తెలంగాణ
Telangana: ఇందిరా పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ధర్నా, పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కి నిరసనగా ఆందోళనకు పిలుపు
Hazarath Reddyపార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కి నిరసనగా ఇవాళ హైదరాబాద్‌ ఇందిరా పార్క్ దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నాలో పాల్గొంటారు.
Gokul Chat Owner Dies: గోకుల్ చాట్ యజమాని ముకుంద్ దాస్ మృతి, 2007 బాంబుదాడులతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన గోకుల్ చాట్
Hazarath Reddyహైదరాబాద్‌లో ప్రముఖ చాట్‘గోకుల్ చాట్’ యజమాని ముకుంద్ దాస్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Coronavirus in Telangana: నిలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల చిన్నారికి కరోనా, తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు, 16 కేసులు హైదరాబాద్‌లోనే..
Hazarath Reddyతెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
Coronavirus in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం, ఏపీలో రెండు, తెలంగాణలో ఆరు కేసులు నమోదు, హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కోవిడ్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది.
Hyderabad Fire: వీడియో ఇదిగో, పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం, 4వ అంతస్తులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
Hazarath Reddyపంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి స్పష్టత లేదు.ప్రమాదం నుంచి బయటపడిన కొందరు వ్యక్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు
Corona Cases in Hyderabad: హైదరాబాద్ లో 10కి చేరిన కరోనా కేసులు.. గురువారం ఒక్కరోజే 4 కేసులు నమోదు.. అందుబాటులోకి ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులు
Rudraగడిచిన రెండు రోజుల్లో హైదరాబాద్ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10కి చేరింది. ఈ నెల 20న 6 కేసులు నమోదు కాగా, తాజాగా గురువారం మరో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
Gas Cylinder at Rs 500: రూ.500 వంట గ్యాస్ సిలిండర్‌ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్
Rudraఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ పథకం పొందడానికి కేవైసీ తప్పనిసరి అని చెప్పడంతో వినియోగదారులు ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు వరుస కడుతున్నారు.
South Central Railway: పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి గుడ్‌ న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. పూర్తి వివరాలు ఇదిగో
Rudraపెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృ1ష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
KTR Meeting: లోక్ స‌భ‌కు రెడీగా ఉందాం! జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల‌తో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కీల‌క స‌మావేశం
VNSనగరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడొద్దని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. హామీలు అమలు చేసేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.
Free Bus Service in Telangana: వీడియో ఇదిగో, మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సిందే, బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా చేసిన ఓ వ్యక్తి
Hazarath Reddyఆర్టీసి బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి బస్ స్టాండ్ ముందు వాసు అనే వ్యక్తి ఆందోళన. వీడియో ఇదిగో..
Telangana: మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్, బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు
Hazarath Reddyఅదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో అజీం ఖాన్ అనే వ్యక్తి టికెట్ తీసుకోగా ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు లేదని కండక్టరుతో గొడవపడి చెంప కొరికాడు.
Telangana: సికింద్రాబాద్‌ రాష్ట్రపతి నిలయంలో వివిధ పర్యాటక ఆకర్షణలను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫోటోలు ఇవిగో..
Hazarath Reddyసికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో వివిధ పర్యాటక ఆకర్షణలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. ఆకర్షణలో చారిత్రక జెండా స్తంభం, చిట్టడవి ఉద్యానవనం మరియు పిల్లల ఉద్యానవనం, పునరుద్ధరించబడిన మెట్ల బావులు మరియు సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థలు, శివ మరియు నంది శిల్పాలు మరియు నాలెడ్జ్ గ్యాలరీలో కొత్త ఎన్‌క్లేవ్‌లు ఉన్నాయి.
Telangana Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా, ఆరు రోజుల్లో 26 గంట‌ల 33 నిమిషాల పాటు సమావేశాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభ‌మైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంట‌ల 33 నిమిషాల పాటు స‌మావేశాలు కొనసాగిన‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలిపారు
Telangana Assembly Session 2023: తెలంగాణ విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session 2023) ఆరో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు.
Telangana Assembly Session 2023: విద్యుత్ ప్రాజెక్టులపై జ్యుడిషియల్ విచారణకు సిద్ధం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, విద్యుత్ బకాయిలపై హాట్ హాట్‌గా సాగిన సమావేశాలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరుగగా.. విద్యుత్‌పై మూడు అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది
Singareni Elections: ఈ నెల 27వ తేదీన సింగరేణి ఎన్నికలు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyఎట్టకేలకు సింగరేణి ఎన్నికల నిర్వహణకు (Singareni Elections) తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరిపేందుకు వీలు కలిపిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది
Mahalaxmi Scheme: 28వ తేది నుంచి రూ 500కే గ్యాస్ సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
Rudraమహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది.
Dalit Bandhu: దళితబంధుకు బ్రేకులు? ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ.. విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ పథకాన్ని నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ
Rudraతెలంగాణలో దళితబంధుకు బ్రేకులు పడ్డట్టు సమాచారం. పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఈ విడతలో 50 వేల దరఖాస్తులు వచ్చాయి.
TTD: తిరుమ‌ల వెళ్లేవారికి అల‌ర్ట్! స‌ర్వ‌ద‌ర్శనం టోకెన్లు ర‌ద్దు చేసిన టీటీడీ, ఈ నెల 22 నుంచి వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌న టోకెన్లు
VNSడిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా డిసెంబ‌రు 22న శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్లను ర‌ద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భ‌క్తులు తిరుమ‌ల‌(Tirumala) లో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా స‌ర్వద‌ర్శనంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చని సూచించారు.
Telangana Assembly Session 2023: ప్రజలను తప్పుదోవ పట్టించేలా శ్వేత పత్రం, దీనిపై హౌస్‌ కమిటీ వేయాలని హరీష్ రావు డిమాండ్
Hazarath Reddyతెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారని తెలిపారు.