ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan on PRC: పీఆర్‌సీపై ఇన్నాళ్లూ అందుకే మాట్లాడలేదు, పీఆర్‌సీ అంశంపై పవన్ ఫస్ట్ రియాక్షన్, జీతాలు పెంచామని చెప్తూనే...కోత విధించడమేంటని ప్రశ్నించిన జనసేనాని

Naresh. VNS

నూతన పీఆర్సీ జీవోలకు(PRC G.O) వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన ‘చలో విజయవాడ ర్యాలీపై ఆయన వీడియో విడుదల చేశారు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం బాధ కలిగించిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పిన వైయస్సార్సీపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని గురించే పట్టించుకోలేదని విమర్శించారు.

COVID in AP: ఏపీలో కేసులు తగ్గుముఖం, గత 24 గంటల్లో 4,605 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 642 కొత్త కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 30,578 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,605 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 642 కొత్త కేసులు వెల్లడి కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 539, గుంటూరు జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 501 కేసులు గుర్తించారు.

Andhra Pradesh: ఈపీఎఫ్‌ ఖాతాల్లో అక్రమాలు, గుంటూరులో 20 మంది అధికారులపై కేసులు నమోదు చేసిన సీబీఐ, ప్రైవేటు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు

Hazarath Reddy

ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ కన్సల్టెంట్ల నుండి PayTM, PhonePe మరియు Google Pay వంటి చెల్లింపు అప్లికేషన్ల ద్వారా డబ్బును స్వీకరించినందుకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని EPFO యొక్క 20 మంది అధికారులపై CBI కేసులు బుక్ చేసింది, క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వంటి వారి సాధారణ విధులను నిర్వర్తించినందుకు బదులుగా, అధికారులు ఈ నగదును తీసుకున్నట్లుగా ( sharing data of subscribers with private PF consultants) అధికారులు గుర్తించారు.

Andhra Pradesh Shocker: పెళ్లెన నెలకే భార్యపై కత్తితో దాడి చేసిన భర్త, మరో ఘటనలో ప్రేమ పేరుతో యువతితో కోరికలు తీర్చుకుని తరువాత వేరే పెళ్లికి సిద్ధమైన ప్రియుడు

Hazarath Reddy

ఏపీలో ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి (Husband brutally attacks wife) చేశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం ఆమెను ఒంగోలు హాస్పిటల్‌కు (condition critical ) తరలించారు. దాడి చేసిన భర్త పరారీలో ఉన్నాడు.

Advertisement

Andhra Pradesh: జీవితం మీద విరక్తి, బతకాలని లేదంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య, నన్ను క్షమించాలని, నా చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనంతపురం రూరల్‌ పరిధిలోని ఆకుతోటపల్లిలో బుధవారం ఉదయం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య (techie commits suicide in Anantapur ) చేసుకున్నారు.

‘Chalo Vijayawada’ Programme: విజయవాడలో టెన్సన్, చలో విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులు, సమ్మెకు దూరమని తెలిపిన ఆర్టీసీ సంఘాలు, ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి సుచరిత

Hazarath Reddy

పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా కొనసాగుతోంది. తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తాము తగ్గేదే లే అన్న ఉద్యోగులు చెప్పిన విధంగానే విజయవాడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

Garapati Sambasiva Rao Passes Away: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూత, సంతాపం తెలిపిన పార్టీ అధినేత చంద్రబాబు

Hazarath Reddy

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గారపాటి సాంబశివరావు (75) అనారోగ్యంతో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో బుధవారం (ఫిబ్రవరి 2) తుది శ్వాస విడిచారు. సాంబశివరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

CM YS Jagan Review: ఏపీలో 100శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి, ప్రస్తుతం మనం కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నామని తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో 100శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని సీఎం జగన్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జగన్ (Andhra Pradesh CM YS jagan) మాట్లాడారు. 91 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ వేశారన్నారు. 15–18 ఏళ్ల మధ్యవారికి 100శాతం మొదటి డోస్‌ పూర్తి చేశారన్నారు.

