తెలంగాణ

Rahul Gandhi Hyderabad Visit: ఓయూలో రాహుల్ గాంధీ సభకు నో పర్మిషన్, ఎలాంటి సమావేశాలకూ అనుమతి లేదన్న ఓయూ వీసీ, విద్యార్థి నేతల ఆగ్రహం

Krishna

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

Yadadri Parking Charges: యాదాద్రిలో కొత్త పార్కింగ్ ఫీజులు నేటి నుంచి అమలు, బాదుడే బాదుడు, కారు పార్కింగ్ గంటకు రూ. 500, గుట్టపై పార్కింగ్ చార్జీలపై ప్రజల్లో ఆగ్రహం..

Krishna

యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్‌ ఫీజులు అమల్లోకి వచ్చాయి. కారుతో కొండెక్కితే మొదటి గంటకు రూ.500 వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. మొదటి గంట తర్వాత ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటల వరకు.. ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు.

Weather Forecast: తెలంగాణను ముంచెత్తిన అకాల వర్షాలు, మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం, పలు జిల్లాల్లో తడిసిపోయిన ధాన్యం

Hazarath Reddy

విపరీతమైన ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మరో మూడ్రోజులు (Next three days will Continue) రాష్ట్రంలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాముందని (Weather Forecast) వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

KTR Comments Row: హైద‌రాబాద్‌లో క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉన్నా..ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదే, కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి బొత్సా, ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌డం మానుకోవాలని హితవు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR Comments Row) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి జోగి రమేష్ ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు.

Advertisement

Asian Club League Handball Event: హైదరాబాద్‌లో ఆసియా క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ, జూన్‌ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గేమ్స్

Hazarath Reddy

హైదరాబాద్‌ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ హైదరాబాద్‌ వేదికగా జరుగనుంది. జూన్‌ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని జాతీయ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు గురువారం పేర్కొన్నారు.

TS Job Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మొత్తం 677 పోస్టులు, ఎందులో ఉన్నాయో తెలుసా?

Naresh. VNS

ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో (Transport)677 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

Telangana: తాండూర్‌ సీఐపై అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ కోరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్సైని దూషించిన విషయంలో మహేందర్‌రెడ్డిపై మరో కేసు నమోదు

Hazarath Reddy

తాండూర్‌ సీఐపై అనుచిత వ్యాఖ్యల ఆడియో క్లిప్‌ వైరల్‌ అవడంతో.. మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి. తాండూరు సీఐను దూషించింనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి (TRS MLC Patnam Mahender Reddy) తెలిపారు.

Nizamabad Shocker: ప్రియుడితో కోడలు రాసలీలలు, వద్దని వార్నింగ్ ఇచ్చిన మామ, కోపంతో ప్రియుడుతో కలిసి మామని చంపేసిన కోడలు, నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో దారుణం (Nizamabad Shocker) చోటు చేసుకుంది. తమ రాసలీలలకు మామ అడ్డువస్తున్నాడని ఓ కోడలు (daughter-in-law) ప్రియుడితో కలిసి మామను (killed her uncle) చంపేసింది.

Advertisement

Telangana Road Accident: రెప్పపాటులో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి, పిల్లలకు తీవ్ర గాయాలు, చివ్వెంల మండల పరిధిలో విషాద ఘటన

Hazarath Reddy

రెండేళ్ల తరువాత విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన దంపతులను మృత్యువు కాటేసింది. సూర్యాపేట రహదారిపై రెప్పపాటులో జరిగిన ప్రమాదం దంపతులను బలిగొనడంతో పాటు వాళ్ల ఇద్దరు పిల్లలకు కన్నవాళ్లను దూరం చేసింది.

