ఆంధ్ర ప్రదేశ్
Covid in AP: ఏపీలో కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు లేవు, ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్‌టీపీఆర్‌ పరీక్షలు, మీడియాతో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఏపీలో తాజాగా 355 మందికి కోవిడ్ పాజిటివ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ గడిచిన 24 గంటల్లో 56,409 మందికి కరోనా పరీక్షలు చేయగా 355 మందికి పాజిటివ్‌ (Coronavirus disease (COVID-19) వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,80,430కు (Coronavirus Update) చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 354 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,69,478 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
Tadipatri Violence: తాడిపత్రిలో 144 సెక్షన్, గొడవకు కారణం ఆ వీడియోనేనా ? డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా, జేసీ ప్రభాకర్ రెడ్డితో సహా ఆయన వర్గీయులు 27 మందిపై కేసు నమోదు, ఘటనపై ఫిర్యాదు చేయనని తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి
Hazarath Reddyశాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తాడిపత్రిలో 144 సెక్షన్‌ (Section 144 Imposed in Tadipatri) అమల్లో ఉంటుందని ఎస్పీ బి. సత్యయేసు బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. తాడిపత్రిలో ఇప్పటికే ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించామన్నారు
YSR Housing Scheme 2020: అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది, చంద్రబాబు స్కీమ్ కావాలా..జగనన్న స్కీమ్ కావాలా సర్వేలో జగనన్న స్కీమ్‌కే ఓటేశారు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyసొంతిల్లు లేని పేదల కోసం 'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొమరగిరి మండలంలో ఈ కార్యక్రమాన్ని (YSR Housing Scheme 2020) ప్రారంభిస్తూ అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. అక్కడ నిర్మించిన మోడల్ హౌస్ ను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
Dharmavaram Murder Case: స్నేహలత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల సాయం, తక్షణ సాయంగా రూ.4,12,500 లు, వివరాలను వెల్లడించిన భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌ గంధం చంద్రుడు
Hazarath Reddyఏపీలో అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద ప్రేమికుడి చేతిలో హత్యకు (Dharmavaram Murder Case) గురైన స్నేహలత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.
COVID in AP: యూకే నుంచి ఏపికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్, కొత్త రకం వేరియంట్ అనుమానంతో అప్రమత్తమైన అధికారులు, రాష్ట్రంలో కొత్తగా మరో 357 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇప్పుడు కరోనావైరస్ కొత్త వేరియంట్ భయాందోళనలు మొదలయ్యాయి. యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సదరు మహిళను మరియు ఆమె కుటుంబ సభ్యులను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.....
High Tension In Tadipatri: తాడిపత్రిలో హై టెన్సన్.. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్న జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు, రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyతాడిపత్రిలో హై టెన్సన్ (Hi Tension In Tadipatri) నెలకొంది. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వర్గీయులు (JC Diwakar Reddy Followers) వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేత కేతిరెడ్డిపై (Kethireddy Pedda Reddy) జేసీ వర్గీయులు తప్పుడు ప్రచారం చేస్తుంటడం ఘటనకు కారణంగా తెలుస్తోంది.
Dharmavaram Murder Case: ఆమెపై అత్యాచారం జరగలేదు, వేరే యువకుడితో సన్నిహితంగా ఉందనే కోపంతో ప్రియుడు చంపేశాడు, ధర్మవరం ఎస్‌బిఐ ఉద్యోగిని హత్య కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ
Hazarath Reddyఅనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలంలో స్నేహితులతో కలిసి ప్రియురాలిని ప్రియుడు దారుణంగా హత్య (Dharmavaram Murder Case) చేసిన సంగతి విదితమే. అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అయితే ఆ యువతిపై అత్యాచారం జరిగిందనే వార్తల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు స్పందించారు.
Corona in AP: సెకండ్ వేవ్, కొత్త రకం కరోనావైరస్ పట్ల అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 379 మందికి పాజిటివ్
Team Latestlyరాష్ట్రంలో ఆక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే సెకండ్ వేవ్ ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నూతన సంవత్సర వేడుకలు, ఇతర విందులు వినోదాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు....
