ఆంధ్ర ప్రదేశ్
Godavari Floods: గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్‌ సమీక్ష , మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశం
Krishnaగోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం.. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు.
Andhra Pradesh Floods: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే, అనంతరం అధికారులతో సమీక్ష
Hazarath Reddyగోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్‌ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించనున్నారు.
YSR Vahana Mitra 2022: నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను, రూ. 10వేల అకౌంట్లో పడ్డాయి చూడండి, మొత్తం రూ.261.51 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సీఎం జగన్
Hazarath Reddyవిశాఖపట్నంలో జరిగిన ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం కార్యక్రమంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను బటన్‌నొక్కి వారి ఖాతాల్లో (YSR Vahana Mitra Scheme 4th Phase Payment) జమచేశారు.
YSR Vahana Mitra 2022: వైఎస్సార్‌ వాహన మిత్ర నేడే, ఆటో డ్రైవర్ అకౌంట్లలో రూ. 10 వేలు జమచేయనున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyరవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకాన్ని (YSR Vahana Mitra 2022) రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా అందించనుంది. ఇందులో భాగంగా సీఎం జగన్ విశాఖ నుంచి వైఎస్సార్‌ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్నారు.
Andhra Pradesh Floods: ఏపీలో గోదావరి వరదలు, రంగంలోకి దిగిన రెండు నేవీ హెలికాఫ్టర్లు, వరద బాధితులకు పైనుంచి ఆహార సామాగ్రిని జారవిడిచిన UH3H హెలికాప్టర్లు
Hazarath Reddyగోదావరి నది భారీ వరదల కారణంగా రెస్క్యూ & రిలీఫ్ ఆపరేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క ఏలూరు జిల్లా పరిపాలన నుండి వచ్చిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా, భారతీయ నౌకాదళం మానవతా సహాయం అందించడానికి రెండు మీడియం-లిఫ్ట్ UH3H హెలికాప్టర్లను ప్రారంభించిందని ఇండియన్ నేవీ తెలిపింది.
Godavari Floods: ఏపీని ముంచెత్తిన వరదలు, గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే, గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyఏపీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో (flood-hit areas) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) రేపు(జులై 15, శుక్రవారం) మధ్యాహ్నం ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు
Godavari Floods: ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, జల దిగ్భంధంలో పలు గ్రామాలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది, ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు
Hazarath Reddyమహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటం.. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది ( Godavari river) బుధవారం మహోగ్రరూపం దాల్చింది. గోదావరి నది (Godavari Floods) వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు.
YCP vs TDP: టీడీపీ కోసం పనిచేస్తున్న ఫేక్ వెబ్‌సైట్లు ఇవే! ఆధారాలతో సహా సోషల్ మీడియాలో వెల్లడించిన వైసీపీ ఎమ్మెల్యే, రాబిన్ శర్మను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్
Naresh. VNSఏపీలో సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సర్వే(Center for national studies survey) కాకరేపుతోంది. ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందని ఈ సర్వేలో వెల్లడైంది. దీంతో వైసీపీ నేతలు దీనిపై కౌంటర్లు వేస్తున్నారు. సర్వే ఏజెన్సీ ఫేక్ అంటూ మండిపడుతున్నారు. సెంటర్ ఫర్ నేషనల్ స్డడీస్ సంస్థ అధినేత రాబిన్ శర్మ(Robin sharma) ఒక మోసగాడు అంటూ ఫైరయ్యారు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
Perni Nani Fires on TDP:అదంతా బోగస్ సర్వే! రాబిన్ శర్మ టీడీపీ జీతగాడు, జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్‌ను ఎవరూ పడేయలేరు, పొలిటికల్ సర్వేపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్, టీడీపీని పైకి లేపే కుట్ర అంటూ మండిపాటు
Naresh. VNSఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(JaganMohanReddy) గ్రాఫ్ పడిపోయిందంటూ ఏపీలో విడుదల చేసిన ఓ సర్వే(Survey) సంచలనం సృష్టిస్తోంది. సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థ(Center for National Studies) పేరిట రిలీజ్ అయిన ఈ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వైసీపీ నేతలు దీనికి కౌంటర్ ఇస్తున్నారు. సర్వే రిలీజ్ చేసిన సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థపై మండిపడ్డారు
CM Jagan Review: ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని చికిత్సలు, ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా వైద్యం, ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అందుబాటులోకి
Hazarath Reddyఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైద్యారోగ్య శాఖను ఆదేశించారు.
