ఆంధ్ర ప్రదేశ్

TDP-Janasena-BJP Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు..అమిత్‌ షాతో ముగిసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ.. ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన చేసిన ఎంపీ కనకమేడల..

sajaya

శనివారం కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు గంట పాటు జరిగింది. మూడు పార్టీల మధ్య లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

Bank Employees: బ్యాంక్‌ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 17% పెంపు.. ఐదు రోజులే పని.. ఐబీఏ, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం

Rudra

బ్యాంక్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్లు తాజాగా ఒక అంగీకారానికి వచ్చాయి.

Times Now-ETG Research Survey: లోక్ సభ ఎన్నికల్లో జగన్ పార్టీ హవా.. ఏపీలో వైసీపీకి 21-22 సీట్లు... టీడీపీ, జనసేన కూటమికి 4 సీట్లు.. తెలంగాణలో కాంగ్రెస్ కు 8-10, బీజేపీకి 4- 6, బీఆర్ఎస్ కు 2-4 సీట్లు.. దేశవ్యాప్తంగా మొత్తంగా ఎన్డీయేకు 358-398 సీట్లు.. ఇండియా కూటమికి 110-130.. టీఎన్-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి

Rudra

మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సత్తా చాటుతుందని కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది.

Andhra Pradesh Elections 2024: ఆ ఆరు ఎంపీ సీట్లు మాకిస్తే పొత్తుకు సై అంటున్న బీజేపీ పెద్దలు, 4 పార్లమెంట్ స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ

Hazarath Reddy

తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆరు పార్లమెంట్ స్థానాలు రాజమండ్రి, నరసాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపురం, అరకు స్థానాలను బీజేపీ కోరుతోంది. అయితే, టీడీపీ మాత్రం రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు ఇస్తామని బీజేపీకి ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Fishermen Protest in Kakinada: కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, అరబిందో పైప్‌ లైన్‌ తీయాలంటూ పెట్రోలు పోసుకొని మత్స్యకారుల ఆందోళన

Hazarath Reddy

ధర్నా చేపట్టి శుక్రవారంకి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు రాజకీయ నాయకుల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ బోట్లుకి తామే నిప్పంటించుకొని మత్స్యకారులు తీవ్ర నిరసన తెలిపారు.

Mahashivratri Greetings: జగమంతా శివమయం. నేడే మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేయండి. మీ కోసం ఫోటోలు ఇవిగో!

Rudra

జగమంతా శివమయం. నేడే మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేయండి. మీ కోసం ఫోటోలు ఇవిగో!

Mahashivratri Celebrations 2024: అంతటా శివోహం.. శివన్నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

Rudra

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Andhra Pradesh Elections 2024: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, అధికారికంగా ప్రకటించిన సీఎం జగన్ టీం

Hazarath Reddy

మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ Simhadri Chandrasekhar పేరును తాజాగా వైసీపీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం సాయంత్రం ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Arani Srinivasulu Joins Janasena: జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తనకు టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆవేదన

Hazarath Reddy

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆరణి శ్రీనివాసులుకు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.

Andhra Pradesh Elections 2024: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీకి లైన్ క్లియర్, ఆనయ నివాసంలో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ నేతలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్‌ఛార్జ్‌ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్‌ఛార్జ్‌ తోట నరసింహం భేటీ అయ్యారు.

Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వైద్యశాఖలో అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్యశాఖ ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రియల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తూ అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్‌ కృష్ణబాబు జీవో జారీ చేశారు.

CM Jagan Slams Pawan Kalyan: కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు, పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన సీఎం జగన్, వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులు విడుదల

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా పిసినికాడలో ‘వైఎస్సార్‌ చేయూత’ నాలుగో విడత నిధులను (YSR Cheyutha) బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. వైఎస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం పంపించింది

Advertisement

Kesineni Nani Slams Chandrababu: చంద్రబాబు కంటే జగన్ 20 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు, టీడీపీ అధినేతపై విరుచుకుపడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని

Hazarath Reddy

ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తుకు వస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ (YS Jagan) మూడేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) పేరిట ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం , అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచిపోవడం టీడీపీ అధినేతకు అలవాటేనని ఆరోపించారు.

Input Subsidy to Farmers: మిచాంగ్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల, 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,294.58 కోట్ల పరిహారం జమ చేసిన సీఎం జగన్

Hazarath Reddy

గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(crop loss compensation)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

Poonam Kaur on Jagan Govt: కరోనాలో జగన్ నంబర్ వన్ పాలన అందించారు, ఏపీ ప్రభుత్వంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ ప్రశంసలు

Hazarath Reddy

కరోనా సమయంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రముఖ హీరోయిన్‌ పూనమ్ కౌర్ సీఎం జగన్ ను ప్రశసించారు.కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది.

Veligonda Project Twin Tunnel Inauguration: వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్, దశాబ్దాల కల సాకారం అయినందుకు గర్వంగా ఉందని వెల్లడి

Hazarath Reddy

ప్రకాశం, కడప, నెల్లూరులోని కరువు పీడిత, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఏగువాచెర్లోపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.

Advertisement

Kodali Nani Slams Chandrababu: చంద్రబాబును ఓడిపోతేనే జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

చంద్రబాబు దివంగత ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారంటూ మండిపడ్డారు.

Michaung Cyclone Input Subsidy: ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్, ఇన్ పుట్ స‌బ్సిడీ విడుద‌ల చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తుఫాన్ తో న‌ష్ట‌పోయిన రైతుల ఖాతాల్లోకి రూ. 1294 కోట్లు రిలీజ్

VNS

వైసీపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం జగన్ (CM YS Jagan) ఇవాళ రైతుల ఖాతాల్లో ఇన్ ఫుట్ సబ్సిడీని జమ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Raithu Bhrosa), పీఎం కిసాన్ పథకం కింద పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని (Input subsidy) పంపిణీ చేయనున్నారు.

Road Accident In Nandyal: నంద్యాల‌లో ఘోర‌రోడ్డు ప్ర‌మాదం, పెళ్లైన వారం రోజుల‌కే న‌వ‌దంప‌తుల మృతి, తిరుమ‌ల వెళ్లివ‌స్తుండ‌గా యాక్సిడెంట్, ఐదుగురు మృతి

VNS

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident In Nandyal) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనుకాల వేగంగా వచ్చిన కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి (5 Dead) చెందారు.

YSRCP New Slogan: నాకు ఒక కల ఉంది అంటూ వైసీపీ కొత్త నినాదం, ఈ నెల 10న జరగనున్న సిద్ధం సభ కోసం ప్రచారం ముమ్మరం

Hazarath Reddy

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ కొత్త ప్రచార అస్త్రానికి పదునుపెట్టింది. ఇప్పటి వరకు ‘సిద్ధం పేరుతో హోర్డింగులు కనిపించగా, తాజాగా ‘నాకు ఒక కల ఉంది అంటూ ఆయా వర్గాల పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

Advertisement
Advertisement