ఆంధ్ర ప్రదేశ్
Janasena Long March Highlights: అధికార పార్టీపై విమర్శలతో ముగిసిన జనసేన లాంగ్ మార్చ్, జగన్ బాగా పరిపాలిస్తే సినిమాలు చేసుకుంటానన్న పవన్, మార్చ్‌లో టీడీపీ నేతలు, విమర్శల దాడి చేసిన వైసీపీ
Hazarath Reddyఇసుక కొరత నిరసిస్తూ విశాఖలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ను నిర్వహించారు. విశాఖలోని మద్దిలపాలెం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ జరిగింది. వేలాదిమంది జనసేన, టీడీపీ కార్యకర్తలు ఈ మార్చ్ లో పాల్గొన్నారు.
Car Accident In krishna : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి, మరికొందరికీ గాయాలు, అతివేగమే ప్రమాదానికి కారణం, హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న సమయంలో ప్రమాదం
Hazarath Reddyకృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం, గరికపాడు దగ్గర ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద రెండు కార్లు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు.
Janasena Chalo Vishakhapatnam: ఇసుక కొరతకు నిరసనగా జనసేన లాంగ్ మార్చ్,సేనకు బై చెప్పిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మద్దతు తెలిపిన టీడీపీ, హ్యాండిచ్చిన సీపీఐ, సీపీఎం, బీజేపీ, కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాధ్
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ (Janasena Long March) కు సర్వం సిద్ధం అయింది. ఉక్కునగరం విశాఖ వేదిక( Visakhapatnam) గా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కారానికి జనసేనాని ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టారు.
MAHA and KYARR Alert: ఒకేసారి రెండు తుఫానులు, క్యార్ గాయం మానక ముందే దూసుకొస్తున్న మహా తుఫాన్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు, అల్లకల్లోలంగా మారిన అరేబియా సముద్రం
Hazarath Reddyదాదాపు 120 యేళ్ల చరిత్రలో అరేబియా సముద్రంలో మొదటిసారిగా రెండు తుపానులు ఒకే సమయంలో కేంద్రీకృతమై ఉన్నాయి. క్యార్ భీకర రూపం దాల్చిన సమయంలో ‘మహా’ అనే రెండవ తుఫాను కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉత్తర దిశగా పయనిస్తోందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది.
Karakatta Illegal Issues: కరకట్ట అక్రమ నిర్మాణదారులకు మరోసారి నోటీసులు, విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు, విచారణ ఆరువారాలకు వాయిదా
Hazarath Reddyకష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని ఆ నిర్మాణాల యజమానులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది.
Polavaram Project Mission @2021: పోలవరం పనులు తిరిగి ప్రారంభం, భూమి పూజ చేసిన మేఘా సంస్థ ప్రతినిధులు, 2021 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న ఏపీ సీఎం జగన్, తగ్గిన గోదావరి నీటి మట్టం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. శుక్రవారం స్పిల్ వే వెనుక భాగంలో సంస్థ ప్రతినిధులు భూమి పూజ చేశారు. గోదావరి నీటిలో పసుపు, కుంకుమ చల్లి పూజలు జరిపారు.
AP Incarnation Day Ceremony: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు, రాష్ట్ర విభజన తరువాత తొలిసారి, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలం, ఆయనకు ఘనంగా నివాళి అర్పించిన పలువురు నేతలు
Hazarath Reddyరాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతున్నారు. కాగా విభజన తర్వాత నవ్యాంధ్ర అవతరణ దినోత్సవాన్ని తొలిసారి అధికారింగా నిర్వహిస్తున్నారు. నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
National Health Profile 2019: హెచ్ఐవి కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర, మిగతా నాలుగు స్థానాలను పంచుకున్న సౌత్ ఇండియా, జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక-2019 వెల్లడి
Hazarath Reddyదేశ వ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతోన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగుల్లో ఆంధ్రప్రదేశ్‌ సెకండ్ ప్లేస్ లో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచాయి.
