ఆంధ్ర ప్రదేశ్
Lockdown 4.0: దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, నేటి నుంచే లాక్‌డౌన్ 4.0 అమలు, నూతన లాక్‌డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏం మార్పులు జరిగాయో చూడండి
Team Latestlyకంటైన్మెంట్ మరియు రెడ్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో వాహనాలు తిరగవచ్చు. ఇరుగు-పొరుగు రాష్ట్రాలు మరియు యూటీల పరస్పర అంగీకారంతో బస్సులు మరియు ప్రయాణీకుల వాహనాలకు అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఉంటుంది.....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా తీవ్రత, గత 24 గంటల్లో 25 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు, రాష్ట్రంలో 2230కి చేరిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య
Team Latestlyలాక్డౌన్ కారణంగా సుమారు రెండు నెలలుగా ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులను పున: ప్రారంభించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.....
Weather Update: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, జలమయమైన రోడ్లు, రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి
Team Latestlyఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీరాల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు 1100కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో వాయుగుండం కాస్తా 'అంఫాన్' తుఫానుగా మారే అవకాశం ఉందని....
Corona in AP: ఆంధ్రప్రదేశ్‌లో 2205కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 48 పాజిటివ్ కేసులు నమోదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులను విడిగా చూపుతున్న అధికారులు
Team Latestlyగత 24 గంటల్లో కొత్తగా మరో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2205కు చేరింది. ఈరోజు కర్నూలులో మరొక కోవిడ్-19 పేషెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు....
Srikakulam DSP Suicide: ఏపీలో డీఎస్పీ ఆత్మహత్య, శ్రీకాకుళం డీఎస్పీ కృష్ణవర్మ మృతిపై కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు, అనారోగ్యమే కారణమా..?
Hazarath Reddyఅనారోగ్య కారణాలతో ఓ పోలీస్‌ అధికారి ఆత్మహత్యకు (Srikakulam DSP Suicide) పాల్పడ్డారు. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా (Srikakulam Special branch) విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్‌ ఆపరేషన్‌ కూడా అయ్యింది. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో (srikakulam) దాదాపు పదేళ్లపాటు ఎస్‌ఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
APSRTC: ఈనెల 16 నుంచి హైదరాబాద్‌కు ఏపీ బస్సులు, స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణ సౌకర్యం, నిబంధనలు అంగీకరిస్తేనే ప్రయాణానికి అనుమతి
Hazarath Reddyలాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చాలామంది చిక్కుకుపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 16న హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు (APSRTC) నడవనున్నాయి. అయితే నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో (Spandana Portal) దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 16వ తేదీ నుంచి ఏపీకి బస్సులు నడపనున్నారు.
AP Coronavirus: కర్నూలులో నేడు జీరో కేసులు నమోదు, ఏపీలో 2157కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య, తాజాగా 57 కోవిడ్19 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో శుక్రవారం తాజాగా మరో 57 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో (COVID 19 in AP) అనంతపురం 4, చిత్తూరు 14, కడప 2, కృష్ణా 9, కర్నూలు 8,నెల్లూరు 14, విజయనగరం 3, విశాఖపట్నం 2, తూర్పు గోదావరి 1 ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని 1252 మంది డిశ్చార్జ్‌ కాగా, 48 మంది మరణించారు.
Cyclone Amphan: బలపడిన అల్పపీడనం, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, అంఫాన్ తుఫానుతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరిక
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. 16వ తేదీ సాయంత్రం లేదా 17వ తేదీ ఉదయానికి ఇది తుఫాన్‌గా (Cyclone Amphan) మారనున్నది. తొలుత వాయవ్యంగా, తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌ (Cyclonic Storm) మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
YSR Rythu Bharosa-PM Kisan: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ.7,500, నేడు సీఎం చేతుల మీదుగా వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ప్రారంభం, తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.2800 కోట్లు జమ
Hazarath Reddyతొలివిడతగా నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,800 కోట్లు జమ కానుంది. ప్రతి రైతు కుటుంబానికి తొలివిడతగా రూ.7,500 నేరుగా అకౌంట్లో వేయనున్నారు. ఈసారి 49.43 లక్ష కుటుంబాలకు పెట్టుబడి సాయంగా అందనుంది.ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు ఏపీ సీఎం సాయం చేయనున్నారు.
Naguluppalapadu Road Accident: కూలీలను వెంటాడిన మృత్యువు, ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్, 9 మంది అక్కడికక్కడే దుర్మరణం
Hazarath Reddyప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ (Naguluppalapadu Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు కాగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మిర్చి పనులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం (Prakasam tractor accident) జరిగింది. వీరంతా మాచవరానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో మాచవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP SSC Exams 2020:ఏపీలో జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు, 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి పేపర్‌కు 100 మార్కులు
Hazarath Reddyకరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పదవ తరగతి పరీక్షలు (AP SSC Exams 2020) వాయిదాపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు (July 10 To 15) నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి.
AP Coronavirus Report: నెల్లూరులో 15 కొత్త కేసులు, ఏపీని వణికిస్తున్న థానే,కోయంబేడు, 2100కు చేరుకున్న మొత్తం కోవిడ్ 19 కేసులు, శ్రీకాకుళంలో మరో రెండు తాజా కేసులు
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 36 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (AP Coronavirus Report) 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనావైరస్‌ (Coronavirus) బారిన పడిన వారిలో ఇప్పటివరకు 1192 మంది కోలుకోగా, 860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నెల్లూరులో 15, చిత్తూరులో 9, గుంటూరులో 5 ఉండగా, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు చొప్పున, పశ్చిమగోదావరిలో మరో కేసు నమోదయ్యాయి. ఇవాళ మరణించిన వ్యక్తి కర్నూలు జిల్లాకు సంబంధించినవారు.
