ఆంధ్ర ప్రదేశ్

Corona in AP: ఏపీలో 20 వేల దిగువకు చేరిన యాక్టివ్ కేసులు, తాజాగా 1,413 మందికి కరోనా పాజిటివ్, కొత్తగా 1,795 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి, దేశంలో 50 కోట్ల మందికి వ్యాక్సిన్‌ పూర్తి చేశామని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 54,455 నమూనాలను పరీక్షించగా 1,413 మందికి పాజిటివ్‌గా (Corona in AP) నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,83,721కి చేరింది. తాజాగా 18 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,549కి పెరిగింది.

AP Inter Classes: ఏపీలో ఈ నెల‌ 16 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు, ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు

Hazarath Reddy

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండటంతో స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల‌ 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి.

AP Three Capitals Row: ఏపీలో మూడు రాజధానులపై సందేహం లేదు, ఏర్పాటు ఖాయం, అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని తెలిపిన మంత్రి కురసాల కన్నబాబు

Hazarath Reddy

ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 3 రాజధానులు (AP Three Capitals Row) ఏర్పాటు కావడం ఖాయమని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.

Andhra Pradesh: చిత్తూరులో విషాదం, టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి దారుణ హత్య

Hazarath Reddy

ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కంకర తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి (Three members electrocuted) చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో (Chittoor district) చోటు చేసుకుంది. పాలసముద్రం మండలం కనికాపురంలో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Giddaluru Shocker: నీ కోసమే హిజ్రాగా మారా..నన్నేపెళ్లి చేసుకోమన్న ట్రాన్స్‌జెండర్, యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం, ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఘటన

Hazarath Reddy

ఏపీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తన లవర్ పెళ్లికి నిరాకరించాడని ఓ హిజ్రా ఆత్మహత్యా యత్నం చేసింది. అందుకు ముందు లవర్ వేరే పెళ్లి చేసుకుంటుండగా దాన్ని అడ్డుకుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని పెళ్లికొడుకును కోరింది.

Corona in Andhra Pradesh: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, 462 ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేసిన ఏపీ సర్కారు, ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని ఆదేశాలు, ఏపీలో తాజాగా 2,050 మందికి కోవిడ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85,283 పరీక్షలు నిర్వహించగా.. 2,050 కేసులు నిర్ధారణ (Corona in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,82,308 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ (Covid) వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,531కి చేరింది.

Y. V. Subba Reddy: టీటీడీ చైర్మన్‌గా మరోసారి వై.వి.సుబ్బారెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు, టీటీడీ బోర్డు సభ్యుల నియామకం త్వరలో జరిగే అవకాశం

Hazarath Reddy

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది. టీటీడీ బోర్డు సభ్యుల పదవీకాలం గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే.

Realtor Murder in Hyderabad: అతను గురూజీ కాదు..హంతకుడు, నెల్లూరు రియల్టర్ భాస్కర్ రెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు, ఇంకా దొరకని ఆధ్యాత్మిక గురువు త్రిలోక్‌నాథ్‌ ఆచూకి, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

నెల్లూరుకు చెందిన రియల్టర్‌ భాస్కర్‌రెడ్డి హైదరాబాద్ లో దారుణ హత్యకు (Realtor Murder in Hyderabad) గురైన సంగతి విదితమే. ఈ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం (Hyderabad police starts probe) చేశారు. హత్య కేసులో కీలక సూత్రధారి అయిన త్రిలోక్‌నాథ్‌ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Tadepalli Rape Case: కాబోయే భర్త ముందే యువతిపై సామూహిక అత్యాచారం, తాడేపల్లి అత్యాచార ఘటనలో నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌

Hazarath Reddy

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద యువతిపై లైంగికదాడి (Tadepalli Rape Case) చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకరిని అర్బన్‌ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లను తాకట్టు పెట్టుకున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

Veligallu Project Tragedy: కడపలో విషాదం, వెలిగల్లు ప్రాజెక్టు దగ్గర నీటిలో మునిగి నలుగురు గల్లంతు, రాత్రి 9 గంటలకు మృతదేహాలను వెలికితీసిన పోలీస్ సిబ్బంది, మృతులంతా బెంగుళూరు వాసులు

Hazarath Reddy

ఏపీలో స్నేహితుల విహార యాత్ర విషాదకరంగా ముగిసింది. బెంగళూరుకు చెందిన నలుగురు సరదాగా ఈత కొడుతూ నీటిలో మునిగి మృత్యువాత (Veligallu Project Tragedy) పడిన సంఘటన శనివారం వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండల కేంద్రానికి సమీపంలోని వైఎస్సార్‌ వెలిగల్లు ప్రాజెక్టు దిగువనున్న గండిమడుగులో చోటుచేసుకుంది.

