ఆంధ్ర ప్రదేశ్
TTD Darshan Tickets: టీటీడీ దర్శన టికెట్ల తేదీల్లో మార్పులు చేసిన టీటీడీ, మార్చి నెల టికెట్ల తేదీల మార్పు, అదే రోజు గదుల కోటా రిలీజ్
Arun Charagondaమార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది టీటీడీ. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. 26వ తేదీ ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా విడుదల చేయనుంది.
Tremors in Prakasam: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు.. భయంతో స్కూల్ నుంచి బయటకు పరుగులుతీసిన విద్యార్థులు
Rudraఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు.
Nara lokesh: మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న మహిళను స్వస్థలం నెల్లూరుకు చెర్చిన లోకేష్
Arun Charagondaఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్ .నెల్లూరుకు చెందిన షేక్ మున్నీ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించండి అన్న అంటూ మంత్రి లోకేష్ ను "ఎక్స్" లో కోరగా మంత్రి లోకేష్ స్పందించారు.
Actor Mohan Babu: తన ఫోటోలు, వాయిస్ ను గూగుల్ లో, సోషల్ మీడియాలో వాడొద్దని కోర్టుకు మోహన్ బాబు.. తొలగించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం
Rudraఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన ఫోటోలు, వాయిస్ ను గూగుల్ లో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని అందులో అభ్యర్థించారు.
Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా దేవరకొండలో ముగ్గురు.. సత్యసాయి జిల్లాలో నలుగురు మృతి
Rudraరోడ్డు ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాలలోని రహదారులు శనివారం తెల్లవారుజామున నెత్తురోడాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తంగా ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు.
Pawan Kalyan Performs Dhimsa Dance: వీడియో ఇదిగో, మహిళలతో కలిసి పవన్ కళ్యాణ్ థింసా నృత్యం, మన్యం జిల్లా పర్యటనలో స్థానిక మహిళలతో కలిసి కాలు కదిపిన డిప్యూటీ సీఎం
Hazarath Reddyమహిళలతో కలిసి పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. మన్యం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేశారు. స్థానిక మహిళలతో కలిసి ఆయన కాలు కదిపారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆయన నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
One Nation One Election: జమిలి బిల్లు కోసం జేపీసీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితా ఇదిగో..
Hazarath Reddyజమిలి బిల్లు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి, మాట మాట పెరగడంతో ఘర్షణ
Hazarath Reddyకడప జిల్లా బద్వేల్ పట్టణం మైదుకూరు రోడ్డులోని గౌరీ సాయి వైన్స్ వద్ద మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో అక్రమ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Pawan Kalyan: వీడియో ఇదిగో, OG OG అని అరిస్తే పనులు జరగవు, అభిమానులకు చురకలు అంటించిన పవన్ కళ్యాణ్, సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారని వెల్లడి
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు చురకలు అంటించారు. ‘‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు.
Andhra Pradesh: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyకృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు.
Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన బైక్..ఇద్దరు విద్యార్థులు మృతి, వీడియో ఇదిగో
Arun Charagondaచిత్తూరు అరగొండ రోడ్డు, ముట్ర పల్లి సత్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు సీతమ్స్ కళాశాల విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంతో ఆటోను ఢీకొని విద్యార్థులు దుర్మరణం చెందారు. హర్ష ( 17) ,సాయి తేజ (18) ముట్రపల్లి వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తవణం పల్లె పోలీసులు.
AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyఏపీ వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ వచ్చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
TTD Action On Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు సిద్ధమైన టీటీడీ, దర్శనాలు- గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్
Arun Charagondaతిరుమల శ్రీవారిని గురువారం శ్రీనివాస్ గౌడ్ దర్శించుకునన్ సంగతి తెలిసిందే. తిరుమలలో టీటీడీ అవలంభిస్తున్న వైఖరిని తప్పుబట్టారు శ్రీనివాస్ గౌడ్. తిరుమలలో దర్శనాలు, గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు..గడచిన పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఇప్పుడు ఇరురాష్ట్రాల ప్రజలను టీటీడీ సమానంగా చూడడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
Dead Body In Parcel: ఆర్థిక సాయం కోసం అప్లై చేస్తే డెడ్ బాడీ వచ్చింది... ఇంటికి వచ్చిన పార్శిల్‌లో మృతదేహం, భయాందోళనకు గురైన స్థానికులు..వీడియో
Arun Charagondaపశ్చిమగోదావరి - యండగండిలో పార్శిల్‌లో డెడ్ బాడీ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తన ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని యండగండికి చెందిన మహిళ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేశారు.
Ashwin Quit Because Of Humiliation: అవమానం వల్లే అశ్విన్ వీడ్కోలు.. తండ్రి సంచలన ఆరోపణలు.. దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్ (వీడియో)
Rudraభారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ అనూహ్య రిటైర్మెంట్ అంశంలో కీలక మలుపు చోటుచేసుకుంది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికాడు అశ్విన్.
Hero Akhil At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో అఖిల్.. అభిషేక సేవలో పలువురు ప్రముఖులు (వీడియో)
Rudraయువ నటుడు హీరో అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొన్నారు.తెలంగాణ హైకోర్టు జస్టిస్ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో అఖిల్ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Telugu States Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. తెలంగాణను వణికిస్తున్న చలి-పులి
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
Nara Bhuvaneshwari on Balakrishna: బాలకృష్ణ నా తమ్ముడు కాదు అన్న, నా కన్నా రెండేళ్లు పెద్ద, నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..అందరు బాలకృష్ణ నా తమ్ముడు అనుకుంటారు కానీ ఆయన నా అన్న. నా కన్నా రెండేళ్లు పెద్దవాడని తెలిపారు.
Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి
Hazarath Reddyఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు..