తెలంగాణ
Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రెండు రాష్ట్రాల్లో భానుడు భగభగల నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో రాగల ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజులు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
Jr NTR Approached High Court: భూవివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. కిలాడీ చేతిలో మోసపోయిన టాలీవుడ్ స్టార్.. హైకోర్టును ఆశ్రయించిన వైనం
Rudraటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు మెట్లేక్కారు. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో ఈ మేరకు అయన హైకోర్టును ఆశ్రయించారు.
TS to TG: ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్‌ స్థానంలో టీజీ.. తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్‌ మార్పు.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం.. మరి వాడుకలో ఉన్న వాహనాలకు ఏ గుర్తు ఉండాలి? టీఎస్ కొనసాగించవచ్చా??
Rudraతెలంగాణలోని వాహనాల నంబర్ ప్లేట్లపై ఇకపై టీఎస్‌ స్థానంలో టీజీ కనిపించనున్నది. ఈ మేరకు వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్‌ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Hyderabad Rains: మరో 5 రోజులు తెలంగాణకు ఎల్లో అలర్ట్, దంచి కొట్టిన వానలకు హైదరాబాద్ నగరం విలవిల, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం రాజధాని హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, ఇంట్లోకి కుక్క వచ్చిందని దాని యజమానిపై, భార్యపై కర్రలతో దాడి, వీడియో ఇదిగో..
Hazarath Reddyరహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేసి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BRS Protest: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై రాష్ట్రవ్యాప్తంగా అన్న‌దాతల ఆందోళ‌న‌లు, పిలుపునిచ్చిన మాజీ సీఎం కేసీఆర్
VNSరైతువ్యతిరేక విధానాలను ఈ ఖండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఇటువంటి తీరును ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని విమర్శించారు.
Telangana: సినీ అభిమానులకు షాక్, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లు మూసివేత, కారణం ఏంటంటే..
Vikas Mతెలంగాణాలోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ యాజమాన్యాలు ఆదరణ లేకపోవడంతో నష్టాల దృష్ట్యా సినిమా ప్రదర్శనలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య దాదాపు 450.
Doctors Remove Mutton Bone From Throat: గొంతులో ఇరుకున్న మటన్ బొక్కను విజయవంతంగా తొలగించిన వైద్యులు
Hazarath Reddyఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులు 66 ఏళ్ల రోగి గుండె దగ్గర అన్నవాహికలో ఉన్న మటన్ ఎముకను విజయవంతంగా తొలగించారు. ఎముక ఒక నెల పాటు అల్సర్‌లతో సహా తీవ్రమైన సమస్యలను కలిగించింది.కక్కిరెన్ గ్రామానికి చెందిన రోగి శ్రీరాములు ఆహారాన్ని సరిగ్గా నమలలేకపోవడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొన్నాడు,
Telangana: గేదెలను దొంగతనం చేస్తున్న మహిళను పట్టుకొని స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు,బర్లను తీసుకొచ్చి కోసి అమ్ముతున్నట్లు తెలిపిన మహిళ
Hazarath Reddyవరంగల్ జిల్లా సర్వపురం గ్రామంలో వేముని స్వామి అనే వ్యక్తి తన ఇంటి ముందు కట్టేసిన నాలుగు బర్లను నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి దొంగిలించి వాటిని తరలిస్తుండగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంబడించారు. ముగ్గురు తప్పించుకుపోగా మేరీ అనే మహిళను పట్టుకొని స్తంభంకి కట్టేశారు
White Tiger Died: నెహ్రూ జూ పార్క్ లో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ మృతి, అరుదైన వ్యాధితో క‌న్నుమూసిన తెల్ల‌పులి
VNSహైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్ (White Tiger) మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి (Tiger) గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. 2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు.. పులి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది.
100 % Voting in TS Villages: ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పిన తెలంగాణ ప‌ల్లెలు.. జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో, మెదక్‌ జిల్లా సంగాయిపేట తండాలో వంద‌ శాతం పోలింగ్‌
Rudraతెలంగాణ‌లోని రెండు గ్రామాలు ప్ర‌జాస్వామ్య స్పూర్తిని చాటి చెప్పాయి. లోక్‌ సభ నాలుగో ద‌శ‌ ఎన్నికల్లో భాగంగా సోమ‌వారం రాష్ట్రంలో పోలింగ్ జ‌రిగింది.
Andhra Pradesh Elections 2024: ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల
Rudraఆంధ్రప్రదేశ్‌ లో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏపీవాసులు ఆసక్తి కనబర్చారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది.
Telangana Elections 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 61.59శాతం ఓటింగ్ నమోదు, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపిన సీఈఓ వికాస్ రాజ్
Hazarath Reddyతెలంగాణలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్‌ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్‌ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తున్నారు.
Lok Sabha Elections 2024: మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం ఇదిగో, ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదు
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరుగుతోంది.మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్న అధికారులు
Hazarath Reddyఏపీలో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్‌, బెల్లంప‌ల్లి, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, అశ్వ‌రావుపేట‌, ములుగులో క‌డా 4 గంట‌ల‌కే పోలింగ్ పూర్త‌యింది.
Telangana Elections 2024: మాధవీలతపై కేసు నమోదు, హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను చెక్ చేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేశారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో ఆమె అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
Blue Shirt Mania: బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ టాలీవుడ్ హారోలు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబు బ్లూ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోలు బ్లూ షర్ట్స్ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో ఎన్టీఆర్‌, మహేష్ బాబు పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
Telangana Elections 2024: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు, ఓటు వేయమని ఇంటింటికి వెళ్ళి చెబుతున్న స్థానికులు, వీడియోఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదవడంతో, ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయడానికి నివాసితులు గేట్లు, తలుపులు తట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Telangana Elections 2024: తీవ్ర విషాదం, పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఇద్దరు మృతి, ఓటు వేసి వెళ్తుండగా కుప్పకూలిన ఓటరు
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల వేళ తీవ్ర విషాదకర ఘటన చోట చేసుకుంది. ఇద్దరు గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో కాశి వెంకటేశ్వరరావు(54) అనే ఓటర్ ఓటు‌ వేసి వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు
Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, మొబైల్ టిఫిన్ సెంటర్‌ను డీకొట్టిన ఆర్టీసీ గరుడ బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyజనగామ - రఘునాథపల్లిలో హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్‌ను అతివేగంతో వచ్చి డీకొట్టిన ఆర్టీసీ గరుడ బస్సు. టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.