ఆంధ్ర ప్రదేశ్
TDP MLA Karanam Balaram: వైసీపీలోకి 10 నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుతో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం
Hazarath Reddyటీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం (TDP MLA Karanam Balaram) తెలుగుదేశం పార్టీ మీద, దాని అధినేత మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీ అధినేత చంద్రబాబుతో (TDP Chief Chandrababu) ) ఎంతకాలం నుంచి ఉన్నామో అందరికీ తెలుసని, ఎంత ఇబ్బంది పడ్డామో కూడా తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వైఖరికి, జగన్ వ్యవహారశైలికి ఎంతో తేడా ఉందని, జగన్ (YS Jagan) తనను నమ్మినవాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తాడని స్పష్టం చేశారు. జగన్ తండ్రి వైఎస్ తోనూ తమకు సన్నిహిత సంబంధాలుండేవని కరణం గుర్తుచేసుకున్నారు.
AP Coronavirus: ఏపీలో అన్నీ ఓపెన్, తాజాగా 125 కోవిడ్ 19 కేసులు, జ్వరం,దగ్గు లక్షణాలుంటే వెంటనే 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు
Hazarath Reddyఏపీలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 14,246 మందికి పరీక్షలు నిర్వహించగా 125 మందికి కరోనా పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య (COVID-19 Cases) 4813కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో 838 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉండగా, 132 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.
AP's COVID19 Report: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 199 పాజిటివ్ కేసులు మరియు మరో 2 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో 4,659కు చేరిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య
Team Latestlyతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3718 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది...
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో 4,460కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 210 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyకేసులు పెరిగినా, కొత్తగా నమోదైన కరోనా మరణాలేమి లేకపోవడం ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 73 గా ఉంది. మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 29 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Weather Forecast: చురుగ్గా విస్తరిస్తున్న రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో చల్లబడ్డ వాతావరణం, రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్న భారత వాతావరణ శాఖ
Team Latestlyరాబోయే ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయని, వచ్చే వారం నాటికి దక్షిణ భారతదేశం అంతటా మరియు మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో....
Meera Chopra Issue: మీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామి, ధన్యవాదాలు తెలిపిన టాలీవుడ్ నటి
Team Latestlyసినీ నటి మీరా చోప్రా ఫిర్యాదుపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరా చోప్రా చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని...
TTD Darshan Tickets: జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్, ఈ నెల11 నుంచి భక్తులకు దర్శనం, ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపిన ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌
Hazarath Reddyలాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2 నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరిగి పునఃప్రారంభిస్తోంది. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
APSRTC: ఏపీ నుంచి ఇతర రాష్టాలకు బస్సులు షురూ, అనుమతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
Hazarath Reddyకరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు (Interstate Transport) తిప్పడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. బస్సులు తిరిగేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
AP Coronavirus: ఇది నిజంగా సంచలనమే, 80 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, ఏపీలో తాజాగా 50 కేసులు నమోదు, 3,427కి చేరిన మొత్తం కరోనా కేసులు
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో(గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు) 9,831 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కేవలం 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 21 మంది కరోనా (AP Coronavirus) నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,294కు చేరింది. వైరస్‌తో (COVID-19) నిన్న ఇద్దరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,427 కేసులు నమోదవ్వగా, 73 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. ప్రస్తుతం 1,060 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
VRO Posts in AP: వీఆర్వో పోస్టులను త్వరలో భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం, అర్హులైన వీఆర్‌ఏలను ఈ పోస్టులకు ఎంపిక చేయాలని ఆదేశాలు
Hazarath Reddyఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO) గ్రేడ్‌ –2 పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్‌వో (Grade-2) పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్‌టైమ్‌) ప్రాతిపదికన వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి.
AP Coronavirus: జూన్‌ 8నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్, హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయిన మంత్రులు అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఏపీలో తాజాగా 98 కేసులు నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (AP Coronavirus) గడిచిన 24 గంటల్లో(బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 9,986 కరోనా పరీక్షలు నిర్వహించగా 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 29 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్క రోజు కోవిడ్‌ (Andhra Pradesh) వల్ల గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Vizag Anesthetist Case: డాక్టర్‌ సుధాకర్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు, వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచిన సీబీఐ, ఫిర్యాదు చేసిన ఫోర్త్‌ టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ
Hazarath Reddyనడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మీద నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా డాక్టర్‌ సుధాకర్‌పై కేసు (Vizag Anesthetist Case) నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని (FIR Copy) బుధవారం పొందుపర్చింది. గత నెల 16న డాక్టర్‌ సుధాకర్‌ (Dr Sudhakar Rao Case) విశాఖ పోర్టు ఆస్పత్రి సమీపంలోని జాతీయ రహదారిపై తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని ఫోర్త్‌ టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాఘవేంద్ర కుమార్‌ ఎఫ్‌ఐఆర్‌ ప్రతిలో పేర్కొన్నారు.
