ఆంధ్ర ప్రదేశ్
New Districts in AP: ఏపీలో 26 జిల్లాల పూర్తి సమాచారం, ఏ నియోజకవర్గం ఏ జిల్లాకు వెళుతోంది, ముఖ్య కేంద్రంగా ఏదీ ఉండబోతోంది, ఏపీలో కొత్త జిల్లాలపై సమగ్ర కథనం
Hazarath Reddyఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల స్థానంలో 26 కొత్త జిల్లాలను (New Districts in AP) ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Spycam in Bathroom: ఫంక్షన్ హాల్ బాత్రూంలో రహస్య కెమెరా, 20 మంది యువతుల నగ్న వీడియోలు చిత్రించి, బ్లాక్ మెయిల్ చేస్తున్న దుండగుడు..
Krishna20 మంది ఆడవాళ్లు బట్టలు మార్చుకుంటుండగా వీడియో తీశాం. ఆ వీడియో అసలు కాపీ మీకు ఇవ్వాలంటే 5లక్షలు ఇవ్వండి. లేదంటే ఆ వీడియో కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవుతుందని బెదిరించాడు.
Republic Day 2022 Wishes: రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Hazarath Reddyరాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చి 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, ప్రపంచ రాజ్యాంగాల్లో మనది అతిపెద్దది, అత్యుత్తమమైనది అన్నారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని పేర్కొన్నారు.
Republic Day Celebrations in AP: ఉగాది నాటికి 26 కొత్త జిల్లాలు, 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
Hazarath Reddyఏపీలో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
AP New Districts: ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలు సిద్ధం, 26 జిల్లాలకు ఆమోదం తెలిపిన కేబినెట్
Krishnaఆన్ లైన్ లో సమావేశమైన మంత్రివర్గం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తాజాగా కేబినెట్ ఆమోదం తెలపడంతో.. దీనికి సంబంధించి రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే ఏపీ కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
Padmashri For Garikapati: గరికపాటికి పద్మశ్రీ, ఉపాధ్యాయ వృత్తి నుంచి అవధానం వరకూ ఆయన జీవితంలోని ప్రముఖ ఘట్టాలు ఇవే..
Krishnaప్రముఖ ఆధ్యాత్మక వేత్త, అవ‌ధాని గ‌రికపాటి న‌ర‌సింహారావుకు పద్మ పుర‌స్కారం ల‌భించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భార‌త ప్ర‌భుత్వం అత్యున్న‌త అవార్డు ప‌ద్మ‌శ్రీ‌కి ఆయనను ఎంపిక చేసింది.
PRC Issue in Andhra Pradesh: పీఆర్సీ రగడ, హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఉద్యోగులు అడగకుండానే అన్నీ చేశామని తెలిపిన సజ్జల, పూర్తిస్థాయి ఆందోళనలకు దిగుతామని ఉద్యోగ సంఘాల హెచ్చరిక
Hazarath Reddyఏపీలో పీఆర్సీ అంశం ఇప్పట్లో కొలిక్కి వచ్చే సూచనలు కనపడటం లేదు. తాజాగా పీఆర్సీ అంశానికి సంబంధించి మంత్రుల కమిటీతో జరిగిన ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసింది ఈరోజు(మంగళవారం) సంప్రదింపుల కమిటీ వద్దకు ఉద్యోగుల స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వచ్చారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 13,819 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 46, 929 శాంపిల్స్ పరీక్షించగా 13,819 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1,345 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,589 కేసులు, కర్నూలు జిల్లాలో 1,255 కేసులు, కడప జిల్లాలో 1,083 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,305 కేసులు వెల్లడయ్యాయి.
YSR EBC Nestam Scheme: అగ్రవర్ణాల మహిళల అకౌంట్లోకి రూ. 15 వేలు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, మొత్తం 3,92,674 మంది ఖాతాల్లోకి రూ.589 కోట్లు
Hazarath Reddyఅగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అండగా నిలిచింది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి (YSR EBC Nestam Scheme) శ్రీకారం చుట్టింది. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్నిసీఎం జగన్‌ (AP CM YS Jagan) ప్రారంభించారు.
