ఆంధ్ర ప్రదేశ్
Supreme court: ఏపీ హైకోర్టు ఆదేశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపిన సుప్రీంకోర్టు, ఏపీలో రాజ్యాంగ సంక్షోభంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyఏపీలో ‘రాజ్యాంగ సంక్షోభం’ అయిందంటూ దాఖలు చేసిన పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ని విచారించిన అత్యున్నత ధర్మాససనం...ఈ వ్యాజ్యంతో ముడిపడి ఉన్న ఇతర పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, జగనన్న అమ్మ ఒడి పథకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం, పలు కీలక అంశాలను చర్చించనున్న మంత్రివర్గం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా రెండో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ( Jagananna Amma Vodi) గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు.
Penna River Tragedy:విషాదం..పెన్నానదిలో నాలుగు మృతదేహాలు లభ్యం, మొత్తం ఏడుగురు గల్లంతు, మిగతా ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
Hazarath Reddyవైయస్సార్ కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో నిన్న గల్లంతయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Amravati Movement: నేటితో ఏడాది పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం, అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన చంద్రబాబు, దుర్గమ్మే అమరావతిని కాపాడాలని తెలిపిన ఏపీ ప్రతిపక్ష నేత
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనకు , జై అమరావతి ఉద్యమానికి సరిగ్గా ఏడాది (Amravati Movement) పూర్తయింది.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు హై టెన్షన్ మధ్య అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని (Amravati Lay Foundation) సందర్శించారు. అక్కడ శిరసు వంచి ఆ ప్రాంతానికి నమస్కరించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
BC Sankranthi Sabha Highlights: బీసీ సమరశంఖారావం, విజయవాడలో బీసీ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైయస్ జగన్, దేశ చరిత్రలోనే వెనుకబడిన వర్గాలకు ఎక్కువ పదవులు మేమే ఇచ్చామని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyవిజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి వేడుకల్లో (BC Sankranthi Sabha) సీఎం జగన్‌ పాల్గొన్నారు. వేదిక మీదకు చేరుకొని జ్యోతిరావ్‌ పూలే, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేదిక మీద నుంచి ఏపీ సీఎం మాట్లాడుతూ.. (AP CM YS Jagan Speech Highlights) ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు.
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 478 మందికి కొవిడ్ పాజిటివ్, మరో 715 మంది రికవరీ, రాష్ట్రంలో 4.420గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyఅత్యధికంగా చిత్తూరు నుంచి 89, కృష్ణా జిల్లా నుంచి 62, గుంటూరు నుంచి 48, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 63, 58 కొత్త కేసులు నమోదయ్యాయి.....
CJs Reshuffle: ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌ల బదిలీ, ఏపీ హైకోర్ట్ సీజే సిక్కిం హైకోర్టుకు బదిలీ, తెలంగాణ హైకోర్ట్ సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ పేరు ప్రతిపాదన
Team Latestlyసోషల్ మీడియా పోస్టుల ద్వారా న్యాయవ్యవస్థను దుర్భాషలాడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించిన సమయంలో, హైకోర్టు యొక్క తటస్థతను పునరుద్ధరించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం సీజే ఎస్ఐ బొబ్డేకు లేఖ రాశారు....
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుతున్న కరోనా ఆక్టివ్ కేసులు, గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 500 మందికి పాజిటివ్, మరో 563 మంది రికవరీ
Team Latestlyగడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 88, కృష్ణా జిల్లా నుంచి 77, గుంటూరు నుంచి 55, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 63, 47 కొత్త కేసులు నమోదయ్యాయి....
Jagananna Amma Vodi: జగనన్న అమ్మ ఒడి పథకానికి వెంటనే అప్లయ్ చేసుకోండి, 2021 జనవరి 9వ తేదీన రూ.15 వేల ఆర్థిక సాయం, డిసెంబర్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన
Hazarath Reddyఏపీలో జగనన్న అమ్మ ఒడి పథకానికి ఎవరైనా అప్లయి చేసుకోకుంటే వెంటనే అప్లయి చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుత విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సాయం జనవరి 9వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
Chirala Violence: చీరాలలో ఎస్సైపై మత్య్స్యకారుల దాడి, ఉద్రిక్తంగా మారిన ఎంపీ మోపిదేవి పర్యటన, 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గొడవకు ప్రధాన కారణం అదేనా..
Hazarath Reddyఈపురుపాలెం ఎస్సై సుధాకర్ కారుపై రాళ్లతో మత్స్యకారులు దాడికి (Eepurupalem SI Sudhakar's car was attacked) పాల్పడ్డారు .ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. మత్స్యకారులను పరామర్శించిన మోపిదేవి వెంకటరమణ ముందే ఆమంచి డౌన్ డౌన్.. ఆమంచి గో బ్యాక్ అంటూ వాడరేవు మత్స్యకారులు నినాదాలు చేశారు.