YSR Vahana Mitra: ఈ రోజు రూ.10 వేలు నేరుగా అకౌంట్లోకి.., వైఎస్సార్ వాహన మిత్ర రెండో దఫా మొత్తాన్ని విడుదల చేసిన ఏపీ సర్కారు, 4 నెలల ముందుగానే విడుదల
Hazarath Reddyకరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ (Lockdown)విధించిన నేపధ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) రెండో సారి రూ. 10 వేలు అందించనున్నారు. బతుకుదెరువు కోసం ఆటోలు, మ్యాక్సీలు నడుపుకుంటున్న డ్రైవర్లకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ మాట ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra) కింద వారికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయడం ద్వారా అండగా నిలుస్తున్నారు. గతేడాది అనుకున్న ప్రకారం అందించారు.
AP Panchayat Offices Colour Issue: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో (AP Panchayat Offices Colour Issue) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాలని ఆదేశించింది.. రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసింది వైఎస్సార్‌సీపీ జెండా రంగులు కాదని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది.. కోర్టు మాత్రం తోసిపుచ్చింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
Corona in AP: మరో రికార్డు దిశగా ఏపీ, 4 లక్షల కోవిడ్-19 టెస్టులు చేసిన రాష్ట్రంగా గుర్తింపు, కరోనా నియంత్రణ కోసం రూ.300 కోట్లకు పైగా వ్యయం, ఏపీలో 3279కి చేరిన కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,066 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య (Corona in AP) 3279కు పెరిగింది. 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం కోవిడ్‌ (AP Coronavirus) వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, కర్నూలులో ఒకరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో 2244 మంది డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం 967 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడి 68 మంది మృతి చెందారు.
Dr Sudhakar Case: డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన సీబీఐ
Hazarath Reddyఈ మధ్య కాలంలో ఏపీలో పలు సంచలనాలు, వివాదాలకు కారణమైన కేసుల్లో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు (Dr Sudhakar Case) ఒకటి. ఆయన వివాదాస్పద వ్యవహారశైలి తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు (AP High Court) సీబీఐకి అప్పగించింది. కాగా కేసు సీబీఐ (CBI) దగ్గర కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
Tirumala Srivari Darshan: శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జూన్ 8న తెరుచుకోనున్న శ్రీవారి ఆలయ తలుపులు, ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ అధికారులు
Hazarath Reddyకోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా రెండునెలలకు పైగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలు (Tirumala Sri vari Darshan) తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనావైరస్‌ (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
AP SEC Row: హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కారు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను, ఎన్నికల కమిషనర్‌గా (State Election Commissioner) హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
AP Coronavirus: ఏపీలో తాజాగా 82 కేసులు నమోదు, రాష్ట్రంలో 3,200కు చేరిన కరోనా కేసులు, ఏపీ సీఎం ఢిల్లీ టూర్ వాయిదా
Hazarath Reddyఏపీలో (AP Coronavirus) గడిచిన 24 గంటల్లో 12,613 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 40 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2209 చేరింది. కాగా సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,200 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మృతి చెందారు. ప్రస్తుతం 927 మంది వివిధ కోవిడ్‌ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు
APSRTC: ఏసీ బస్సులు వచ్చేస్తున్నాయ్, రాయలసీమ టూ వైజాగ్ వరకు ఇంద్ర బస్సులను నడపాలని ఏపీ సర్కారు నిర్ణయం, ఆదరణ కోల్పోతున్న పల్లెవెలుగు
Hazarath Reddyలాక్‌డౌన్‌ 5.0 (Lockdown 5) అమలులోకి రావటంతో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఆర్టీసీ జిల్లాల మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించింది . లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. ఇది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏసీ బస్సు సర్వీసులకు విరామం ఇచ్చిన ఆర్టీసీ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది.