ఆంధ్ర ప్రదేశ్

COVID-19 in India: భారతదేశంలో 1,965 కు చేరిన కోవిడ్-19 కేసులు, 12 గంటల్లోనే దేశవ్యాప్తంగా 131 కొత్త పాజిటివ్ కేసులు నమోదు, 50 దాటిన మరణాలు

Vikas Manda

మహారాష్ట్రలో తాజాగా ఒక పోలీస్ ఆఫీసర్ కు కరోనా సోకింది, అలాగే ఒక 26 ఏళ్ల మహిళకు మరియు ఆమె 7ఏళ్ల కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ముంబైలోని ధారావి ప్రాంతంలో ఓ 53 ఏళ్ల వ్యక్తి కరోనావైరస్ సోకి ప్రాణాలు కోల్పోవడంతో.....

COVID-19 in Telugu States: కరోనావైరస్ వయా మర్కజ్, ఆంధ్రప్రదేశ్‌లో 132కు పెరిగిన కేసులు, గంటల వ్యవధిలోనే 88 కొత్త కేసులు నమోదు. తెలంగాణలో 127కు పెరిగిన కరోనా కేసులు

Vikas Manda

మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు, అలాంటి వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు, ఎవరూ చనిపోలేదు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి......

Salute Police: లాక్‌డౌన్ కాలంలో అంకితభావంతో సేవలందిస్తునందుకు కృతజ్ఞతగా పోలీసులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే, ప్రతిగా ఎమ్మెల్యేకు సెల్యూట్ చేసిన పోలీస్

Vikas Manda

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఫాల్గునా బుధవారం సాయంత్రం తన కారులో వెళ్తుండగా లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్న పోలీసులు కనిపించారు. వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే ఫాల్గునా పోలీసుల వద్దకు వెళ్లి ఏఎస్ఐ మోహన్ రావ్ పాదాలను తాకుతూ నమస్కారం చేశారు. అందుకు ప్రతిగా ఏఎస్ఐ పోలీస్ సెల్యూట్ తో ఎమ్మెల్యేను గౌరవించారు.....

CM YS Jagan on COVID-19: ఎవరూ ఆందోళన చెందవద్దు, వైరస్‌ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకండి, కరోనావైరస్ కట్టడిపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ (Andhra pradesh in AP) చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీని నియంత్రించేందుకు లాక్ డౌన్ (Lockdown) అమలు చేస్తున్నారు. కాగా కరోనా నియంత్రణ చర్యలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan Press Meet)బుధవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు

Advertisement

Tablighi Jamaat Row: తబ్లిఘి జమాత్ యొక్క క్రియాశీల సభ్యుడు హైదరాబాద్‌లో మృతి. కరోనావైరస్ కారణంగానే మృతి చెందినట్లు అనుమానాలు, ఇప్పటికీ ధృవీకరించని రాష్ట్ర ఆరోగ్య శాఖ

Vikas Manda

అహ్మద్ అబ్దుల్ ముకీత్ అనే వ్యక్తి మంగళవారం మలక్ పేటలోని యశోద ఆసుపత్రిలో మరణించాడు. ఇతడి రక్త నమూనాలు ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారని, ఇతడి మరణానికి గల కారణాలు ఏంటి? కోవిడ్-19 తోనే చనిపోయాడా? లేదా ? అనే విషయాలను ఆరోగ్య శాఖనే....

COVID-19 in India: భారతదేశంలో 1,637కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 47 మరణాలు నమోదు, మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా మహమ్మారి

Vikas Manda

దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి ద్వారా కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ ఈ సమావేశాలకు హాజరైన వారితోనే లింక్ ఉన్నట్లుగా తేలుతుంది.....

Coronavirus in AP: డేంజర్ జోన్‌లో కడప, 24 గంటల్లో 15 కరోనా కేసులు, ఏపీలో 87కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, ఒక్కరోజులోనే 43 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra pradesh) ఒక్కసారిగా కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరిగాయి. 24 గంటల్లోనే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయి. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in AP) నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) అలర్ట్ అయింది.

