ఆంధ్ర ప్రదేశ్
Pawna Kalyan Selfie at Ram Mandir: అయోధ్య రామమందిరం ఎదుట సెల్ఫీ తీసుకున్న పవన్ కళ్యాణ్, రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం అంటూ ట్వీట్
Hazarath Reddyపవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు.నేడు శాస్త్రోక్తంగా జరిగిన బాల రాముడి దివ్య మంగళ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం ఎదుట పవన్ ఓ సెల్ఫీ తీసుకున్నారు.
Ram Temple Inauguration: వీడియో ఇదిగో, అయోధ్య రామజన్మభూమి ఆలయంలో చంద్రబాబు, రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ అధినేత
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి చేరుకున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.
Ayodhya Ram Mandir Inauguration LIVE: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే..రామనామ స్మరణలో యావత్తు దేశం..మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ.. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం (లైవ్ వీడియో)
Rudraయావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే జరుగనున్నది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుంది.
AP PCC Cheif YS Sharmila: సీఎం అయ్యాక జగన్‌ ఒక్కసారైనా ప్రత్యేక హోదాపై పోరాడారా..ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం..
sajayaవైఎస్ షర్మిల మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ఆర్ గతంలో రెండుసార్లు పిసిసి అధ్యక్ష పదవిని నిర్వహించారని, తనపై నమ్మకం ఉంచి ఆ బాధ్యతను అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లుగా అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి), గత తెలుగుదేశం పార్టీ (టిడిపి) పాలన సాగించాయని షర్మిల విమర్శించారు.
YS Sharmila: షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
sajayaఅధికార వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో వైఎస్‌ షర్మిల సమక్షంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రెడ్డితో పాటు శెట్టి గంగాధర్, ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Konathala Ramakrishna: జనసేనలో చేరుతున్నా.. పవన్ తోనే నా రాజకీయ ప్రయాణం : కొణతాల రామకృష్ణ (Video)
sajayaమాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత కె.పవన్ కళ్యాణ్‌ను కలిశారు, ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్‌తో కొణతాల రామకృష్ణ చర్చలు జరిపారు.
Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!
Rudraపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
CM Jagan Slams TDP: దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు, సామాజిక సమతా సంకల్ప సభలో ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్
Hazarath Reddyపెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) మండిపడ్డారు.
Statue of Social Justice Unveiled: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం వీడియో ఇదిగో, స్వరాజ్య మైదాన్‌లోఆవిష్కరించిన సీఎం జగన్
Hazarath Reddyవిజయవాడ స్వరాజ్య మైదాన్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
Statue Of Social Justice: ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన అంబేద్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌, సామాజిక న్యాయ మహా శిల్పమంటూ అభివ‌ర్ణించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్, విగ్ర‌హ ప్ర‌త్యేక‌త‌లివే!
VNSప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ (Statue Of Social Justice) విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్ర‌హాన్ని స్టాట్యూ ఆఫ్ సోష‌ల్ జ‌స్టిస్ గా (Statue Of Social Justice) అభివర్ణించింది రాష్ట్ర ప్ర‌భుత్వం.
Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌, సుప్రీంకోర్టులో కేసు విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా, 4 వారాల గడువు కోరిన చంద్రబాబు తరపు లాయర్
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో TDP అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే కోరారు.
Ram Lalla Statue in Ayodhya Ram Temple: అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య రామ్ లల్లా.. విగ్రహం తొలి ఫొటో ఇదే..
Rudraజాతి జనులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్‌ లల్లా విగ్రహాన్ని చేర్చారు.
YS Raja Reddy Engagement: వీడియో ఇదిగో, సోదరి షర్మిలను ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న సీఎం జగన్, మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్‌ దంపతులు
Hazarath Reddyతన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చి­తార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చి­తార్థ వే­డుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
YSRCP 4th List: వైసీపీ నాలుగో జాబితా విడుదల, మొత్తం 9 మంది అభ్యర్థులతో 4వ జాబితా విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
Hazarath Reddyసుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ తొమ్మిది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. రీజినల్‌ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.
206 Feet BR Ambedkar Statue Video: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రేపు, 206 అడుగుల మహాశిల్ప ఆవిష్కరణకు ప్రజలంతా తరలిరావాలని సీఎం జగన్ పిలుపు
Hazarath Reddyభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 206 అడుగుల మహాశిల్పాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పింది. విజయవాడలో మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాకుండా దేశానికే ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్‌లో రాశారు.
Andhra Pradesh: 4.07 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి రూ.46.9 కోట్లు, ఇళ్ల లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సీఎం జగన్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి 4.07 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.46.9 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు.
Srivari Seva Tickets: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుద‌ల‌, ఏప్రిల్ నెలలో సుప్ర‌భాతం, తోమాల వంటి సేవ‌ల‌కోసం ల‌క్కీడిప్ రిజిస్ట్రేష‌న్లు మొదలు
VNSసుప్రభాతం (Suprabhatham), తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ (Luckey DIP) కోసం ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత రుసుం చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
Rajareddy Engagement: మేన‌ల్లుడి నిశ్చితార్ధానికి హాజ‌రుకానున్న వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, చాలా రోజుల త‌ర్వాత ఒక్క‌టి కానున్న వైయ‌స్సార్ ఫ్యామిలీ
VNSమేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ (Ys Sharmila Son Rajareddy) వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ (YS Jagan) ఇవాళ‌ హైదరాబాద్ కు రానున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు.
Tribute to NTR: ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నంద‌మూరి కుటుంబ స‌భ్యుల నివాళులు, తాత‌కు ఘ‌నంగా నివాళులు అర్పించిన జూనియ‌ర్ ఎన్టీఆర్
VNSహైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) నివాళులర్పించారు. తెల్లవారు జామున ఘాట్ వద్దకు చేరుకొని అంజలి ఘటించారు. మరోవైపు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
Sankranti Holidays Extended: సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగించిన ఏపీ సర్కారు, జనవరి 22న పాఠశాలలు పునఃప్రారంభం
Hazarath Reddyఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.