English Medium in Public Schools: ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం
Hazarath Reddyఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం (English Medium in AP) అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి.
AP COVID-19 Report: చిత్తూరులో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు, ఏపీలో 2137కు చేరిన కేసుల సంఖ్య, 1142 మంది కోవిడ్ 19 నుండి కోలుకుని డిశ్చార్జి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల (AP COVID-19 Report) సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తోంది . ఏపీలో గడిచిన 24 గంటంల్లో కొత్తగా 48 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో (Andhra Pradesh) పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137కు చేరింది.
APSRTC: ఏపీలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్, పరిమిత సంఖ్యలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ఆన్‌లైన్ ద్వారానే టికెట్ల కొనుగోలు
Hazarath Reddyలాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ప్రజా రవాణా శాఖాధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ(పీటీడీ) ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ (APSRTC MD Madireddy Pratap) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్‌ జారీ చేసినట్లు సమాచారం.
Krishna Water Row: మా నీళ్లను మేము తీసుకుంటున్నాం, దీనిపై రాజకీయాలు చేయడం తగదు, కృష్ణా జ‌లాల అంశంపై స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికి అక్కడ ప్రాజెక్టు కట్టుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. దీన్ని రాజ‌కీయం ( (Krishna Water Row) చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని వ్యాఖ్యానించారు. తన నివాసంలో ఇరిగేష‌న్ అధికారుతో స‌మావేశ‌మైన ఏపీ సీఎం కృష్ణా జ‌లాల అంశంపై పలు విషయాలను వెల్లడించారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి దాపురించింద‌న్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల‌న్నారు
AP Electricity Bills: ఏపీలో విద్యుత్ బిల్లుల మోత, ఏ మాత్రం నిజం లేదు,లాక్‌డౌన్‌ కారణంగా 60 రోజులకు మీటర్ రీడింగ్ తీసాం, మీడియాకు వెల్లడించిన ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి
Hazarath Reddyఏపీలో విద్యుత్ బిల్లుల మోత (AP Electricity Bill) మోగుతుందంటూ ప్రతిపక్షలు రాద్ధాంతం చేస్తున్నాయి. దీనికి తోడు లాక్ డౌన్ (Lockdown) కారణంగా 60 రోజుల మీటర్ రీడింగ్ ఒక్కసారి తీయడంతో బిల్లు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా విద్యుత్ బిల్లు ఛార్జీలు పెంచారని ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఏపీ విద్యుత్ శాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి (Secretary of the Ministry of Energy Srikanth Nagulapalli) పేర్కొన్నారు.
AP DGP Warning on Fake News: ఫేక్ వార్తలను నమ్మకండి, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్
Hazarath Reddyఏపీలో లాక్‌డౌన్‌ (AP Lockdown) ఎత్తేశాక పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయని, నేరాల రేటు పెరిగిపోతుందని జరుగుతున్న ప్రచారాలను నమ్మ వద్దని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( AP DGP Gautam Sawang) స్పష్టం చేశారు. పోలీస్‌ హెచ్చరిక పేరుతో సోషల్‌ మీడియాలో (Social Media) వస్తున్న ఫేక్‌ పోస్టింగ్‌లపై ఆయన స్పందించారు. లాక్‌డౌన్‌ (Lockdown) తర్వాత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని, ఏవైనా సమస్యలుంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ (Damodar Goutam Sawang) హెచ్చరించారు.
AP Corona Report: వైజాగ్‌లో ఒకరి నుంచి 20 మందికి కరోనా, కోలుకున్న కర్నూలు, ఏపీలో 2051కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 1056 మంది డిశ్చార్జ్
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 58 మంది కోవిడ్ (AP COVID-19) నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ చెయ్యబడ్డ వారి సంఖ్య 1056 కి చేరింది. రాష్ట్రంలో 24 గంటల్లో 10,730 సాంపిల్స్ ని పరీక్షించగా 33 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. దీంతో ఏపీలో (Andhra Pradesh) మొత్తం కేసుల సంఖ్య 2051కి చేరింది. ఏపీలో నమోదైన మొత్తం 2051 పాజిటివ్ కేసులకు గాను 1056 మంది డిశ్చార్జ్ కాగా, 46 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 949గా ఉంది. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
DEE Suspended: సీఎం వైయస్ జగన్‌పై అసభ్యకర పోస్టులు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈపై వేటు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చర్యలు తప్పవన్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై (AP CM YS jagan) అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ ఎం.వీ.విద్యాసాగర్‌పై ( AP Police Housing Corporation DEE) ప్రభుత్వం వేటు వేసింది. సీఎం జగన్‌ని, ప్రభుత్వ‌ విధానాలను అసభ్యకరంగా తిడుతూ విద్యాసాగర్ వాట్సాప్ గ్రూప్‌లో (state policies on WhatsApp group) కొన్ని పోస్ట్‌లు పెట్టారు. డీఈఈ పెట్టిన ఈ పోస్ట్‌లను వాట్సాప్‌లో ఉన్న మిగిలిన ఉద్యోగులు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ (CID chief P.V Sunil Kumar) దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించిన సీఐడీ సునీల్ కుమార్ సెక్షన్ 25 ఏపీఎస్పీహెసీ ప్రకారం విద్యాసాగర్‌పై డిస్ప్లైనరీ యాక్షన్ తీసుకున్నట్లు వెల్లడించారు.