ఆంధ్ర ప్రదేశ్

AP Lockdown: మార్చి 31 వరకు ఏపీ లాక్‌డౌన్, అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేత, ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి, మీడియాతో ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ (AP Lockdown) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.

Coronavirus In AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విజయవాడలో తొలి కరోనా పాజిటివ్, నగరంలో హై అలర్ట్

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనా వైరస్‌ (Covid 19 In AP) విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.

COVID-19 in AP: ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు, 5కు చేరిన మొత్తం కరోనా కేసులు, ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే

Hazarath Reddy

ఏపీలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 in AP) నమోదయ్యాయి. విజయవాడలో ఒకటి, కాకినాడలో మరొకటి తాజాగా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కొత్తగా నమోదైన రెండు కేసులూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

Janata Curfew in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సర్వం బంద్, సరిహద్దులు మూసివేత, నిర్మానుష్యంగా మారిన రోడ్లు, ప్రధాని పిలుపుతో ఇంటికే పరిమితమైన ప్రజలు

Hazarath Reddy

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూకు (Janata Curfew In Telugu States) రంగం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం స్తంభించిపోయింది. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి.

Advertisement

AP DGP Gautam Sawang: మీరు ఇళ్లలో..మేము స్టేషన్లలో, మీరక్షణ మా బాధ్యత, అందరూ జనతా కర్ప్యూని పాటించి కరోనాని జయిద్దాం, మీడియాతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఆదివారం దేశమంతా జనతా కర్ప్యూ (Janata Curfew) పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీలో (AP) కూడా జనతా కర్ప్యూకి సంఘీభావం ప్రకటించాలని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ (CM YS Jagan) పిలుపునిచ్చారు. మార్చి 22న ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని సీఎం కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

Housing for Poor Scheme: 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, ఉగాది నుంచి అంబేద్కర్ జయంతికి వాయిదా వేసిన ఏపీ సర్కారు, కరోనా నియంత్రణపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని (Housing for Poor Scheme) ప్రభుత్వం వాయిదా వేసింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jagan) ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ (Coronavirus) నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

10th Class Exams: పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు, రేపటి పరీక్ష మాత్రం యధాతథం

Vikas Manda

పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించిన హైకోర్ట్ ప్రస్తుతానికి మార్చి 23- మార్చి 30 వరకు ఉన్న పది పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.....

Coronavirus Outbreak in India: తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 3 కలిపి దేశవ్యాప్తంగా 206కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మహారాష్ట్రలో విజృంభిస్తున్న వైరస్

Vikas Manda

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు గురువారం నాటికి 2 లక్షలు దాటాయి, ఇక వీరిలో 85 వేల మంది కోలుకున్నట్లు సమాచారం. అయితే వైరస్ బారినపడి ఇప్పటికి 9,800 మంది ప్రాణాలు కోల్పోయారు.....

Advertisement

AP Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ ప్రాణాలకు ముప్పుందా? రాష్ట్రపతి పాలన విధించాలంటున్న తెలుగు దేశం నాయకులు, ఈసీ లేఖ పట్ల ప్రభుత్వం సీరియస్

Vikas Manda

వ్యవస్థలు నిర్వీర్యం చేసే నేతలు, మనమేం చెప్పినా చెల్లుతుందనే భావనలో ఉండే నాయకులు ఇప్పటికీ కళ్లు తెరిచి తమ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రం ఎప్పటికీ పురోగతి సాధించదు. ఏపీలో మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో....

Coronavirus Outbreak in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు, నివారణ కోసం మరిన్ని చర్యలు చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం

Vikas Manda

దిల్లీ మరియు ఏపీలో ప్రత్యేక కంట్రోల్ రూంలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎలాంటి సహాకారం కోసం అయినా దిల్లీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 9871999055/9871999059 మరియు ఏపీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 8971170178/8297259070 లను సంప్రదించాలని సూచించింది.