YS Jagan VS CBI Verdict: జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న సీబీఐ కోర్టు, హైకోర్టులో అప్పీల్ చేయనున్న జగన్, తీర్పును స్వాగతించిన టీడీపీ
Hazarath Reddyఅక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురయ్యింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Cyclonic Storm Kyarr: తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం, నేడు,రేపు పలుచోట్ల భారీ వర్షాలు, కుమ్మేస్తున్న క్యార్ సైక్లోన్, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyఅరేబియా సముద్రంలో ‘మహా’ తీవ్ర తుఫాను కొనసాగుతోంది. ఇది అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
AP Formation Day Celebrations: ఐదేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు, మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు, అన్ని ఏర్పాట్లు పూర్తి, శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్
Hazarath ReddyAndhra Pradesh Government, Andhra Pradesh Formation Day, YS Jagan Mohan Reddy,Formation Day celebrations,Amaravati,Indira Gandhi Municipal Stadium,Vijayawada,Chief Minister YS Jagan Mohan Reddy,Governor Biswabhusan Harichandan
Telugu Popularity in US: అమెరికాలో తెలుగు వారి హవా! యూఎస్ వెళ్లిన భారతీయుల్లో ఎక్కువ శాతం తెలుగు మాట్లాడేవారే, 79.5 శాతం పెరిగిన తెలుగు మాట్లాడేవారి సంఖ్య
Vikas Mandaయూఎస్ లో గుజరాతీ భాష మాట్లాడేవారి సంఖ్య 4.19 లక్షలు, తెలుగు మాట్లాడే వారి సంఖ్య 4 లక్షలు, బెంగాలీ మాట్లాడేవారి సంఖ్య 3.75 లక్షలు, తమిళం మాట్లాడేవారి సంఖ్య 3.09 లక్షలుగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం...
AP Cabinet Meet Highlights: భారీగా సంక్షేమ పథకాలు, పలు కేటాయింపులు, పలు రద్దులు, సంచలన నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవే
Vikas Mandaజగ్గయ్యపేటలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన 498.3 ఎకరాల భూకేటాయింపును రద్దు చేసింది. అలాగే విశాఖలో గ్రూపన్ కు కేటాయించిన 13.6 ఎకరాల భూకేటాయింపును రద్దు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది...
Cyclone Kyarr: బలహీనపడుతున్న క్యార్ తుఫాను, మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్ నగరాన్ని మంచెత్తిన భారీ వర్షం
Vikas Mandaహైదరాబాదు నగరంలో పలుచోట్ల మంగళవారం భారీ వర్షం కురిసింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది....
Gannavaram Politics: 'వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ ఆయన ఎక్కడికి వెళ్లరు, కాదు వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయం'. గన్నవరం చుట్టూ తిరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు
Vikas Mandaవంశీ రాకను వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఆయన తమ అధినేత జగన్ ను కలిసేందుకు వెళ్లినా, ఆయనకు జగన్ అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన యార్లగడ్డ, ఒకవేళ వంశీకి వైసీపీ....
Mla Vamsi Resign Reactions: వంశీ రాజీనామా లేఖతో వేడెక్కిన ఏపీ రాజకీయం, అండగా ఉంటామంటున్న టీడీపీ నేతలు, మరొకరు మాతో టచ్‌లో ఉన్నారంటున్న బిజెపి నేత, ఎంత దూరమైనా వెళ్తా అంటున్న చింతమనేని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. వంశీ అధికార పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తోందని అందుకే టీడీపీ పార్టీని వీడుతున్నానని లేఖ రాయడంతో రాజకీయాల్లో కలకలం మొదలైంది.
Cyclone Kyarr In South India: సౌత్ ఇండియాకు క్యార్ తుఫాన్ ముప్పు, రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు, సూపర్‌ సైక్లోనిక్‌ తుఫాను మారుతున్న క్యార్, జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
Hazarath Reddyఅరేబియన్‌ సముద్రంలో ఏర్పడిన 'క్యార్‌' తుఫాను ప్రభావంతో సౌత్ ఇండియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Vallabhaneni VS Yarlagadda: గన్నవరంలో మారిన రాజకీయ సమీకరణలు, వల్లభనేని రాజీనామాతో అక్కడ ఏంజరగబోతోంది, వంశీ వైసీపీలో చేరితే యార్లగడ్డ భవిష్యత్ కార్యాచరణ ఏంటీ ?
Hazarath Reddyగన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్నవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి.
Varma KRKR Target: కాంట్రవర్సీ కింగ్ వర్మ మరో సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, ఏపీ రాజకీయాల్లోని ప్రముఖ నేతలందరిపై గురి, ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడంటున్న ట్రైలర్
Hazarath Reddyకాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను మరోసారి తెరమీదకు తీసుకువస్తున్నారు. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో తీస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను వర్మ దీపావళి బాణసంచాకు జతగా ఈ రోజు విడుదల చేశారు.
Cyclone Kyarr Alert: హడలెత్తిస్తున్న క్యార్ సైక్లోన్, సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం, 17 మంది జాలర్లను రక్షించిన ఇండియన్ నేవీ, కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyక్యార్ తుపాన్ గత రెండు రోజుల నుంచి నార్త్ ఇండియాను హడలెత్తిస్తోంది. ఈ తుఫాన్‌ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సైక్లోన్ ధాటికి కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు పడుతాయని వెల్లడిస్తున్నారు.