తెలంగాణ

Uppal Stadium Staff Protest: రాజ‌స్థాన్ వ‌ర్సెస్ హైద‌రాబాద్ మ్యాచ్ జ‌ర‌గ‌డం డౌటే? మెరుపు ధ‌ర్నాకు దిగిన ఉప్ప‌ల్ స్టేడియం సిబ్బంది, వేత‌నాల‌తో పాటూ కాంప్లిమెంట‌రీ పాస్ లు ఇవ్వ‌డం లేద‌ని ఆందోళ‌న‌

VNS

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో (Uppal Stadium staff) సిబ్బంది మెరుపు ధ‌ర్నాకు దిగారు. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

Polling Time In Telangana: తెలంగాణలో పోలింగ్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఎన్నిక‌ల సంఘం, అన్ని పార్టీల విజ్ఞ‌ప్తి మేర‌కు పోలింగ్ స‌మ‌యం పెంపు

VNS

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని (Polling Time) పొడిగించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

KCR Reacts on EC Ban: ఎన్నిక‌ల సంఘం నిషేదంపై స్పందించిన కేసీఆర్, మ‌హ‌బూబాబాద్ రోడ్ షోలో కీల‌క వ్యాఖ్య‌లు (వీడియో ఇదుగోండి)

VNS

నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే.. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. కానీ, నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెబుతున్నా.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, బీఆర్ఎస్ బిడ్డలంతా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని నేను మనవి చేస్తున్నా” అని కేసీఆర్ అన్నారు.

KCR Barred by EC: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నిక‌ల సంఘం బిగ్ షాక్, 48 గంట‌ల పాటూ ప్ర‌చారం చేయొద్దంటూ నిషేదం, ఇంత‌కీ ఎందుకు బ్యాన్ విధించారంటే?

VNS

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు (KCR) కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం (Ban on KCR Campaign) విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.

Advertisement

Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు, మోదీ ఇచ్చింది ఇవేనంటూ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఒక్క ఓటు వేసినా అది వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు.

PM Modi Election Campaign in Telangana: ఫేక్ వీడియోల వెనుక రేవంత్ రెడ్డి, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ,ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం

Hazarath Reddy

మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ (PM Modi Election Campaign in Telangana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ముదిరాజ్, లింగాయత్‌లకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

Telangana Horror: దారుణం, మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రిపై దాడి చేసిన కానిస్టేబుల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

TS SSC Supplementary Exams: జూన్ 3 నుంచి ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు.. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ మే 16..

Rudra

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణ‌త సాధించారు. గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

Advertisement

TS SSC Results OUT: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయోచ్.. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్‌ సైట్లను చూడండి!

Rudra

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేశారు.

TS SSC Results Today: తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడే.. ఉదయం 11 గంటలకు విడుదల.. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్‌ సైట్లను చూడండి!

Rudra

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేస్తారు.

2024 భారతదేశం ఎన్నికలు: నేడు తెలంగాణ‌కు ప్ర‌ధాని మోదీ.. జ‌హీరాబాద్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల‌ ప్ర‌చారం.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

Rudra

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో మొన్నటికి మొన్న హోంమంత్రి అమిత్ షా పర్యటించగా.. నేడు ప్రధాని న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు , అలాగే 25 ఎంపి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Amit Shah Doctored Video Case: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసు, సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసిన హోంశాఖ, మే 1న ఢిల్లీకి విచారణకు రావాలని ఆదేశాలు

Hazarath Reddy

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలన్నారు.

Telangana Weather Update: హైదరాబాద్ వాసులకు చల్లటి కబురు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం, తెలంగాణలో 14 జిల్లాల్లో వర్షాలు

Hazarath Reddy

మండే ఎండలతో అల్లాడిపోతున్న నగర వాసులకు ఐఎండీ చల్లని కబురును అందించింది. తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ తెలిపింది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు పడతాయని అంచనా వేసింది.

TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల, Results.bsetelangana.org ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

Heat Wave In Telangana, AP: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్‌ అలర్ట్..

sajaya

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్‌ అలర్ట్.. ఏపీలో 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాలులు వీస్తాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన.

Advertisement

Leopard Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో చిరుత క‌ల‌క‌లం.. విమానాశ్ర‌యం ప్రహరీ దూకి లోప‌లికి వ‌చ్చిన‌ట్లు గుర్తించిన‌ అధికారులు.. పట్టుకునేందుకు రెండు బోన్ల ఏర్పాటు

Rudra

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో చిరుత సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. విమానాశ్రయం ప్రహరీ గోడ దూకి చిరుత లోపలి భాగంలోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Jewellery Theft: నగలు కొనడానికి వచ్చినట్టు నటించి మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలను చోరీ చేసిన మహిళలు.. మెదక్ లో ఘటన (వీడియో)

Rudra

మెదక్ జిల్లా కౌడిపల్లిలోని ఓ బంగారం షాపులో చోరీ జరిగింది. గిరాకీ చేసేందుకు వచ్చినట్టు వచ్చిన మహిళలు మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలు చోరీ చేసి ఉడాయించారు.

KTR Comments on Union Territory: హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు భారీ కుట్ర‌, సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్

VNS

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా (Hyderabad Union Territory) మార్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. జూన్ 2 తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తారనే అనుమానం ఉందన్నారు.

Mohan Bhagwat On Reservations Row: రిజ‌ర్వేష‌న్ల వివాదంపై తొలిసారి స్పందించిన‌ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ , హైద‌రాబాద్ వేదిక‌గా ఆయ‌న ఏమ‌న్నారంటే?

VNS

రిజర్వేషన్స్ వివాదం (Reservations Row) దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. రిజర్వేషన్స్ తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

Advertisement
Advertisement