Covid in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, 24 గంటల్లో 305 మందికి కరోనా పాజిటివ్‌, రాష్ట్రంలో 4728 యాక్టివ్‌ కేసులు, తొలి దశలో కోటి మందికి టీకా ఇవ్వనున్న ఏపీ సర్కారు
Hazarath Reddyకేంద్రం నుంచి రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ రాగానే నెలలో కోటిమందికి వేసేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడు సరఫరా అవుతుందన్న స్పష్టత లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్‌కు చురుగ్గా సన్నాహాలు చేస్తోంది.
Maharashtra Shakti Bill: ఏపీ దిశ చట్టం తరహాలో..మహారాష్ట్రలో శక్తి బిల్లును తీసుకువచ్చిన ఉద్ధవ్ సర్కారు, మ‌హారాష్ట్ర శ‌క్తి బిల్లు 2020 ద్వారా పోక్సో చ‌ట్టం మ‌రింత క‌ఠిన‌త‌రం
Hazarath Reddyదేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు దీనిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ దిశ ఘటన తర్వాత ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మ‌హిళ‌లు, చిన్నారుల ప‌ట్ల హింస‌ను అదుపు చేసే ఉద్దేశంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ అసెంబ్లీలో (Maharashtra Assembly) శ‌క్తి బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. ఏపీలోని దిశ చ‌ట్టం త‌ర‌హాలో శ‌క్తి బిల్లును (Maharashtra Shakti Bill) రూపొందించారు.
CM Jagan Polavaram Tour: పోలవరం పనులు గడువు లోగా పూర్తి చేయండి, అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyపోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్..‌ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
Covid in AP: ఏపీలో 24 గంటల్లో 506 మందికి కోవిడ్ పాజిటివ్, ఐదుగురు మృతితో 7057కు చేరుకున్న మరణాల సంఖ్య, ప్రస్తుతం రాష్ట్రంలో 4966 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా కేసులు (Covid in AP) తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా, 506 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5531కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 613 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 863508 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
Eluru Mystery Disease: ఏలూరు వ్యాధి వైరస్,బ్యాక్టీరియా వల్ల కాదు, మూడు రోజుల్లో అంతుచిక్కని వ్యాధిపై తుది నివేదిక, తాగు నీటిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లుగా వార్తలు, బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారని తెలిపిన మంత్రి ఆళ్ల నాని
Hazarath Reddyఏపీలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొందని, అంతుచిక్కని వ్యాధి (Eluru Mystery Disease) కారణంగా అనారోగ్యం పాలై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా డిశ్చార్జ్‌ అయ్యారని మంత్రి ఆళ్లనాని తెలిపారు. బాధితులను పరామర్శించిన తరువాత ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు.
AP Covid Report: ఏపీలో రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, తాజాగా 510 మందికి కరోనా, ముగ్గురు మృతితో 7052కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, రాష్ట్రంలో 5078 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyకరోనా మహమ్మారి నివారణకు సంబంధించి సీరం కీలక అంశాన్ని వెల్లడించింది. ఈ నెలాఖరులోనే ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అత్యవసర లైసెన్స్ పొందవచ్చనే ఆశాభావాన్ని సీరం సీఈఓ అదార్‌ పూనావాలా వ్యక్తం చేశారు. ఆమోదం తర్వాత, వచ్చే నెలలోగా భారతదేశంలో టీకా పంపిణీ ప్రారంభించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Dial Your EO Program: శ్రీవారి భక్తులకు శుభవార్త, తెరుచుకోనున్న వైకుంఠ ద్వారం తెలుపులు, డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం, రోజుకు 20 వేలు చొప్పున ఆన్‌లైన్‌లో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు విడుద‌ల
Hazarath Reddyతిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారం తలుపులు తెరుచుకోనున్నాయి. వైకుంఠ ఏకాద‌శి (Vaikuntha Ekadashi) సంద‌ర్భంగా డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు వైకుంట ద్వారం తలుపులు (Vaikuntha Gate of Srivari Temple) తెరిచి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పిస్తామని టీటీడీ ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి (TTD EO Dr. KS Jawahar Reddy) తెలిపారు.
Teachers Transfer Row: టీచర్ల బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది..మీకెందుకు? బీసీ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిల్‌పై మండిపడిన ఏపీ హైకోర్టు, పిల్‌ను ఉపసంహరించుకున్న న్యాయవాది
Hazarath Reddyఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఏపీ బీసీ సంక్షేమ సంఘం.. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఫలానా విధంగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు మండిపడింది. ఉపాధ్యాయుల బదిలీలకు, మీ సంఘానికి అసలు సంబంధం ఏమిటని ప్రశ్నించింది.
Doubling Farmers' Income Row: రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలి, బ్యాంకులు ప్రధానంగా దీనిపై దృష్టి సారించాలి, 213వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyరైతుల ఆదాయం ఎలా రెట్టింపు (Doubling Farmers' Income) అవుతుందన్న దానిపై బ్యాంకులు (Banks) ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 520 మందికి కొవిడ్ పాజిటివ్, మరో 519 మంది రికవరీ, రాష్ట్రంలో5,236గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyగడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 108, కృష్ణా జిల్లా నుంచి 71, గుంటూరు నుంచి 64, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 69, 59 కొత్త కేసులు నమోదయ్యాయి....