ఆంధ్ర ప్రదేశ్
JC Prabhakar Reddy Arrest: టీడీపీకి మళ్లీ షాక్, పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్, బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించారని ఆరోపణలు
Hazarath Reddyటీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ టెక్కిలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ పోలీసులు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేసిన ఉదంతం మరచిపోకముందే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని (JC Prabhakar Reddy Arrest) పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని (Asmith Reddy) అనంతపురం పోలీసులు (Anantapur police) అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అనంతరం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
AP Coronavirus: తిరుమలలో తొలి కరోనా పాజిటివ్ కేసు, ఏలూరులో భార్యకు కరోనా రావడంతో గుండెపోటుతో భర్త మృతి, ఏపీలో తాజాగా 141 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 11,775 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus) జరిగింది. కరోనాతో కోలుకొని 59 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ (Health Department) విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,402 కేసులు (COVID 19 Cases) నమోదవ్వగా, 80 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మొత్తం 2,599 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రలో ప్రస్తుతం 1723 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
Manabadi AP Inter Result 2020: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలు ఒకే రోజు విడుదల, పాసయ్యారో లేదో చెక్ చేసుకోవడం ఎలా ?
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్ వే హోటల్ లో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలను ఒకే రోజు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫలితాలు https://bie.ap.gov.in, www.sakshieducation.com తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు, పలు చోట్ల పొంగిపొర్లిన వాగులు, మరో 24 గంటల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ శాఖ
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. జూన్‌ 10న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపనాలు (Southwest Monsoon) ఒక్కరోజులోనే రాష్ట్రం మొత్తం విస్తరించాయి. రుతుపవనాలకుతోడు ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతున్నది. అల్పపీడనం, రుతుపవనాల విస్తరణతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామా బాద్‌ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు,మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది.
Dr.Sudhakar Case: డాక్టర్ సుధాకర్ పదే పదే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మండిపడిన విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా
Hazarath Reddyఇటీవల సస్పెన్షన్‌కి గురైన వివాదాస్పద వైద్యుడు సుధాకర్‌ (Dr.Sudhakar) పదే పదే పోలీస్‌ స్టేషన్‌కు వస్తూ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా (Visakhapatnam CP R K Meena) మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలమేరకు (AP High Court) సుధాకర్‌పై నమోదైన కేసును సీబీఐకి అప్పగించారని, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇలాంటి సమయంలో ఆయన పోలీస్‌స్టేషన్‌కు రావడం ఎందుకని సీపీ మీనా ప్రశ్నించారు.
ESI Medicine Scam: రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్‌ రవికుమార్‌
Hazarath Reddyఈఎస్‌ఐ కుంభకోణంలో (ESI Medicine Scam) ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ( Tekkali TDP MLA Atchannaidu) ఏసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ (ACB) అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.
AP CM Village Tour: ఆగస్టు నుంచి గ్రామాల్లోకి వైయస్ జగన్, ఎవరైనా పథకాలు అందలేదని ఫిర్యాదులు చేస్తే అధికారులే బాధ్యులు, ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటనకు (AP CM Village Tour) సన్నద్ధం అవుతున్నారు. తన పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలును పరిశీలించనున్నారు. ఈలోపు అర్హులైన ప్రజలు ఎవరూ కూడా తమకు సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
Dr Sudhakar Latest Comments: సీఎం వైయస్ జగన్ నాకు దేవుడితో సమానం, డాక్టర్ సుధాకర్ కొత్త పలుకు, గుండు కొట్టిన వాళ్ల పేరు చెబితే గొడవలవుతాయన్న డాక్టర్
Hazarath Reddyవిశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు (Dr Sudhakar Comments) చేశారు. గతంలో ఏపీ సీఎం జగన్ ను తిట్టిన సుధాకర్ తాజాగా జగన్ దేవుడు (AP CM YS jagan) లాంటివాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానసిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తొలిసారి జనం ముందుకు వచ్చిన సుధాకర్ (Narsipatnam Doctor Sudhakar) పలు విషయాలు వెల్లడించారు. అదే సమయంలో తన ఉద్యోగం తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం జగన్ దేవుడని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
AP Cabinet Key Decisions: గత ప్రభుత్వ అవకతవకలపై సీబీఐ విచారణ, ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు (AP Cabinet Key Decisions) తీసుకుంది. ఈ రోజు సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ (AP Cabinet) కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.
AP Inter Results 2020: ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల, మనబడి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్న ఆంధ్రప్రదేశ్ బోర్డు
Hazarath Reddyఏపీ మనబడి ఇంటర్ రిజల్ట్స్ 2020 ను (Manabadi Inter Results 2020) రేపు (శుక్రవారం) ప్రకటించడానికి బీఐఏపీ (BIEAP) సిద్ధమైంది. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను మనబడి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. పరీక్షా ఫలితాలను (AP Inter Results 2020) రేపు అధికారిక వెబ్‌సైట్‌ లో పొందుపర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, AP ఇంటర్ రిజల్ట్స్ 2020 ను నోటీసు బోర్డులలో ప్రదర్శించవద్దని పాఠశాలలకు సూచించబడింది.