Telangana: తెలంగాణలో కలకలం, కరీంనగర్‌లో ఒక్కరోజులోనే 7 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తింపు, రాష్ట్రంలో 13కు పెరిగిన కేసుల సంఖ్య, వంద బృందాలతో స్పెషల్ డ్రైవ్

Vikas Manda

ఈ ఇండోనేషియన్ దేశస్థులు మాత్రం మొత్తం 10 మంది బృందంగా ముందు దిల్లీ చేరుకొని, అక్కడ్నించి మార్చి 13న 'ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్' (రైలు నంబర్ 12708) ద్వారా మార్చి 14 తెల్లవారుజామున రామగుండం స్టేషన్ లో దిగారు. వీరు ప్రయాణించిన ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ కోచ్‌లో మొత్తం 82 మంది ప్రయాణికులు ఉన్నారు......

APPSC Revises Exam Schedules: ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు, ఏప్రిల్ నుంచి మే నెలకు వాయిదా, సవరించిన పరీక్షల తేదీల వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కొన్ని పోస్టుల నియామకాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష తేదీలను (APPSC Revises Exam Schedules) సవరించింది. కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ అంజనేయులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్చి 21 , 22వ తేదీ జరగాల్సిన డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టుకు నియామకం కోసం జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 3 మరియు 4 తేదీకి సవరించారు. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.

Advertisement

Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేత, పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయి, కరోనా నియంత్రకు గట్టి చర్యలు తీసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (CoronaVirus) పంజా విసురుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో (Andhra Pradesh) రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లకు ఏపీ ప్రభుత్వం సెలవు (Schools and Colleges Closed in AP) ప్రకటించింది.దేశ వ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తాజగా ఏపీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

AP Local Body Elections: ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి, ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిదే, స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై (Local Body Elections PostPoned) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP Election Commission) జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

CoronaVirus Health Bulletin: 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే 104కి కాల్ చేయండి, భయపడాల్సిన అవసరం లేదు: రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి

Hazarath Reddy

కోవిడ్‌-19 వైరస్‌ (COVID-19) నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి (Dr. KS Jawahar Reddy) అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడూతూ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని (CoronaVirus) అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.

COVID 19 in Telangana: తెలంగాణలో 5కు పెరిగిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, మహారాష్ట్రలో 42 కేసులు నమోదు, అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద తెలంగాణ సర్కార్ నజర్

Vikas Manda

ఉంటే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభిస్తుంది. బుధవారం నాటికి ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. మంగళవారం 63 ఏళ్ల వ్యక్తి కూడా కరోనావైరస్ బారినపడి ముంబై ఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది....

Advertisement

AB Venkateswara Rao: మాజీ చీఫ్‌కు క్యాట్‌లో చుక్కెదురు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌, ప్రవర్తనా నియమాల ఉల్లఘన కింద సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు

Hazarath Reddy

మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు (AB Venkateswara Rao) కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో (CAT) భారీ షాక్ తగిలింది. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) (Central Administrative Tribunal (CAT) మంగళవారం కొట్టేసింది.

Cement prices Drop in AP: శుభవార్త..ఏపీలో తగ్గిన సిమెంట్ ధరలు, పీపీసీ బస్తా ధర రూ.225, ఓపీసీ సిమెంటు బస్తా ధర రూ.235, ప్రకటించిన సిమెంట్ కంపెనీల యాజమాన్యం

Hazarath Reddy

ఏపీ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. ప్రభుత్వ పనులు, పేదలకు ఇళ్ల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులకు సిమెంటు ధరలను తగ్గిస్తున్నట్లు (Reduction In Cement Prices) సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సోమవారమిక్కడ ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు.

COVID-19 in India: దేశవ్యాప్తంగా 125కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, అత్యధికంగా 39 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర టాప్, తెలంగాణలో 4 కేసులు నమోదు, మహారాష్ట్ర నుంచి వచ్చే వారిపై నిఘా

Vikas Manda

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై కూడా తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టింది. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది......

AP Local Body Elections: ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు, నెలాఖరు లోపు ఎన్నికలు పూర్తి కాకుంటే నిధులు రావన్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ ఎన్నికల కమిషన్ (Andhra Pradesh State Election Commission) తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ( AP Local Body Elections Postponed) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం గడప తొక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (SEC) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Advertisement
Advertisement