Adityanath Das: ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్‌, పురపాలక శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మీ, ఈ నెల 30న బాధ్యతలు స్వీకరించనున్న దాస్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా విధులు నిర్వహించనున్న నీలం సాహ్ని
Hazarath Reddyప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ (Adityanath Das) నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు (AP New CS Adityanath Das) చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (neelam sahani) పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
Covid Second Wave Alert in AP: ఏపీకి కరోనావైరస్ సెకండ్ వేవ్‌ ముప్పు, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం వైయస్ జగన్, ఆస్పత్రుల్లో నాడు నేడుపై సమీక్ష జరిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyదేశంలోకి కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ (New Coronavirus Strain) ఎంటరయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (Covid Second Wave Alert in AP) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సూచించారు. ఆస్పత్రుల్లో నాడు-నేడుపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
Coronavirus in AP: ఏపీ ప్రభుత్వం తీపి కబురు, అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం అర్బన్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు, ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఏపీలో తాజాగా 214 కేసులు
Hazarath Reddyఏపీ సర్కారు కోవిడ్ వ్యాక్సిన్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు (Urban Task Force for distribution of coronavirus vaccine) చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్‌శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది.
Land Resurvey in AP: వైఎస్సార్‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం..తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyవైఎస్సార్‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు (Land Resurvey in AP) శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది.
#HBDYSJagan: ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు, ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు, నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ ప్రజా పాలనలో దూసుకుపోతున్న యువనేత
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Y S Jaganmohan Reddy Birthday) 48వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు (#HBDBelovedCMYSJagan). చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ (PM Modi) ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు
Covid in AP: ఏపీలో తాజాగా 438 మందికి కరోనా, ఇద్దరు మృతితో 7,076కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,67,445, యాక్టివ్‌ కేసులు 4,202
Hazarath Reddyఏపీలో తాజాగా మరో 438 కరోనా కేసులు (Covid in AP) నమోదు అయ్యాయి. కోవిడ్‌తో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. కాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,236 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 589మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
Vijayawada Dancer Suicide Case: విజయవాడలో డ్యాన్సర్ ఆత్మహత్య, కేసులో కొత్త ట్విస్టు అదేనా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyఏపీలో విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్ (Suspicious Death in Vijayawada) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో డాన్సర్ గాయత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Dancer suspicious death) పాల్పడింది. కాగా ఆమె ఆత్మహత్యకు ముందు నీలిమ అనే యువతి ఇంటి కొచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం జరిగినట్లు సమాచారం. నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి.. ఇంట్లో చీరతో ఉరివేసుకుంది.
APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌‌ఆర్టీసీ గుడ్‌న్యూస్, సంక్రాంతి పండుగ సంధర్భంగా 3607 ప్రత్యేక బస్సులు, తెలంగాణకు 1,251 బస్సులు నడపనున్నట్లు తెలిపిన ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి
Hazarath Reddyసంక్రాంతి పర్వదినాన ప్రయాణికులకు ఏపీఎస్‌‌ఆర్టీసీ (APSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని (Sankranti festival) ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఏపీ నుంచి తెలంగాణకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 13 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది.
India Coronavirus: ఇండియాలో కోటి దాటిన కోవిడ్ కేసులు, తెలంగాణలో తాజాగా 627 మందికి వైరస్ నిర్థారణ, ఏపీలో 458 మందికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 25,153 మందికి కరోనా
Hazarath Reddyదేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం కోటి (India Coronavirus) దాటింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 25,153 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599కు చేరింది.
CBI Books Hyd Firm for Bank Fraud: టీడీపీ మాజీ ఎంపీ ఇంటిపై సీబీఐ దాడులు, రూ.7,926.01 కోట్లు మోసానికి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు, రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై సీబీఐకి ఫిర్యాదు చేసిన కెనరా బ్యాంకు
Hazarath Reddyటీడీపీ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఆకస్మిక దాడులు చేశాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు.
Fire at Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం, స్టీల్ ప్లాంట్ ఎస్‌ఎమ్‌ఎస్-2‌లో లాడిల్ తెగిపోవడంతో కోటి రూపాయల విలువైన ఉక్కుద్రావణం నేలపాలు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ కార్వనిర్వాహక రాజధానిగా తయారుకాబోతున్న విశాఖపట్నం జిల్లాలోని విశాఖ ఉక్కులో విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం (Fire at Vizag Steel Plant) చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కుతో ఉన్న లాడిల్ జారిపడటంతో అది నేలపై పడిపోయింది. ఉక్కు పడిన చోట ఆయిల్ ఉండటంతో ఒక్కసారిగా మంటలు (Fire accident in Vizag steel plant) ఎగిసిపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న నలుగురి సిబ్బందికి గాయాలు అయ్యాయి.
AP Cabinet Meeting Highlights: డిసెంబర్ 29న రైతు భరోసా మూడో విడత డబ్బులు, ఏపీలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్, జగన్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పేర్ని నాని
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ (AP Cabinet meeting ends) ముగిసింది. ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం (AP Cabinet Meeting) తెలిపింది.