APSRTC: సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, RTCలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్, 896 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం
Hazarath Reddyఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు జగన్ సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ (AP govt. gives green signal) ఇచ్చింది. కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు (compassionate appointments) సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది
Andhra Pradesh Rains: ఒడిశా తీరంలో మరింతగా బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం, హెచ్చరికలు జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
Hazarath Reddyకొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ( low pressure formed over the Odisha-AP coast) మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్లు తెలిపింది.
Liquor Bottles Destroyed: మందుబాబులు ఇది విన్నారా, రూ.3.14 కోట్ల విలువైన మద్యం రోడ్డు రోలర్లతో తొక్కించేశారు, నెల్లూరు జిల్లాలో మద్యం ధ్వంసం చేసిన పోలీసులు
Hazarath Reddyఏపీలోని నెల్లూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న రూ.3.14 కోట్ల విలువైన మద్యాన్ని ( Liquor bottles) పోలీసులు ధ్వంసం చేశారు. 74,547 మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్లతో (Liquor Bottles Destroyed) తొక్కించారు. గత మూడేండ్లుగా దాడులు నిర్వహించిన స్వాధీనం చేసుకున్న ఈ బాటిళ్లను పోలీస్ అధికారులు పగులగొట్టించారు.
Sanitation Workers Strike: కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తేనే చర్చలు, డిమాండ్లలో ఆరోగ్య భత్యం మినహా అన్ని సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
Hazarath Reddyఏపీలో గత మూడు రోజుల నుంచి పట్టణ పారిశుధ్య కార్మికులు సమ్మె (Sanitation Workers Strike) పలు డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పట్టణ పారిశుధ్య కార్మికులు సమ్మెను విరమించి, విధుల్లోకి వస్తేనే వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని పురపాలక శాఖ మంత్రి (Minister Adimulapu Suresh) తెలిపారు.
Weather Update: మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలే, తీవ్ర అల్పపీడనంగా బలపడిన అల్పపీడనం, తెలంగాణలో 13 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏపీలో వర్షాలపై సీఎం జగన్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
Draupadi Murmu AP Tour: ఒక్క ఓటు కూడా వృథా కాకూడదు, ద్రౌపది ముర్ముకు పూర్తి మద్దతు ప్రకటించిన ఏపీ సీఎం జగన్, మా ప్రభుత్వం సామాజిక న్యాయం వైపు ఉందని వెల్లడి
Hazarath Reddyఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు (Draupadi Murmu AP Tour) వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఏపీకి చేరుకున్నారు. అనంతరం ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (CM Jagan ) కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు.
EAPCET 2022 Answer Key: ఏపీ ఎంసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల, cets.apsche.ap.gov.in ద్వారా వివరాలు చెక్ చేసుకోండి, EAPCET వెబ్‌సైట్‌లో ఎలా చెక్‌ చేసుకోవాలో తెలుసుకోండి
Hazarath Reddyఏపీ ఎంసెట్ “కీ” విడుదల అయింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ ఎంసెట్-2022 జవాబు కీ నీ ఈరోజు విడుదల చేశారు. ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్ లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలతో పాటు AP EAMCET ఆన్సర్ కీ ని విడుదల చేయబడింది.
Draupadi Murmu AP Tour: సీఎం జగన్ నివాసానికి చేరుకున్న ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వైసీపీ ఎంపీలు
Hazarath Reddyఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, గోరంట్ల మాధవ్‌ స్వాగతం పలికారు.
Guntur Shocker: రూ 20 వేల లోన్‌కి రూ. 2 లక్షల వసూలు చేసిన ఆన్‌లైన్ లోన్‌ యాప్ నిర్వాహకులు, ఇంకా కట్టాలని వివాహితకు వేధింపులు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు
Hazarath Reddyఏపీలో గుంటూరు జిల్లాలో విషాదం (Guntur Shocker) చోటు చేసుకుంది. ఆన్‌లైన్ లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక గుంటూరు జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య ( woman ends life over harassment) చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో చోటు చేసుకుంది.
Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతూ.. 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది.