ఆంధ్ర ప్రదేశ్
PUBG Ban: పబ్‌జీ బ్యాన్, ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య, మరోచోట మొబైల్‌లో గేమ్‌ ఆడవద్దన్నందుకు బాలిక ఆత్మహత్య, కుటుంబాల్లో విషాదాన్ని నింపిన మొబైల్ వ్యసన ఘటనలు
Hazarath Reddyఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం (PUBG Ban) విధించింది. ఈ నేపథ్యంలో బాటిల్‌ గ్రౌండ్‌ గేమ్‌ పబ్‌జీకి బానిసైన ఓ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎడతెరిపిలేకుండా గేమ్‌లోనే మునిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డి (23) పబ్ జీ బ్యాన్ తో తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని (Btech student hangs self) ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5 లక్షల 47 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4779కి పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyతూర్పు గోదావరి జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తిలో ఎలాంటి నియంత్రణ కనిపించడం లేదు. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే....
CBI to Probe Antarvedi Incident: అంతర్వేది రథం దగ్ధం ఘటన సిబిఐకి అప్పగింత, జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ ఘటనను సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారని సీఎంఓ ప్రకటన
Team Latestlyఏపీ ప్రభుత్వం ఘటన దర్యాప్తును సిబిఐకి అప్పజెప్తున్నట్లు శుక్రవారం జీవో విడుదల చేసింది. సెక్షన్‌ 6, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది...
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభన, గత 24 గంటల్లో కొత్తగా మరో 10,175 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5 లక్షల 37 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య
Team Latestlyతాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 5,37,687కు చేరింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 5,34,792 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.....
Antarvedi Temple Chariot Fire: కుట్ర కోణంపై దర్యాప్తు జరుగుతోంది. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, నిరసన కార్యక్రమం చేపడుతున్న బీజేపీ
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో (Antarvedi Temple Chariot Fire) కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ (Vellampalli Srinivas) తెలిపారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై (Antarvedi chariot fire accident) అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని తెలిపారు.
Coronavirus in AP: ఏపీలో తాజాగా 10,418 మందికి కరోనా, 5,27,512కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 74 మంది మృత్యువాతతో 4,634కి చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyఏపీలో మరోమారు 10 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 71,692 నమూనాలు పరీక్షించగా 10,418 మందికి కరోనా (Coronavirus) నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512కి (Coronavirus cases in Andhra Pradesh) చేరింది. అటు, రాష్ట్రవ్యాప్తంగా 74 మంది మృత్యువాత పడగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,634కి పెరిగింది.
Kisan Train: అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు. జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రులు తోమర్, సురేష్, అక్టోబరు నుంచి ప్రతి రోజూ ఢిల్లీకి కిసాన్ రైలు
Hazarath Reddyఏపీలో అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్‌ రైలు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌, ఏపి సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ట్రైన్‌ను జెండా ఊపి (AP CM YS Jagan flags of Kisan train) ప్రారంభించారు. అనంతరం కిసాన్‌ రైలు అనంతపురం రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరింది.
Special Trains: ఏపీ నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల లిస్టు వచ్చేసింది, సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వేశాఖ, ఏపీ నుంచి 24 ప్రత్యేక రైళ్ల రాకపోకల సమాచారం మీకోసం
Hazarath Reddyప్టెంబర్ 12 నుంచి ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను (IRCTC special trains) నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అన్‌లాక్‌ 4.0లో (Unlock 4) భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది.
APSET 2020: విద్యార్థులు రెడీ అయ్యారా..రేపట్నుంచే ఏపీ సెట్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సురేష్
Hazarath Reddyఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్‌’ (APSET 2020) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు (Andhra Pradesh State Eligibility Test) సన్నాహాలు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.
CPM Workers Protest: రోడ్డుపై ఈత కొట్టిన సీపీఎం నేతలు, అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై వినూత్న రీతిలో నిరసన, విజయనగరం కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలో నిరసన ఘటన
Hazarath Reddyవిజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలోని అంతరాష్ట్ర రోడ్డు దుస్థితిపై సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు వినూత్న రీతిలో నిరసన (CPM Workers Protest) తెలిపారు . బురదమయమైన రోడ్లపై ( Potholes in Vizianagaram) అరటి మొక్కలు నాటారు. నీళ్లు తోడారు. చేపలు పట్టారు. ఈత (CPM Workers Swim) కొట్టారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషాను కలిపే ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం రైతు కూలీ సంఘం నేతలు వాపోయారు.
Coronavirus in AP: కరోనాపై గుడ్ న్యూస్, ఏపీలో 4 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 96,769 కేసులు, తాజాగా 10,601 మందికి కోవిడ్-19, మరణాల సంఖ్య 4,560కు చేరిక
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 70,993 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 10,601 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,17,094కు (Coronavirus in AP) చేరింది. కొత్తగా 73 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,560కు (Coronavirus Deaths) చేరింది. సోమవారం 11,691 మంది కరోనా (Coronavirus (COVID-19) నుంచి కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏపీలో 4,15,765 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 96,769 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
CM YS Jagan VC With Collectors: కరోనా పరీక్షలు తప్పనిసరిగా జరగాలి, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్‌ స్పందన వీడియో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సమీక్ష
Hazarath Reddyరాష్ట్రంలో కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ (CM YS Jagan VC With Collectors) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. కోవిడ్‌ నివారణ చర్యలు, స్కూళ్లు, అంగన్‌వాడీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం జగన్‌ ( YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు.
Liquor Consumption in AP: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం వినియోగం, 5 నెలల్లో రూ.2,170 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ప్రభుత్వం, మద్యం నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయా..
Hazarath Reddyఏపీలో మద్యం నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయా.. తాజా గణాంకాలు ఇది నిజమనే చెబుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మద్యం వినియోగం (Liquor Consumption in AP) గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా భారీగానే తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యాన్నితమ ఆదాయ వనరుగా చూడటం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Antarvedi Temple Chariot Fire: రూ. 90 లక్షలతో కొత్త రథం, అంతర్వేది రధం దగ్ధం ఘటనలో ఈవో సస్పెండ్, నిజాలను నిగ్గు తేల్చేందుకు అంతర్గత విచారణ కమిటీ, టీడీపీకి మాట్లాడే హక్కు లేదని తెలిపిన మంత్రి శ్రీనివాస్
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన (Antarvedi Temple Chariot Fire) చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెదపాటి అమ్మాజీతో క‌లిసి ఆయ‌న సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో రథం దగ్ధం అయిన ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు.
Jaya Prakash Reddy: మరో అద్భుతమైన నటరత్నాన్ని కోల్పోయిన టాలీవుడ్, నటుడు జయ ప్రకాష్ రెడ్డి హఠాన్మరణం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
Team Latestlyజయప్రకాష్ రెడ్డి చివరగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో కూడా విలన్ ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో నటించిన ఆయన నాలుక మడతబెడుతూ ' వీడిని పండబెట్టి, పీకకోసి.. హుమ్.. హుమ్..' అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్....
Coronavirus in AP: ఏపీలో ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు, తాజాగా 8,368 కోవిడ్ కేసులు నమోదు, 24 గంటల్లో 70 మంది మృతితో 4,487కు చేరుకున్న మృతుల సంఖ్య
Hazarath Reddyఏపీలో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ (Coronavirus in AP) అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు లక్షలు (state tally crosses 5-lakh mark) దాటింది. వరుసగా 11 రోజుల పాటు 10వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది.
AP Unlock 4.0 Guidelines: సెప్టెంబర్ 30 వరకు ఏపీలో నో స్కూల్స్, అంతక్రియలకు 20 మందికి మాత్రమే, అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను (AP Unlock 4.0 Guidelines) జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్‌ (Educational institutions Closed) కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్‌, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
YSR Sampoorna Poshana Schemes: ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఏపీ ప్రభుత్వం చిన్నారులతో పాటు బాలింతలు, గర్బిణీలు ఆరోగ్యంగా ఉంచాలని భావించి, పలు పథకాలను (YSR Sampoorna Poshana Schemes) అమల్లోకి తెచ్చింది. తాజాగా ఏపీలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ (YSR Sampoorna Poshana Plus Scheme), వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను (YSR Sampoorna Poshana scheme) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు.
AP Covid Update: కొత్తగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా, ఏపీలో 24 గంటల్లో 10,794 మందికి కోవిడ్-19, 4,98,125కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 4417 కు చేరిన మృతుల సంఖ్య
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 72,573 నమూనాలు పరీక్షించగా 10,794 పాజిటివ్‌ కేసులు (Andhra Pradesh COVID-19 cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల 4,98,125 కు సంఖ్య చేరింది. తాజా పరీక్షల్లో 35,358 ట్రూనాట్‌ పద్ధతిలో, 37,215 ర్యాపింగ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 70 మంది మృతి చెందడంతో ఆ సంఖ్య 4417 కు చేరింది. చిత్తూరు 9, అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 2, విజయనగరం జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.