Mood Of The Nation Survey: దేశంలో 4 వ బెస్ట్ సీఎంగా ఏపీ సీఎం వైయస్ జగన్, మొదటి వరసలో యోగి ఆదిత్యానాథ్, పాపులర్ నాయకుల్లో ప్రధాని మోడీదే అగ్రస్థానం, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్ సర్వేలో వెల్లడి
ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ (Mood Of The Nation 2019) పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 వ స్థానం దక్కింది.
New Delhi, January 25: దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో (best performing chief ministers) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) టాప్ టెన్ లిస్టులో చోటు సంపాదించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ (Mood Of The Nation 2019) పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 వ స్థానం దక్కింది.
పేదలకు భరోసానిచ్చే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా
13% తో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) (బీజేపీ), 11% తో రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ), (Arvind Kejriwal) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) (Mamata Banerjee) ఉండగా.. 10% తో మూడో స్థానంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, (Nitish Kumar) 7% తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్) (Y. S. Jaganmohan Reddy) నాలుగో స్థానంలో నిలిచారు.
Here's The Mood of the Nation today Team
6% తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్ ) (Uddhav Thackeray) , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ( బిజూ జనతా దళ్ ) (Naveen Patnaik) ఐదో స్థానంలో నిలిచారు. 4% తో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (బీజేపీ) (Vijay Rupani) 6 స్థానంలో నిలిచారు. 3% తో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్) (Ashok Gehlot) , హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ( బీజేపీ ) (Manohar Lal Khattar) లు 7 స్థానం సాధించారు.
నాడు వైఎస్సార్..నేడు వైఎస్ జగన్
పరిపాలనా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ఈ సర్వే చేపట్టారు. కాగా ఈ 'బెస్ట్ పెర్‌ఫార్మింగ్ సీఎం' (Best Performing Chief Ministers) సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్ కూడా పొందుపరిచారు.
రైతుల ఖాతాల్లోకి పీఎం సమ్మాన్ యోజన నిధులు
యోగి ఆదిత్యనాథ్ దాస్‌కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్, నవీన్ పట్నాయక్‌లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్‌ఫార్మెన్స్‌ను చూపించారు. కాగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే బెస్ట్ పెర్ఫామింగ్ సీఎంల జాబితాలో జగన్ చేరడం విశేషం.
ప్రతి ఇంటి గడపకు పాలనే లక్ష్యంగా వైఎస్‌ఆర్ నవశకం
ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ఆరు నెలల్లోనే నెరవేర్చేలా అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా
అమ్మఒడి, నాడు–నేడు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్), జగనన్న వసతి దీవెన (హాస్టల్ ఖర్చులకు ఏటా రూ.20 వేలు), ఆరోగ్యశ్రీ, తదితర అనేక పథకాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు ఏపీ సీఎం అమలు చేస్తున్నారు.
అమ్మఒడికి మొత్తం రూ.6400 కోట్లు కేటాయింపు
ఇక ఆ సంస్థ చేపట్టిన పాపులర్ లీడర్లలో ప్రధాని మోడీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 53 శాతంతో ప్రధాని అగ్రభాగాన నిలిచారు. తరువాత ప్లేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలిచారు. ప్రధాని మోడీ తీసుకువచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలు ప్రధానిని మెచ్చుకునేలా చేశాయని సర్వే తెలిపింది.
ఇవి కూడా చదవండి
రూ. 560 కోట్లతో వైయస్సార్ 'కంటి వెలుగు' స్కీమ్
రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం
ఎంఎస్‌ఎంఈలకు రక్ష వైయస్సార్ నవోదయం
చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు
వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ ప్రారంభం, ఆర్థిక భద్రత కోసం ఏటా రూ.10 వేలు