AP Minister Kodali Nani: చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ దురదృష్టం, బెల్లీ డ్యాన్సులు, లుంగీ డ్యాన్సులు వాళ్లకే బాగా తెలుసు, మంత్రిని మర్డర్‌ చేస్తానంటే చట్టం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసిన మంత్రి కొడాలి నాని
Hazarath Reddyఏపీలో కాసినో వ్యవహారంపై రాజకీయం మరింతగా వేడెక్కింది. గుడివాడలో కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో కాసినో నడుస్తోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి విదితమే. బుద్దా వెంకన్న ఈ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు.
MP Vijayasai Reddy Press Meet: కేంద్ర శాఖల కార్యదర్శులతో ముగిసిన ఏపీ బృందం భేటీ, త్వరలోనే మంచి సమాచారం వస్తుందని తెలిపిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Hazarath Reddyవిజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy Press Meet) మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వినతిపత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామని,పరిష్కార మార్గాలను అన్వేషించామన్నారు
Buddha Venkanna Arrest: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్, మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత
Hazarath Reddyకాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్ట్‌ చేశారు. గుడివాడ వ్యవహారంపై మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మంత్రిని చంపుతానంటూ రక్తం కళ్ల చూస్తానంటూ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు.
Corona in AP: ఏపీలో గత 22 గంటల్లో 14,502 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 40,266 శాంపిల్స్ పరీక్షించగా 14,502 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1,610 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,597 కేసులు, కర్నూలు జిల్లాలో 1,551 కేసులు, కడప జిల్లాలో 1,492 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,198 కేసులు వెల్లడయ్యాయి.
Andhra Pradesh PRC Row: కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా?, పూర్తి సమాచారం లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని ప్రశ్నించిన హైకోర్టు, పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం
Hazarath Reddyఏపీలో పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు (Andhra Pradesh High Court) సోమవారం విచారించింది. ఈసందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పండని పిటిషన్‌ దారులను హైకోర్టు ప్రశ్నించింది.
Andhra Pradesh Shocker: విశాఖలో దారుణం, కూతురిపై కన్న తండ్రి కొన్ని నెలలుగా అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyవైజాగ్ నగరంలో తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని (Andhra Pradesh Shocker) ఆదివారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన నిందితుడికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
Door to Door Fever Survey: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న జ్వరాలు, చాలా మందిలో జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలున్నట్టు గుర్తించిన అధికారులు
Hazarath Reddyతెలంగాణలో డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే (Door to Door Fever Survey) జరుగుతోంది. రెండు రోజుల్లో దాదాపు 29 లక్షల ఇళ్ల నుండి సమాచారాన్ని సేకరించారు. కాగా వీరిలొ 1.28 లక్షల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి అక్కడికక్కడే కరోనా కిట్లను అందజేశారు.
COVID in AP: ఏపీలో గత 24 గంటల్లో 14,440 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు, అనంతపురం జిల్లాలో 1,534 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 46,650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు వెల్లడి కాగా, అనంతపురం జిల్లాలో 1,534 కేసులు, గుంటూరు జిల్లాలో 1,458 కేసులు నమోదు అయ్యాయి.
AP Govt Employees Strike: నేడే సమ్మె నోటీసు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, సమ్మెలోకి ఆర్టీసీ, వైద్య సిబ్బంది, PRC సాధన సమితి ప్రకటన..
Krishnaకొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. నేడు ఉద్యోగులు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. ఇవాళ(24 జనవరి 2022) మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు.
Mulugu Siddanthi Died: ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇకలేరు, శ్వాస సమస్యలతో బాధపడుతూ కన్నుమూత, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి
Naresh. VNSములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి (mulugu ramalingeswara siddanthi) ఆదివారం కన్నుమూశారు. ఊపిరి తీసుకోవ‌డంలో సమస్య రావటంతో (Breathing Issue) కుటుంబ స‌భ్యులు పంజాగుట్టలోని నిమ్స్ (NIIMS) ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. మార్గ‌మ‌ధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి (Ramalingeswara siddanthi) తుది శ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు.
Body Donation: మరణంలోనూ ఆదర్శం, 24 గంటల వ్యవధిలో వైద్య కళాశాలకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి దేహదానం, భద్రాచలంకు చెందిన మరింగంటి కుటుంబంలో అరుదైన సంఘటన...
Krishnaఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ కేవలం 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రపంచాన్ని వదిలి తమ శరీరాలను వైద్య కళాశాలకు అప్పగించారు.