ఆంధ్ర ప్రదేశ్

Badvel Bypoll Result 2021: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీదే హవా, ఐదో రౌండ్‌ ముగిసే సరికి 42,824 ఓట్ల ఆధిక్యంలో అధికార పార్టీ, ప్రభావం చూపని బీజేపీ పార్టీ

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని బద్వేలు ఉప ఎన్నిక కౌంటింగ్ (Badvel Bypoll Result 2021) కొన‌సాగుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి డాక్టర్‌ దాసరి సుధ భారీ ఆధిక్యంలో (YSRCP lead in all rounds till now) కొన‌సాగుతున్నారు. భారీ విజయం దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. బద్వేల్‌లో ఐదో రౌండ్‌ ముగిసే సరికి 42,824 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది.

Bypoll Results 2021: హుజూరాబాద్‌ తొలిరౌండ్‌లో బీజేపీదే హవా, బద్వేల్‌లో దూసుకుపోతున్న వైసీపీ, రెండు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార పార్టీదే ఆధిక్యం, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

బద్వేల్ తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ నిలిచింది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఇక హుజూరాబాద్ పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్‌ 32, చెల్లనవి 14గా ఉన్నాయి.

Corona in AP: భారీ ఊరట.. కర్నూలు, విజయనగరంలో సున్నా కేసులు నమోదు, కొత్తగా 220 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 25,532 శాంపిల్స్ పరీక్షించగా 220 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా 429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా 4గురు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్షా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.

AP Local Body Polls 2021: ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా, నవంబర్‌ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు, 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్ఈసీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ (AP Local Body Polls 2021) విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Advertisement

YSR Lifetime Achievement Awards: ఘనంగా వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం, నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్‌ అని కొనియాడిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం (YSR Lifetime Achievement Awards) ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించినవారికి గవర్నర్ హరిచందన్‌‌, సీఎం జగన్‌ చేతులమీదుగా ( YS Jagan and governor Biswabhushan Harichandan) అవార్డుల ప్రదానం జరిగింది.

Nagari MLA Roja: కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా దంపతులు, వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్, రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు

Hazarath Reddy

నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్‌ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

Andhra Pradesh Formation Day 2021: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు

Hazarath Reddy

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు (Andhra Pradesh Formation Day 2021) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు .

Andhra Pradesh Formation Day 2021: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఏపీ ప్రజలు గట్టి పట్టుదల కలిగినవారని, అందుకే అన్ని చోట్ల రాణిస్తున్నారంటూ ట్వీట్

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నా సోదరీమణులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలతో ప్రసిద్ధి చెందారు. అందుకే అనేక రంగాల్లో రాణిస్తున్నారు. AP ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా మరియు విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎంకు షాక్‌, నారాయణస్వామికి ఆ శాఖ కోత, బుగ్గన ఖాతాలోకి మరో శాఖ

Naresh. VNS

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖను ఆయన నుంచి తప్పించింది. ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగిస్తూ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో ఏపీ ప్రభుత్వం భావించింది.

Badvel Bypoll: బద్వేలులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, వర్షంతో ఇబ్బంది పడ్డ ఓటర్లు, 59 శాతం పోలింగ్ నమోదు..

Krishna

బద్వేలులో అదే సమయానికి 59.58 శాతం ఓటింగ్ జరిగింది. కాగా ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబరు 2న చేపట్టనున్నారు. చెదురు మదురు ఘటనలు, స్వల్ప ఘర్షణలు మినహా తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలోనే జరిగాయి.

By Elections: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్, ఉత్కంఠరేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

Naresh. VNS

తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గానికి ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

Corona in AP: ఏపీలో తగ్గిపోయిన యాక్టివ్ కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 837 మందికి కొనసాగుతున్న చికిత్స, కొత్తగా 481 మందికి పాజిటివ్, తూర్పు గోదావరి జిల్లాలోనే 157 కొత్త కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 39,604 కరోనా పరీక్షలు నిర్వహించగా, 481 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 157 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 76, కృష్ణా జిల్లాలో 52, గుంటూరు జిల్లాలో 39, విశాఖ జిల్లాలో 38 కేసులు వెలుగు చూశాయి.

Advertisement

CM YS Jagan Review: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలు, త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Hazarath Reddy

ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్‌ విడ్త్‌తో ఇంటర్నెట్‌ను ఇవ్వాలని తెలిపారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.

By-Elections 2021: రేపే తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలు, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు

Hazarath Reddy

Telugu Desam Party: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీరెడ్డి, మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఫతావుల్లా, పలువురు నేతలను కీలక పదవుల్లో నియమించిన అచ్చెన్నాయుడు

Hazarath Reddy

ఇటీవలే తెలుగు దేశం పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన జీవీరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (TDP AP Chief Kinjarapu Atchannaidu) ప్రకటించారు. అలాగే, మరికొందరు నేతలను కీలక పదవుల్లో నియమించారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 381 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 82 కొత్త కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 38,896 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 381 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 82 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 61, తూర్పు గోదావరి జిల్లాలో 57, విశాఖ జిల్లాలో 43 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

AP Free Laptop Scheme 2021: ఏపీలో 6.53లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, అమ్మఒడి పథకం కింద నగదు వద్దనుకునే స్టూడెంట్లకు పంపిణీ, ఏపీటీఎస్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ( laptops instead of cash) ల్యాప్‌టాప్‌లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనుంది.

AP Cabinet Meet: రైతులకు జగన్ సర్కారు శుభవార్త, 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌, కేబినెట్ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం, ఏపీలో నవంబర్‌ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో (Andhra Pradesh Cabinet Meet) పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh: తిరుపతిలో జియో ఫోన్‌ నెక్ట్స్‌ తయారీ కేంద్రం,తొలి దశలో  రూ.20కోట్ల పెట్టుబడి పెట్టిన రిలయన్స్‌, యునైటెడ్‌ టెలీలింక్స్‌ నియోలింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి పనిచేయనున్న జియో

Hazarath Reddy

ఏపీలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌(ఎల్రక్టానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌–2)లో ఉన్న యునైటెడ్‌ టెలీలింక్స్‌ నియోలింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి జియో నెక్ట్స్‌ ఫోన్ల (JioPhone Next smartphones ) తయారీకి శ్రీకారం చుట్టింది.

Corona in AP: కర్నూలు జిల్లాలో జీరోకి పడిపోయిన కరోనా కేసులు, ఏపీలో కొత్తగా 567 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 39,545 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement