ఆంధ్ర ప్రదేశ్
Weather Forecast: జాడలేని అల్ప పీడనాలు, హిమాలయాల వద్ద తిష్ట వేసిన రుతుపవనాలు, వచ్చే నెలలో కూడా వర్షాలు కష్టమే, ఆందోళన వ్యక్తం చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyజూలైలో భారీ వర్షపాతంతో హడలెత్తించిన రుతపవనాలు ఆగస్టులో నెమ్మదించాయి. ఫలితంగా అత్యంత తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ఆగస్టు తర్వాత సెప్టెంబరు వర్షపాతం తగ్గుముఖం పట్టిందని ఇది ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.
Telugu Language Day: తెలుగు భాషా దినోత్సవం, ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి అంటూ సీఎం జగన్ శుభాకాంక్షలు
Hazarath Reddyతెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు.
NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?
Rudraఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
Telugu Language Day 2023: నేడు తెలుగు భాషా దినోత్సవం.. ఆగస్టు 29న ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలుగు భాషా దినోత్సవంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే??
Rudraనేడు తెలుగు భాషా దినోత్సవం. ఆగస్టు 29న ఏటా ఈరోజును జరుపుకుంటారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషలో ఆయన చేసిన అద్భుతమైన పనిని గౌరవించటానికి.. ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకుని, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న జరుపుకుంటారు.
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ
Rudraఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.
Andhra Pradesh: విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైనా సరే నో మొబైల్, ఏపీలోని అన్ని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధిస్తూ కీలక ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలలకు విద్యార్థులు ఫోన్లను తీసుకురాకుండా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తమ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని ఆదేశించింది.
Lakshmi Parvathi: మరో లేఖ విడుదల చేసిన లక్ష్మీపార్వతి, పురంధేశ్వరిపై నా పోరాటం కొనసాగుతుందని లేఖలో వెల్లడి
Hazarath Reddyఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. విడుదల చేసిన లేఖలో ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. లేఖ ఇదే..
Jagananna Vidya Deevena: సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు, అందుకే దత్త పుత్రుడుకి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు, జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyజగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సోమ­­వారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో బటన్‌ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేసింది ఏపీ ప్రభుత్వం.
NTR Commemorative Coin Released: ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము, ఎన్టీఆర్ నాణెం ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyనందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు.
Fake Voters in Telangana: తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లలో 50% హైదరాబాద్‌లోనే..
Rudraతెలంగాణలో భారీఎత్తున బోగస్ ఓట్లు బయటపడ్డాయి. వీటిని ఈసీఐ తొలగించింది. దాదాపు10 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందినవారేనని సమాచారం.
Andhra Pradesh: చెన్నై విమానాశ్రయంలో కుప్పకూలి మృతి చెందిన చిత్తూరు వాసి, దక్షిణాఫ్రికా నుంచి సొంత ఊరికి తిరిగివస్తూ మధ్యలోనే తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyచెన్నై విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌లో ఆదివారం ముంబై నుంచి విమానం దిగి వచ్చిన 47 ఏళ్ల వ్యక్తి ఏరోబ్రిడ్జ్‌లో కుప్పకూలి మృతి చెందాడు. దక్షిణాఫ్రికాకు చెందిన సోలమన్ మార్టిన్ లూథర్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ తన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు వెళ్తున్నాడు.
Balka Suman: కాంగ్రెస్ పార్టీలోకి కోవర్టులను పంపాం.. కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనొద్దు.. కార్యకర్తలకు బాల్క సుమన్ హితవు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే
Rudraమరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు.
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. అధికారుల ప్రయత్నాలకు ఎట్టకేలకు దక్కిన ఫలితం.. ఇప్పటివరకూ నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు
Rudraతిరుమలలో చిరుతలను పట్టుకునేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తాజాగా తెలిపారు.
Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. సెప్టెంబరు 1 వరకు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు.. ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణలో సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది.
Tomato Price Fall: భారీగా పడిపోయిన టమాటా ధర, రూ.20కి పడిపోయిన 1 కేజీ టమాటా ధర, పత్తికొండ మార్కెట్‌లో రూ.10లకు పడిపోయిన టమాటా ధర
ahanaభారీగా పడిపోయిన టమాటా ధరలు. రూ.20కి పడిపోయిన టమాటా ధర. కర్నూలు, పత్తికొండ మార్కెట్‌లో రైతులకు రూ.10 కూడా దక్కని పరిస్థితి. కనీస పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన. మూడు వారాల క్రితం కిలో రూ. 100 పలికిన టమాటా.
Andhra Pradesh Shocker: సిగరెట్లు తీసుకురాలేదని ఏడో తరగతి విద్యార్ధిని చితకబాది చేయి విరగ్గొట్టిన యువకుడు, బాధిత బాలుడు ఆసుపత్రి పాలు..
ahanaఈస్ట్ గోదావరి - కోరుకొండ మండలం కణపుర్ గ్రామానికి చెందిన సతీష్ (23) అదే గ్రామానికి చెందిన శశిధర్ (13) అనే విద్యార్థిని రోడ్డు మీద వెళ్తుండగా ఆపి సిగరెట్లు తేవాలని కోరాడు. శశిధర్ వినకపోవడంతో అతడిని చావబాది వెనక నుండి తన్నడంతో కాలు, చెయ్యి విరిగి ఆసుపత్రి పాలయ్యాడు.
Rail Over Rail Bridge: గూడూరు-మనుబోలు స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల పొడవుతో అత్యంత పొడవైన రైల్ వంతెన.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత పొడవైన ఆర్వోఆర్‌గా గుర్తింపు.. వీడియో ఇదిగో!
Rudraఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లాలోని గూడూరు-నెల్లూరు జిల్లాలోని మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన అత్యంత పొడవైన రైల్వే ఫ్లై ఓవర్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
TDP vs YSRCP: వీడియో ఇదిగో, నారా లోకేష్ పాదయాత్రలో తన్నుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, మా ఊరు వచ్చి మమ్మల్నే కొడతారా అంటూ వైసీపీ అభిమానులు ఆగ్రహం
Hazarath Reddyఏలూరు జిల్లా - నూజివీడు మండలం తుక్కులూరులోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించగా కొందరు వైసీపీ జెండాలు ఊపారని లోకేష్ యువగళం టీం సభ్యులు ఒక్కసారిగా వైసీపీ అభిమానులపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా, 10 మందికి గాయాలు, బస్సులో 40 మంది ప్రయాణికులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా తోటచర్ల గ్రామ శివారు 65వ జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో మొత్తం పది మందికి గాయాలైనట్లు అధికారి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు విజయనగరం వెళ్తోంది. ఈ ప్రమాదంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, 10 మంది గాయపడ్డారని అధికారి తెలిపారు.
Central Tribal University in AP: నన్ను గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు, ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను వారికి అందించేందుకే గిరిజన వర్సిటీ, సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyవిజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర మంత్రులు, ఎ‍మ్మెల్యేలు పాల్గొన్నారు.