Salaries Defer in AP: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాల చెల్లింపు వాయిదా, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత జీత భత్యాలు చెల్లించే అవకాశం, కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ (Coronavirus in AP) చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు (Jagan Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత భత్యాలను ఈ నెలకు ఇవ్వడం లేదని తెలిపింది. వారందరి జీత భత్యాలు చెల్లింపును వాయిదా వేసింది. దీనికి సంబంధించిన జీవోను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో 100 శాతం జీత భత్యాలను వారికి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Coronavirus Alert in AP: ఏపీలో ‘ఢిల్లీ’ కరోనా కల్లోలం, ఒక్కరోజే 21 కేసులు నమోదు, 44కి చేరిన పాజిటివ్ కేసులు, హై అలర్ట్ అయిన ఏపీ సర్కారు

Hazarath Reddy

ఏపీలో కరోనావైరస్ కలకలం (coronavirus pandamic) ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. ఒక్కసారిగా ఏపీలో కేసులు (Covid 19 in AP) పెరిగిపోవడంతో ఏపీ సర్కారు అలర్ట్ (AP Govt) అయింది. ఏపీ పోలీస్ యంత్రాగాన్ని (AP Police) అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ప్రధానంగా కోవిడ్‌ 19 (Covid-19) వ్యాపిస్తోందని వారిని కట్టడి చేసింది. అయితే ఊహించని విధంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి ప్రమాదం ముంచుకు రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించిన పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగారు.

COVID-19 Pay-cut: తెలంగాణ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు, వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వాలు, తొలి అడుగు వేసిన మహారాష్ట్ర సర్కార్

Vikas Manda

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదికల ప్రకారం ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలతో మరియు ఇతర ప్రతినిధుల జీతాలలో ఈ మార్చి నెలకు సంబంధించి 60 శాతం కోత విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన జీతాలలో 25-50 శాతం వేతన కోతను ప్రకటించింది.

Nizamuddin Markaz Congregation: టూరిస్ట్ వీసాతో వచ్చి మతపరమైన ప్రచారం నిర్వహించిన విదేశీయులు, దిల్లీలోని నిజాముద్దీన్ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీయులను బ్లాక్ లిస్టులో చేర్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం

Vikas Manda

100 విదేశీ మత పెద్దలు వీరితో పాటుగా మరో 200 మంది కలిసి దిల్లీలోని సమావేశానికి హాజరయ్యారు. వస్తూ వస్తూ వారితో పాటుగా కరోనావైరస్ ను మోసుకొచ్చారు. అంతేకాకుండా ఆ సమావేశం అనంతరం ఈ విదేశీయులంతా బృందాలుగా విడిపోయి రైలు మార్గం, రోడ్డు మార్గాల ద్వారా వివిధ రాష్ట్రాలకు, అక్కడ్నించి వివిధ నగరాలకు చేరుకొని అక్కడ కూడా మసీదుల్లోకూడా ప్రచారం నిర్వహించారు......

Corona Cases in AP: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 17 కొత్త కేసులు, 40కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, విశాఖలో కరోనాను జయించిన అర‌వై ఏళ్ల వృద్ధుడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) లాక్ డౌన్ పాటిస్తున్నా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 17 పాజిటీవ్ కేసులు (coronavirus cases in AP) నమోదయ్యాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో కొందరికీ వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. గత రాత్రి వరకు 164 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 147 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటీవ్ వచ్చింది.

Advertisement

Banks Mega Merger: బ్యాంకు కస్టమర్ల అలర్ట్ టైం, ఏప్రిల్ 1 నుంచి మిగిలేది 4 ప్రభుత్వరంగ బ్యాంకులే, విలీనం కానున్న ఆరుబ్యాంకులు, కనుమరుగుకానున్న ఆంధ్రా బ్యాంకు

Hazarath Reddy

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve bank of india) ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) గతంలోప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ వీలీనంతో ఏప్రిల్ 1 నుంచి పది ప్రభుత్వ రంగ బ్యాంకులు 4 ప్రభుత్వ రంగ బ్యాంకులుగా (Merger of 10 public sector banks into 4) అవతరించనున్నాయి.

Delhi Nizamuddin Markaz: ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, క్వారంటైన్‌లోకి 2వేల మంది, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు, ఆదేశించిన ఢిల్లీ సర్కారు

Hazarath Reddy

ఢిల్లీలో జరిగిన ఓ మత కార్యక్రమం (Delhi Nizamuddin Markaz) దేశంలో ఇప్పుడు కరోనావైరస్ (coronavirus) కల్లోలానికి కారణమైంది. ఆ ప్రార్థనలు దేశంలో ప్రమాద ఘంటికలు మోగించాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ (Delhi Nizamuddin) ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్‌' మార్చి 1-15 మధ్యలో జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి ఎంతోమంది హాజరయ్యారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందలమంది ఇందులో పాల్గొన్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్‌ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.

