులతో బయలుదేరింది.

Advertisement

Hyderabad Murder Video: వీడియో ఇదిగో, వివాహేతర సంబంధం అనుమానం, నడిరోడ్డు మీద యువకుడిపై కత్తులతో దాడి

Hazarath Reddy

చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్‌పై వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త, బంధువులు వెంబడించి హత్య చేసి పరారయ్యారు

Telangana Shocker: దారుణం, మైనర్ బాలికను మేకల షెడ్డులో కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం, కామాంధుడుని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత తమ్ముడిగా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శక్కర్‌నగర్‌ కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కొత్తపల్లి రవీందర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. దారిన వెళుతున్న 13 ఏళ్ల బాలికను అడ్డుకున్న ఈ యువకుడు, ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు

Telangana Shocker: గేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఓనర్‌పై హత్యాయత్నం, సుపారీ గ్యాంగ్‌కు రూ. 50 లక్షలు ఇచ్చి భారీ స్కెచ్, తృటిలో తప్పించుకున్న కాంతారావు

Hazarath Reddy

కోదాడలో గేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో కాలేజ్‌ భాగస్వాములు ఒప్పందం చేసుకున్నారు.

Rythu Bandhu Scheme: ఇప్పటి వరకు రైతుబంధు రాని వారికి గుడ్ న్యూస్, ఆ రైతులంతా పెట్టుబడి సాయానికి అర్హులేనని తెలిపిన కేసీఆర్ సర్కారు, ఈ నెల 26 నుంచి రైతుబంధు పంపిణీ

Hazarath Reddy

రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తయి, పాస్‌బుక్‌ పొందినవారు ఈ సీజన్‌లో రైతుబంధుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది

Advertisement

TS CPGET Exam Date 2023: తెలంగాణ సీపీగెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు ఎగ్జామ్స్, ప్రతిరోజు మూడు సెషన్లలో పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CPGET) షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సీపీగెట్‌)ను ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

Pawan Kalyan On Tollywood Heros: ప్రభాస్, మహేష్ బాబు నాకంటే పెద్ద హీరోలు, మేమంతా ఒక్కటే! మీరెందుకు కొట్టుకొని చస్తారు? టాలీవుడ్ హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

VNS

ముమ్మడివరం జరిగిన సభలో మాట్లాడుతూ.. నాతో కొంతమంది చెప్తారు మీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) గొడవపడతారు ఎప్పుడూ అని నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ (Mahesh babu) గారు, బాలకృష్ణ (Balakrishna) గారు, అల్లు అర్జున్ (Allu Arjun) గారు, చిరంజీవి గారు..

Hyderabad Police Traffic Advisory: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం సందర్భంగా రోడ్లు మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలివే!

VNS

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఇవాళ ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం (Telangana Martyrs Memorial Inauguration) నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Asia's Largest 2 BHK Township: ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌ బెడ్‌రూం టౌన్‌ షిప్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, ఒకేచోట ఏకంగా 15వేలకు పైగా ఫ్లాట్లతో భారీ నిర్మాణాలు

VNS

గ్రేటర్‌ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు (Kolluru) గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని గురువారం ఉద యం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించనున్నారు.

Advertisement

Welfare Schemes in AP: ప్ర‌తి ఒక్క‌ ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లాలని సీఎం జగన్ ఆదేశాలు, అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ అభివృద్ధి సంక్షేమ ఫ‌లాలు అందడమే సీఎం జగన్ లక్ష్యమని తెలిపిన మంత్రి జోగి రమేష్

Hazarath Reddy

అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ అభివృద్ధి సంక్షేమ ఫ‌లాలు చేరాలన్న‌ది సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక‌ల్పం. ఇందుకోసం ప్ర‌తి ఒక్క‌రూ ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. మేం కూడా గేర్ మార్చుతాం.. స్పీడు పెంచుతాం.. మా గ్రాఫ్ పెర‌గ‌పోతే స‌ర్వేల్లో మంచి ఆద‌ర‌ణ లేక‌పోతే సీట్లు మార్చ‌డం ఖాయం: మంత్రి జోగి ర‌మేష్‌

Gaddar Suspended from Praja Shanti Party: వీడియో ఇదిగో, గద్దర్‌ను ప్రజా శాంతి పార్టీ నుండి సస్పెండ్ చేసిన కేఏ పాల్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నిర్ణయం

Hazarath Reddy

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సొంతంగా పార్టీ పెట్టినందుకు ప్రజా గాయకుడు గద్దర్ ని.. ప్రజా శాంతి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. వీడియో ఇదే..

Visakha MP MVV on Family Kidnap Case: రఘు రామకృష్ణంరాజు ఓ కుక్కతో సమానం, విశాఖ ఎంపీ ఎంవీవీ సంచలన వ్యాఖ్యలు, నా ఫ్యామిలీ కిడ్నాప్‌ను రాజకీయం చేయడం బాధాకరమని వెల్లడి

Hazarath Reddy

తన భార్య, కొడుకు కిడ్నాప్‌ను రాజకీయం చేయడం బాధాకరమని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రౌడీషీటర్లు హేమంత్‌, రాజేష్‌లు పథకం ప్రకారం కిడ్నాప్‌ చేశారని, హేమంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Somu Veerraju Slams Chandrababu: ప్రత్యేక హోదా వద్దన్నది నీవే, మళ్లీ కావాలనేది నీవే, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే.

Advertisement
Advertisement