Corona in AP: ఏపీలో కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు, నియంత్రణకు మూడు రకాల వ్యూహాలను రచించిన ఏపీ ప్రభుత్వం, తిరుపతి రుయా ఘటనపై హైకోర్టులో కౌంటర్ దాఖలు, ఏపీలో తాజాగా 1,908 మందికి కోవిడ్

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 80,376 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,908 మందికి పాజిటివ్ (1,908 new Covid cases) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 438 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 231, గుంటూరు జిల్లాలో 216, నెల్లూరు జిల్లాలో 213 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 26 కేసులు గుర్తించారు.

National Handloom Day: నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, చేనేతల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని వెల్లడి

Hazarath Reddy

రాష్ట్రంలోని చేనేతల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా సీఎం జగన్‌ నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

AP Weather Report: ఏపీలో వారం రోజుల పాటు జాగ్రత్త, ఎండలు మండిపోతాయంటున్న వాతావరణ శాఖ, బంగాళాఖాతాన్ని తాకకుండా నేరుగా అరేబియన్‌ సముద్రం వైపు వెళ్లిపోతున్న గాలులే కారణమంటున్న నిపుణులు

Hazarath Reddy

ఏపీలో రానున్న 10 రోజులు సూర్యుడు నిప్పులు కురిపించనున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో ఎండల మండుతున్నాయి. వర్షాలు కురవాల్సిన సమయంలొ సూర్యుడు భగభగమంటున్నాడు. నైరుతి రుతు పవనాల (Southwest monsoon) ప్రభావంతో వీచే గాలులు బలహీనపడటంతో నైరుతి, పశ్చిమ దిశగా వీయాల్సిన గాలుల్లో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు వాతావరణ శాఖ చెబుతోంది.

AP Cabinet Meet Decisions: ఏపి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం నిర్ణయం, ఈనెలలో విద్యాకానుక మరియు నేతన్న నేస్తం పథకాల అమలు, అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపులు, కేబినేట్ నిర్ణయాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నాని శుక్రవారం మీడియాకు వెల్లడించారు. దీనిలో భాగంగా, ఏ తరగతిలోనైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ అని అలాగే ప్రారంభ దశ నుంచే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి విప్లవాత్మక చర్యలు...

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,209 కోవిడ్ కేసులు, 22 మరణాలు నమోదు మరియు 1896 మంది రికవరీ, రాష్ట్రంలో 20,593కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Vikas Manda

AP SSC Exam Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, మార్కుల మెమోలను పొందుపరిచినట్లు వెల్లడించిన విద్యాశాఖ, ఫలితాల కోసం ఈ లింక్స్ చూడండి

Team Latestly

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలతో పాటు మార్క్స్‌ మెమోలను కూడా ఈరోజే విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ http://bse.ap.gov.in తో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ల ద్వారా కూడా పొందవచ్చు....

Advertisement

AP News Updates: సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినేట్, కీలక అంశాలపై చర్చ; ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి, నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు

Team Latestly

ఆగష్టు నెలలో అమలు చేయబోయే నవరత్నాల పథకాల అమలు, నూతన విద్యావిధానం, ఆర్టీసీ ఆస్తులు, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు, అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సాయం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు...

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,145 కోవిడ్ కేసులు, 24 మరణాలు నమోదు మరియు 2,003 మంది రికవరీ, రాష్ట్రంలో 20,302కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Vikas Manda

Monsoon Update: తెలంగాణలో రాబోయే రెండు రోజుల వరకు మోస్తారు వర్షాలకు అవకాశం, హైదరాబాద్‌లో పరిస్థితులు సాధారణం; ఆగష్టులోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా

Team Latestly

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఐఎండీ అంచనా ప్రకారం, ఆగష్టు రెండవ వారం ఉంచి రుతుపవనాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడే వాతావరణ పరిస్థితులు అంచనా వేయలేమని...

Pulichinthala Dam: కృష్ణానది వరద ఉధృతి.. ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టులోని గేట్, ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Vikas Manda

Advertisement
Advertisement