Advertisement

COVID in AP: ఏపీలో కొత్తగా 5,983 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 741 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 87 కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 35,040 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 5,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 741 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 87 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కరోనాతో మృతి చెందారు.

Andhra Pradesh: తూర్పుగోదావరిలో విషాదం, కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి (Four tribals dies) చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు.

Union Budget 2022: ప్రైవేటీకరణ అవుతున్న విశాఖ ప్లాంటుకు బడ్జెట్‌లో రూ.910 కోట్లు, పోలవరం, దుగరాజపట్నం పోర్టు ఊసే లేదు, ఏపీ రాష్ట్రానికి బడ్జెట్లో మొండి చేయి చూపిన కేంద్రం

Hazarath Reddy

విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విశాఖ ఉక్కు )కు (Visakhapatnam Steel plant) కేంద్రం బడ్జెట్‌లో రూ.910 కోట్లు కేటాయించింది. వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు.

AP Inter Exams 2022: ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు, షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని తెలిపిన బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు

Hazarath Reddy

ఏపీలో 2021–22 విద్యాసంవత్సరపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు (AP Inter Exams 2022) ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు (Board secretary MV Seshagiri Babu) చెప్పారు.

Advertisement

Andhra Pradesh PRC Row: జీతం పడకుండా తగ్గిందని మీకెలా తెలుస్తుందని ప్రశ్నించిన హైకోర్టు, ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని తెలిపిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ

Hazarath Reddy

ఉద్యోగులు (AP Govt Employees) ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్‌ స్కీమ్‌ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది.

Coronavirus in AP: ఏపీలో ఫిబ్రవరి 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా, కొత్తగా 6,213 మందికి కరోనా, అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కొత్త కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 35,035 కరోనా పరీక్షలు నిర్వహించగా... 6,213 పాజిటివ్ కేసులు (Coronavirus in AP) వెల్లడయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 830, తూర్పు గోదావరి జిల్లాలో 731 కేసులు గుర్తించారు.

Union Budget 2022-23 Highlights: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త, త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా, పెన్నా-కావేరి నదుల అనుసంధానం, భారత్‌లో సొంత డిజిటల్ కరెన్సీ, నిర్మల బడ్జెట్ 2022 ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే..

Hazarath Reddy

నాలుగోసారి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ 2022 ను (Union Budget 2022-23 Highlights) ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు

Mungamuru Sridhar Krishna Reddy Dies: మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రాణ స్నేహితుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Hazarath Reddy

టీడీపీ నేత, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇవాళ నెల్లూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Advertisement

Corona in AP: ఏపీలో కొత్తగా 5,879 మందికి కరోనా, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 25,284 శాంపిల్స్ పరీక్షించగా... 5,879 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 823, కడప జిల్లాలో 776, కృష్ణా జిల్లాలో 650 కేసులు వెల్లడయ్యాయి.

AP High Court: ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి, సీజే ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు

Hazarath Reddy

ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు సోమవారం జాబితా విడుదలైంది. జడ్జిలుగా పదోన్నతి పొందిన వాళ్లలో కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు.

Andhra Pradesh: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు, పీఆర్సీ బిల్లులు చెయ్యని అధికారులకు మెమోలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్‌ జారీ

Hazarath Reddy

కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని మంత్రి బొత్స (Minister Botsa Satyanarayana) పేర్కొన్నారు. పీఆర్సీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Ongole Shocker: బాలుడిపై లైంగిక దాడి, బాధను తట్టుకోలేక చిన్నారి అరవడంతో గొంతు పిసికి చంపేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసిన ఒంగోలు పోలీసులు, వివరాలను వెల్లడించిన ఎస్పీ మలికాగర్గ్‌

Hazarath Reddy

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దారుణ ఘటన చోసుకుంది. ఓ చిన్నారి బాలుడిపై కామాంధుడు లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత దారుణంగా హతమార్చి. ( Army jawan held for rape, murder ) ఏమీ తెలియనట్టు తప్పించుకు తిరిగాడు.. ఈ ఘటన జరిగిన పది రోజుల తర్వాత పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు.

Advertisement
Advertisement