ఆంధ్ర ప్రదేశ్
Electricity Charges Hike: ఏపీలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు, 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంపు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను పెంచింది. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు (Electricity Charges Hikes in AP) పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.40 పైసలు పెంచుతూ ప్రభుత్వం (Andhra Pradesh govt) నిర్ణయం తీసుకుంది
New Districts in AP: ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ, ఏప్రిల్‌ 4న కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు చేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) బుధవారం సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.
Visakha Road Accindent: విశాఖలో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు కింద పడి ఎయిర్‌పోర్టు ఉద్యోగిని మృతి, ఆమె తండ్రికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఏపీలో విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని షీలానగర్‌ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Visakha Road Accindent) ఎయిర్‌పోర్టు ఉద్యోగిని దుర్మరణం చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
CM Jagan Review: ఏపీలో కొత్త జిల్లాల అంశంపై సీఎం జగన్ సమీక్ష, కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై ప్రధానంగా చర్చలు, ఉగాది నుంచి జిల్లాల పునర్విభజన లైవ్ లోకి..
Hazarath Reddyజిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో కొత్త జిల్లా (creation of new districts) కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది
Andhra Pradesh: ఏపీలో సినీ హబ్‌గా కర్నూలు, 12 ఎకరాల్లో ఫిలింసిటీని అభివృద్ధి చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపిన ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు
Hazarath Reddyకర్నూలు సినీ హబ్ గానూ అభివృద్ధి చెందేందుకు అన్ని హంగులు కలిగివున్న నగరం అని సీనియర్ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత కేఎస్ రామారావు (Tollywood producer KS Ramarao) అభిప్రాయపడ్డారు.
Weather Forecast: ఎండలు బాబోయ్ ఎండలు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వడగాడ్పులు, తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే వడగాడ్పులు రంగప్రవేశం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎండలు (Heat Wave) పెరుగుతున్నాయి. క్రమేపి పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది.
Corona in AP: ఏపీలో కొత్తగా 29 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో 10 కొత్త కేసులు నమోదు, తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 6,396 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 10 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
Andhra Pradesh:సీఎం జగన్‌ను కలిసిన నోబెల్‌ గ్రహీత ఎస్తేర్‌ ఢఫ్లో, అనంతరం చీఫ్ సెక్రటరీ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఎస్తేర్‌ ఢఫ్లో భేటీ
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నోబెల్‌ గ్రహీత ఎస్తేర్‌ ఢఫ్లో (ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆర్ధికవేత్త) సోమవారం కలిశారు. 2019లో ఆర్ధిక శాస్త్రంలో అభిజిత్‌ బెనర్జీ, మైఖేల్‌ క్రీమెర్‌తో కలిపి ఎస్తెర్‌ ఢఫ్లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు.
Visakh Refinery Expansion: ఏపీకి గుడ్ న్యూస్..విశాఖ రిఫైన‌రీ ఆధునికీక‌ర‌ణ‌ వ్యయం రూ.26,264 కోట్ల‌కు పెంచుతూ కేంద్రం కీలక ప్ర‌క‌ట‌న‌, రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజయ సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన కేంద్రం
Hazarath Reddyవిశాఖ ప‌రిధిలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఆధునికీకరణకు (Visakh Refinery Expansion) రూ.20,928 కోట్ల మేర వ్య‌యం అవుతుంద‌ని గ‌తంలో కేంద్రం అంచ‌నా వేసింది. అయితే తాజాగా ఈ వ్యయాన్ని రూ.26,264 కోట్లకు సవరిస్తున్నట్లు సోమ‌వారం కేంద్ర పెట్రోలియం శాఖ స‌హాయ మంత్రి రామేశ్వ‌ర్ తెలిపారు.
Andhra Pradesh: సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేరు, గౌతమ్‌ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్
Hazarath Reddyగౌతమ్‌ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర‍్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు. గౌతమ్‌ రెడ్డి ప్రతీ అంశంలోనూ నన్ను ప్రోత్సహించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌతమ్‌ రెడ్డి గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతాం.
CM YS Jagan to Visit Nellore: నెల్లూరుకు బయలుదేరిన సీఎం జగన్‌, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పొల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyదివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు బయలుదేరారు. దీంతో పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
CM Jagan Congrats Pv Sindhu: పీవీ సింధును అభినందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, మన జాతి గర్వించేలా చేశావు అంటూ ట్వీట్
Hazarath Reddyభారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్విస్‌ ఓపెన్‌ 2022 ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింధును అభినందించారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 27 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 8,948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
Husband Harassment: కట్టుకున్న భార్యను సొంత అన్నతో శృంగారం చేయమని బలవంతం పెడుతున్న భర్త, ప్రోత్సహిస్తున్న అత్తామామలు, ఓ అభాగ్యురాలి వేదన..
Krishnaఎన్నో ఆశలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి భర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఏ భార్య వినకూడని మాట భర్త నోటి నుంచి వచ్చింది. చివరకు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన దుస్థితి తెచ్చాడా మృగాడు.
Kadapa Shocker: ప్రాణం తీసిన వివాహేతర బంధం, ఎంజాయ్ చేద్దామని ఆంటీని రమ్మని పిలిచి, నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి హతమార్చిన యువకుడు...
Krishnaఈ నెల 11వ తేదీన కడప జిల్లా అనుంపల్లి అడవుల్లో చోటుచేసుకున్న మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తేల్చారు. మృతురాలి ప్రియుడే అతికిరాతకంగా హతమార్చి ఒంటిపై వున్న బంగారాన్ని దోచుకున్నట్లు పోలీసులు నిర్దారించారు.
Chittoor Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 8 మంది మృతి, 54 మందికి గాయాలు
Krishnaచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 54మంది తీవ్రంగా గాయపడ్డారు.
Sai Dharam Tej New Film: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి వీడియో రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, కొత్త మూవీ అనౌన్స్ చేసిన తేజు, తనను కాపాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల
Naresh. VNSతేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమామలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్‌లకు (Pawan Kalyan) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.
Chittoor Shocker: తన కంటే వయస్సులో చిన్నవాడైన పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ, బోర్ కొట్టి వదలియేడంతో, కుర్రాడు రెచ్చిపోయి ఏం చేశాడో తెలిస్తే...
Krishnaక్షణిక సుఖం కోసం పండంటి జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. భర్త లేని లోటును తనతో పనిచేసే వ్యక్తితో పంచుకోవాలని చూసింది మహిళ. పనిచేసే చోట పరిచయమైన వ్యక్తితో ఏర్పడిన చనువు సంబంధానికి దారితీసింది.
Corona in AP: ఏపీలో కొత్తగా 41 మందికి కరోనా, గడచిన 24 గంటల్లో ఏపీలో 75 మంది డిశ్చార్జ్
Hazarath Reddyఏపీలో కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిపోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 75 మంది కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 395కి పడిపోయింది. కొత్త కేసుల విషయానికొస్తే... తాజాగా 10,502 కరోనా పరీక్షలు చేపట్టగా, 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.