Covid Alerting Tracking System:జగన్ సర్కారు మరో ముందడుగు, కరోనాపేషెంట్లపై నిఘా కోసం ట్రాకింగ్ సిస్టం, కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) ఆందోళనకరంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు దాని నియంత్రణకు పలు చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏపీ సర్కారు (AP government) మరో ముందడుగు వేసింది. . హోమ్ క్వారంటైన్‌లో (home quarantine) ఉన్న వారి కదలికలను గుర్తించడానికి కొత్తగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను (Covid Alerting Tracking System) తెరమీదికి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) చేసింది.

COVID-19 Control In AP: ఏపీలో కరోనా కట్టడికి డ్రోన్ల వినియోగం, శానిటైజేషన్ ప్రక్రియకు డ్రోన్లను వాడనున్న విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ బృందం, ఏపీలో 23కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనావైరస్ (Coronavirus in AP) విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నియంత్రణకు సర్కారు ( AP Govt)పలు జాగ్రతలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) ప్రాంతంలో కరోనా నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటోంది. అక్కడ కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శానిటైజేషన్ ప్రక్రియను (sanitisation process) ముమ్మరంగా చేస్తోంది. దీని కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది.

Advertisement

Srivari Darshan: ఏప్రిల్‌ 14 వరకు శ్రీవారి దర్శనం రద్దు, తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లు మూత, నిర్మానుష్యంగా మారిన తిరుమల, ఏకాంత సేవలో తిరుమల వెంకటేశుడు

Hazarath Reddy

కరోనావైరస్ (Corona Virus) మహమ్మారి దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తూ వెళుతోంది. దీని దెబ్బకు అన్నీ ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) కూడా శ్రీవారి దర్శనాలను రద్దు చేసింది. కాగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ (Tirumala Tirupati Devasthanams) పాలక మండలి ఏప్రిల్‌ 14 వరకు ఈ రద్దు నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతోపాటు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లనూ మూసివేశామని తెలిపింది.

Free Ration Distribution in AP: ఏపీలో ఉచితంగా రేషన్ సరుకులు, నెల సరుకులను ముందుగానే పంపిణీ చేస్తున్న ఏపీ సర్కారు, మార్చి 29 నుంచి ఏప్రిల్‌ చివరిలోగా 3సార్లు ఇవ్వాలని నిర్ణయం

Hazarath Reddy

కరోనావైరస్ (Covid 19 outbreak) దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) అమలవుతోంది. దేశంలోని దాదాపు అన్నీ రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ ( coronavirus lockdown) అమలు అవుతున్న నేపథ్యంలో సామాన్యులు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (Andhra Pradesh government) కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకులను అందరికీ ఉచితంగా (Free Ration Distribution in AP) అందిస్తోంది.

COVID-19 Cases in AP: ఏపీలో 19కు చేరిన కరోనా కేసులు, ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలి, ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు

Hazarath Reddy

ఏపీలోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లిగా (COVID-19 Cases in AP) పెరుగుతున్నాయి. నిన్న ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన‌ ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ గా (Coronavirus) తేలింది. వారిద్ద‌రూ కూడా భార్య‌భ‌ర్త‌లు. వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చిక్సిత్స అందిస్తున్నారు.కాగా ఇటీవ‌లే వారు ఢిల్లీ వెళ్లివ‌చ్చారు. అంత‌కుముందు క‌ర్నూలు జిల్లాలో రాజస్థాన్ యువ‌కుడికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఏపీలో (Andhra Pradesh) నిన్న ఒక్క‌రోజే మూడు పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఏపీలో (AP) క‌రోనా బాధితుల సంఖ్య 16కు చేరింది.

AP DGP Damodar Goutam Sawang: మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం, కరోనాని ఏపీ నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలి, మీడియాతో గౌతం సవాంగ్

Hazarath Reddy

కరోనా వైరస్ (COVID-19) ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Goutam Sawang) పిలుపునిచ్చారు. ఏపీలో లాక్ డౌన్‌ను (AP Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.పోలీసులు మీ సేఫ్టీ కోసమే పనిచేస్తున్నారు. ప్రతి పోలీస్‌కూ కుటుంబం ఉంటుందని, కానీ రాత్రింబవళ్లు సెలవులు కూడా లేకుండా వారు ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు.

Advertisement
Advertisement