తెలంగాణ

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు, ఓయూ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడిన సీతక్క

Arun Charagonda

ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్కను సన్మానించింది ఓయూ సిబ్బంది.

Heavy Rain Alert To Telugu States: రెయిన్ అలర్ట్..నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు బారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరిక

Arun Charagonda

ఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వెల్లడించింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌ పై కూడా ఉంటుందని తెలిపింది.

Charminar: చార్మినార్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌, అత్యంత ప్రమాదకరంగా పైఅంతస్తులో సర్కస్ ఫీట్లు...వీడియో వైరల్

Arun Charagonda

చార్మినార్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌ చేశాడు. అత్యంత ప్రమాదకరంగా పైఅంతస్తులో సర్కస్ ఫీట్లు వేయగా సోష‌ల్‌మీడియాలో వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Telangana Shocker: ఆన్‌లైన్ బెట్టింగ్..రైతు కుటుంబం ఆత్మహత్య, కొడుకు రూ.20 లక్షలు పొగొట్టుకోవడంతో అప్పుల బాధ తాళలేక ముగ్గురు ఆత్మహత్య

Arun Charagonda

నిజామాబాద్ - బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి దాదాపు రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు కొడుకు హరీష్. అప్పుల పాలు కావడంతో పొలాన్ని అమ్మేసిన కుటుంబం. దీంతో ఆర్ధిక ఇబ్బందులు రావడంతో తండ్రి సురేష్, తల్లి హేమలతతో పాటు.. కొడుకు హరీష్ కూడా ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

Dussehra Rush: జనంతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లు (వీడియో)

Rudra

దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుండి ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

Rain in Hyderabad: హైదరాబాద్‌ ను ముంచెత్తిన భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులూ వానలే

Rudra

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.

Mallareddy Mass Dance: మాస్ స్టెప్పులతో హుషారెత్తించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. బతుకమ్మ పాటకు విద్యార్థినులతో నృత్యం (వీడియో)

Rudra

‘పాలమ్మిన, పూలమ్మిన..’ అనే డైలాగ్ తో తెలుగురాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసిన వైరల్ అవ్వాల్సిందే.

Charminar Viral Video: చార్మినార్‌ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌ చ‌ల్‌.. ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు (వీడియో)

Rudra

హైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పై ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. నిషేధించబడిన పైఅంతస్తులోకి చేరి అత్యంత ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు చేశాడు.

Advertisement

Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి

Rudra

విలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు.

Hyderabad: గ‌ణేష్ మండ‌పాల్లో మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వారికి జైలు శిక్ష‌, ఏకంగా 200 మందిని జైల్లో వేసిన షీ టీమ్స్

VNS

బాధితులు ధైర్యంగా షీ టీమ్స్‌కు(She teams) ఫిర్యాదు చేయాలని సిటీ మహళా భద్రత డీసీపీ దార కవిత సూచించారు. ఇటీవల గణేష్‌ నిమజ్జనం(Ganesh festival) సందర్భంగా ఖైరతాబాద్‌లోని బడా గణేష్‌, ఇతర రద్దీగా ఉండే గణేష్‌ మండపాలు, నిమజ్జనం సమయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 996 మందిని షీ టీమ్స్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

Dantewada Encounter: చ‌త్తీస్ గ‌ఢ్ లో భారీ ఎన్ కౌంట‌ర్, భ‌ద్ర‌తా బ‌ల‌గాల స్పెష‌ల్ ఆపరేష‌న్, 30 మంది న‌క్స‌ల్స్ మృతి

VNS

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్‌ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. బస్తర్‌ రేంజ్‌లోనిదంతెవాడ, నారాయణ్‌పూర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది.

Thatikonda Rajaiah: తాటికొండ రాజయ్య దోతిపైకి తొండ, భయంతో పక్కకు జరిగిన బీఆర్ఎస్ నేతలు...వీడియో ఇదిగో

Arun Charagonda

తొర్రూరులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజి పైకి ఒక్కసారిగా ఓ తొండ వచ్చింది. అయితే భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరగగా....ఆ తొండకు భయపడతరా ? అంటూ తాటికొండ రాజయ్య నవ్వారు.

Advertisement

IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

Harishrao On Runa Mafi: హైడ్రా పేరుతో అరాచకం, రైతులు డిక్లరేషన్ ఏమైంది?, తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందన్న మాజీ మంత్రి హరీశ్ రావు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నా కర్యక్రమంలో మాట్లాడిన హరీశ్‌..రేవంత్ తీరును ఎండగట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తుందని...హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసిని ఆనుకొని ఉన్న పేదల ఇళ్ళ్ళు కూల గొడితే ఊరుకోం అని తేల్చిచెప్పారు. ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు అని ప్రశ్నించారు.

KVP Ramachandra Rao On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ, పార్టీకి చెడ్డ పేరు రావొద్దు...అక్రమమైతే నేనే కూలుస్తానని కామెంట్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించాలని ...ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించాలన్నారు. అక్రమమైతే నా సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని లేఖలో పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలని... కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు..అలా వస్తే నా రక్తం సహించదు అని తెలిపారు కేవీపీ.

Nimishamba Devi Temple: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపచారం, అమ్మవారికి చీర కట్టకుండా ప్రాక్ వేసిన పూజారులు, ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు..వీడియో ఇదిగో

Arun Charagonda

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబికా దేవాలయంలో అమ్మవారి విగ్రహానికి ప్రాక్ వేసారని పూజారులపై మండిపడుతున్నారు మహిళలు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి ఆకారంలో చీర కట్టించకుండా ప్రాక్ ఎలా వేస్తారంటు నిలదీశారు. ఇక ప్రశ్నించిన మహిళలపై పూజారి దురుసుగా సమాధానం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Jangaon: మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితులపై పోక్సో కేసు నమోదు

Arun Charagonda

తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై.. ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక(14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల్లిదండ్రులున్నా.. వేర్వేరు కారణాలతో వారిని పునరావాస కేంద్రంలో చేర్పించారు.

Nagaruna Petition On Konda Surekha: మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా, సోమవారం మరోసారి విచారించనున్న న్యాయస్థానం

Arun Charagonda

మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా వేసింది న్యాయస్థానం. సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి మనోరంజన్ కోర్టు. న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో వాయిదా వేయగా సోమవారం రోజు పిటిషన్ పై విచారించనుంది మనోరంజన్ కోర్టు.

Viral Video: ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. తీవ్రంగా గాయాలు.. నిజామాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

చిన్నారులపై వీధి కుక్కల దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారి హరినేత్రపై తాజాగా ఓ వీధి కుక్క దాడికి పాల్పడింది.

Andhra Pradesh Shocker: కడపలో దారుణం, ఎనిమిదేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం , పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కడపలోని చిన్నచౌక్ పొలిస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోగా భర్త చనిపోవడంతో ఓ యువకుడిని(27) మళ్లీ పెళ్లి చేసుకుంది మహిళ.

Advertisement
Advertisement