AP Coronavirus: అనంతపురం యాడికిలో 20 కరోనా కేసులు, ఏపీలో 4,261కు చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, హోంక్వారంటైన్ ‌లోకి 8 మంది జీజీహెచ్ వైద్యులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (AP Coronavirus) గత 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా మరో 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,261 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు (Covid-19 cases) 1,641 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది.
Tirumala Temple Darshan: భక్తులతో పోటెత్తిన తిరుమల, 30 గంటల్లో 60 వేల టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు, అలిపిరి వద్ద భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌
Hazarath Reddyతిరుమల ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యింది. మూడు రోజుల ట్రయల్ రన్‌ తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మందికి శ్రీవారి దర్శనభాగ్యం కలుగనుంది. టైం స్లాట్ టోకెన్ల ద్వారా మరో 3 వేల మందికి శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు. 53 మందికి వీఐపీ టిక్కెట్ల ద్వారా టీటీడీ దర్శనం కల్పించింది. టీటీడీ సిబ్బంది అలిపిరి వద్ద భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. టికెట్లు ఉన్నవారినే మాత్రమే దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు.
AP Cabinet Meeting: కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లు ఏర్పాటు, ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు ఇవే
Hazarath Reddyఏపీ రాష్ట్ర మంత్రివర్గం (AP State Cabinet Meeting) నేడు భేటి కానుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో ఈ మీటింగ్ జరగనుంది. కరోనా (COVID-19) నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణకు కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్‌లతో పాటు మొత్తం 40 అంశాలపై మంత్రివర్గ మండలి చర్చించి ఆమోదముద్ర వేయనుంది. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి కూడా కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
AP SEC Row: నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రెండు వారాల్లోగా ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
Hazarath Reddyరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడాన్ని ఏపీ హైకోర్టు (AP High Court) తప్పు పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ్లిన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బాబ్డే (chief justice S A Babde), జస్టిస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది.
Sidda Raghava Rao joins YSRCP: ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్, వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి
Hazarath Reddyప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కరణం బలరాం (Karanam Balaram) ప్రకంపనలు మరవక ముందే ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు (DP Ex-Minister Sidda Raghava Rao) బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSRCP) చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్‌ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి (AP CM YS Jagan)వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
TSRTC: అంతర్రాష్ట్ర సర్వీసులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, ఒప్పందం తరువాత రోడ్డెక్కనున్న టీఎస్ఆర్టీసీ, ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో చర్చలు జరుపుతున్న తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్
Hazarath Reddyప్రస్తుతం జిల్లా సర్వీసులు నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులకూ (Interstate Bus Services) సిద్ధమైంది. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ సర్కార్‌ (Telangana Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పొరుగు రాష్ట్రాలతో ముందుగా ఒప్పందాలు చేసుకున్న తర్వాతే... సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించింది. దీంతో సీఎస్ సోమేష్ కుమార్ ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో చర్చలు జరపనున్నారు. ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌... ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రూట్ టు రూట్ నడపాలని అధికారులను ఆదేశించారు. సిటీ సర్వీసులు ఇప్పుడే వద్దన్నారు.
Heavy Rains Alert: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రానున్న రెండు రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ విభాగం
Hazarath Reddyతూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు (Rain In Andhra Pradesh) కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (Heavy Rains Alert) వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Amaravati SI Suspended: లాడ్జీలో కోరిక తీర్చాలంటూ ఎస్ఐ ఒత్తిడి, బాధితుల ఫిర్యాదుతో సస్పెన్షన్‌కు గురైన అమరావతి ఎస్ఐ, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిఎస్‌పి ఆదేశాలు
Hazarath Reddyమహిళలను రక్షించాల్సిన పోలీసు అధికారి తన కర్తవ్యాన్ని మరిచి ఓ మహిళ వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు, లైంగిక దాడికి యత్నించిన ఆరోపణలు రావడం అమరావతిలో (Amaravati) కలకలం రేపింది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సస్పెన్షన్‌కు (Amaravati SI Suspended) గురయ్యారు.
Jagananna Chedodu Scheme: నేడు జగనన్న చేదోడు స్కీమ్ లాంచ్, కుల వృత్తుల వారికి ఏడాదికి రూ.10 వేలు, రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేడు జగనన్న చేదోడు పథకాన్ని లాంచ్ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఈ పథకం కింద ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ) సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu Scheme) పేరుతో ఆర్థిక సహాయం అందించనున్నారు.
AP Coronavirus: ఏపీలో నాలుగు వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, తాజాగా 147 కరోనా కేసులు నమోదు, 2403 మంది డిశ్చార్జ్‌
Hazarath Reddyఏపీలో (Andhra Pradesh) గడిచిన 24 గంటల్లో 15,085 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 147 మందికి పాజిటివ్‌గా నిర్దారణ (AP Coronavirus) అయింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 16 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరణించిన ఆ ఇద్దరు కృష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 3990 కరోనా కేసులు నమోదు కాగా 2403 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు 77 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1510 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.