ఆంధ్ర ప్రదేశ్
Bigg Boss OTT Telugu: మొదలైన బిగ్‌ బాస్ తెలుగు ఓటీటీ, కంటెస్టెంట్ల ఫుల్ లిస్ట్ ఇదే! అన్ని సీజన్లలోని కంటెస్టెంట్లనే తిరిగి తెచ్చిన బిగ్ బాస్, ఒకరిద్దరు కొత్త మొహాలకు చోటు
Naresh. VNSతెలుగు బిగ్ బాగ్ ఓటీటీ (Bigg Boss Telugu OTT ) మొదలైంది. నో కామా...నో ఫుల్ స్టాప్ అంటూ బిగ్ బాస్ ఓటీటీని మొదలు పెట్టారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో (Disney+ Hotstar) ఈ షో ప్రసారం మొదలైంది
KCR Flexi In Vijayawada: విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ అభిమానులు
Krishnaఏపీలోని విజయవాడలో పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Nellore Transgender:అమ్మాయిగా మారుస్తామంటూ మర్మాంగం కోశారు, లాడ్జిలో ఆపరేషన్ చేసిన బీ ఫార్మసీ విద్యార్ధులు, డబ్బుల కోసం కక్కుర్తిపడ్డ స్టూడెంట్స్, ప్రాణాలు తీసిన సోషల్ మీడియా పరిచయం
Naresh. VNSఇద్దరు బీ ఫార్మసీ విద్యార్ధులు.. ఒక లాడ్జీలో (Lodge) ఓ ట్రాన్స్ జెండర్ (Transgender) కు లింగమార్పిడి ఆపరేషన్ చేయడంతో అది వికటించి...అతను చనిపోయాడు. ఓ లాడ్జి గదిని ఆపరేషన్‌ థియేటర్‌గా చేసుకుని లింగమార్పిడి (Gender change) శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై పల్స్‌డౌన్‌ కావడంతో ఓ ట్రాన్స్‌జెం డర్‌ మృతి చెందాడు.
Telangana High Court: అగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌ కేసుల్లో కీలక మలుపు, రెండు కేసుల వివాదాలను ఏలూరు కోర్టుకు బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyఅగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: భోగాపురం ఎయిర్ పోర్టు త్వరగా పూర్తి చేసేలా అనుమతులు ఇవ్వండి, మిగతా ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి కోసం వెంటనే సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీ ఇవ్వండి, కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇవాళ(శుక్రవారం) కేంద్రానికి లేఖలు రాశారు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలని లేఖల్లో ఆయన కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖలకు వేర్వేరుగా లేఖలు పంపారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 280 మందికి కరోనా, 4,709 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 18,915 కరోనా పరీక్షలు నిర్వహించగా, 280 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంత‌పురం, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో అత్య‌ధికంగా 44 కేసుల చొప్పున న‌మోదు కాగా.. ప్ర‌కాశం జిల్లాలో 40 కేసులు న‌మోద‌య్యాయి.
Andhra Pradesh: ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా రప్పించండి, కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు ఫోన్ చేసిన సీఎం జగన్
Hazarath Reddyఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఏపీ సీఎం జ‌గ‌న్ (AP CM YS Jagan) చ‌ర్య‌లు చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు (Union Foreign Minister ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు.
Tirumala: వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం, శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు, సామాన్య భక్తులకే కేటాయించాలని నిర్ణయం
Hazarath Reddyవీఐపీ బ్రేక్‌ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో (Saturday and sunday) వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు (TTD cancels VIP break darshan system) చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: మార్చి 27 నుంచి కడప నుంచి ఇతర నగరాలకు ఇండిగో సేవలు, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు
Hazarath Reddyప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి అయిదు నగరాలకు సర్వీసులు (IndiGo to start flights) నడపనుంది. వీటిలో మార్చి 27 నుంచి (five cities from Mar 27) చెన్నై, విజయవాడ, హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సర్వీసులు అందిస్తున్న నగరాల్లో కడప 73వది.
Hamsa Nandini: క్యాన్సర్ పై సగం గెలిచా: హంసా నందిని, మరో పోరాటానికి రెడీ అవుతున్నా, త్వరలోనే సర్జరీలు ఉన్నాయంటూ పోస్ట్, తన ట్రీట్ మెంట్ అప్‌డేట్ ఇచ్చిన నటి
Naresh. VNSక్యాన్సర్ బారిన పడ్డ నటి హంసా నందిని (Hamsa nandini) గుడ్ న్యూస్ చెప్పింది. తాను క్యాన్సర్ (Cancer) మహమ్మారి నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేసింది. ఆమెకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) వచ్చింది. దాంతో కొంతకాలంగా కీమో థెరపీ ట్రీట్‌ మెంట్ తీసుకుంటోంది. అప్ప‌టి నుంచి ధైర్యంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది.
COVID in AP: ఏపీలో కొత్తగా 220 మందికి కరోనా, ఇంకా 4,927 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 17,735 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 43, కృష్ణా జిల్లాలో 40, గుంటూరు జిల్లాలో 36, తూర్పు గోదావరి జిల్లాలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh Shocker: తోడు కోసం 60 ఏళ్ల వయస్సులో నాన్న రెండో పెళ్లికి రెడీ, నీకు పెళ్లి ఎందుకు అన్న పెద్ద కొడుకు, ఒప్పుకోక పోవడంతో..తండ్రిని దారుణంగా కత్తితో పొడిచి చంపేసిన కుమారుడు
Hazarath Reddyకర్నూలు జిల్లా గోనెగండ్ల వద్ద కాలువలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. మృతుడి చిన్న కుమారుడు నాగశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు దేవనకొండ మండలం కూకటికొండకు చెందిన గొల్ల గోపాల్గా (Kurnool man ) గుర్తించారు.
Gautam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్‌ సవాంగ్‌, ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
Andhra Pradesh: ఒంగోలులో ఇద్దరు యువతులు సహజీవనం, పోలీసులను ఆశ్రయించిన ఓ యువతి తల్లి, మేము అక్కాచెల్లెళ్లం అంటున్న యువతులు, పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
Hazarath Reddyఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతుల సహజీవనం (Cohabitation of two girls) వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ యువతి తల్లి ఇద్దరు అమ్మాయిలు(సుమలత, రమ్య) వివాహం చేసుకున్నారంటూ ఒంగోలు వన్ టౌన్ పోలీసులను( Panchayat in the police station) ఆశ్రయించింది.
Andhra Pradesh: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త, మదనపల్లె– తిరుపతి ఫోర్‌లేన్‌కు రూ.1,852.12 కోట్ల నిధులు విడుదల, ట్విట్టర్ ద్వారా తెలిపిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
Hazarath Reddyకేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటనకు వచ్చిన కొద్ది రోజులకే శుభవార్తను అందించారు. ఆయన విజయవాడ పర్యటనలో చెప్పినట్లుగానే జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె– తిరుపతి ఫోర్‌లేన్‌కు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు(Centre sanctions funds) చేసింది.
Coronavirus in AP: ఏపీలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కేసులు, గత 24 గంటల్లో 253 మందికి కరోనా, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 40 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 19,432 కరోనా పరీక్షలు నిర్వహించగా, 253 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 40 కేసులు నమోదు కాగా, తూర్పు గోదావ‌రి జిల్లాలో 39, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 37 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక‌ పాజిటివ్ కేసు నమోదైంది.
Mekapati Goutham Reddy Funeral: ముగిసిన మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో తుడి వీడ్కోలు, వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు
Hazarath Reddyఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. అంత్యక్రియలకు సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు, నిందితుడు డ్రైవర్ దస్తగరి సంచలన వ్యాఖ్యలు, పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బ‌దిలీ అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case:) పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్‌ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే (YS Viveka murder case transferred) వివేకా హత్య కేసు విచారణ జరగనుంది.
MLA Gudivada Amarnath: పట్టపగలే మందేశావా.. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తాం, బండారుకు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరిక, గౌతమ్ రెడ్డి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత
Hazarath Reddyఏపీ ఐటీ మంత్రి మృతిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పట్టపగలు మద్యం సేవించి మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాగుతున్నారని వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ (MLA Gudivada Amarnath) మండిపడ్డారు.
Bandaru Satyanarayana Murthy: గౌత‌మ్ రెడ్డి మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి, వైసీపీ నాయకులు బెదిరించడం వల్లే గుండెపోటు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి
Hazarath Reddyఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మృతిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గౌత‌మ్ రెడ్డి మృతిపై ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ అనుమానాలు నివృత్తి కావాలంటే.. గౌత‌మ్ రెడ్డి మృతిపై సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని బండారు డిమాండ్ చేశారు.