Hyderabad Horror: భాగ్యనగరంలో విషాదం, వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని గోల్కొండ బడబజార్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న అనస్ అహ్మద్(2) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Weather Forecast: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక, నేడు రేపు ఎండలతో అప్రమత్తంగా ఉండాలని సూచన, భానుడు చండ్ర నిప్పులు చెరుగుతాడని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఉక్కుపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు నేడు, రేపు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది

TRS Plenary Meeting 2022: మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్, పుల్వామా, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్, క‌శ్మీర్ ఫైల్స్ అంటూ విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నారని మండిపాటు, దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాలని సూచన

Hazarath Reddy

రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్‌ వ్యవస్థను.. ఇప్పుడు దుర్మార్గంగా మార్చేశారని సీఎం కేసీఆర్‌ ఆక్షేపించారు. హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో (TRS Plenary Meeting 2022) ఆయన ప్రసంగిస్తూ.. మహారాష్ట్రలో కీలకమైన ఓ ఫైల్‌ను అక్కడి గవర్నర్‌ ముందుకు కదలనీయకుండా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు.

Advertisement

TRS Plenary Meeting 2022: ప్రస్తుతం దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, బిజెపిది వైఫల్యాల చరిత్ర, టీఆర్ఎస్ వ్యవస్ధాపక దినోత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చరిత్రలో మరవలేని నేతలు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించాచారని గుర్తుచేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారని పేర్కొన్నారు.

TRS Plenary Meeting 2022: తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ, ఎవ‌రూ బ‌ద్ద‌లు కొట్ట‌లేని కంచుకోట ఇది, టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా కేసీఆర్ ప్రసంగం హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు. టీఆర్ఎస్ పార్టీ 21 వ‌సంతాలు (TRS 21st Formation Day Celebrations) పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.

TRS Celebrates 21 Years: జాతీయే రాజకీయాలే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, 22వ వడిలోకి అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

Hazarath Reddy

రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ యుక్త వయసులోకి ప్రవేశిస్తోంది. నేటి (ఏప్రిల్‌ 27)తో 21 ఏళ్లు పూర్తి చేసుకొని, 22వ యేట అడుగు (TRS Celebrates 21 Years) పెట్టబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రతినిధుల సభ (ప్లీనరీ) ( Hyderabad International Convention Centre (HICC) నిర్వహిస్తోంది.

Group-I Notification in Telangana: ఎనిమిదేళ్ల తర్వాత గ్రూప్-1, నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మొత్తం 503 ఖాళీలు భర్తీ, ఏయే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారంటే?

Naresh. VNS

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్‌-1 పోస్టులకు (Group-I posts) తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Telangana State Public Service Commission) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనున్నది. ప్రిలిమ్స్‌ (preliminary test ), మెయిన్స్‌ (Mains) ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు.

Advertisement

CM KCR at Bhoomi Puja: మతం, కులం పేరిట చిల్లర రాజకీయాలు, ఆల్వాల్ సభలో మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్, మూడు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమి పూజలు

Hazarath Reddy

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్(స‌న‌త్ న‌గ‌ర్‌), అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు (CM KCR Participate In Tims) ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి పూజ‌లు (Alwal Bhoomi Puja) చేశారు.

Telangana Horror: తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించిన కొడుకు, బాధలు తట్టుకోలేక అతడి గొంతు కోసి చంపేసిన తల్లిదండ్రులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

మద్యం, మాదకద్రవ్యాలకు బానిసైన కుమారుడి చేతిలో రోజూ పడుతున్న బాధలు తట్టుకోలేక తెలంగాణలో ఓ దంపతులు అతడిని గొంతుకోసి హత్య (Couple Kills Son Addicted To Liquor) చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna-Sircilla) సోమవారం చోటుచేసుకుంది.

Telangana: సొంత ఊరికి బస్సును తెప్పించిన గంగవ్వ, ఆమె మాటతో లంబాడిపల్లికి బస్సును ఏర్పాటు చేసిన ఆర్టీసీ, మొన్న పార్వతి.. నేడు గంగవ్వ అంటూ న్యూస్ వైరల్

Hazarath Reddy

యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

TS Police Recruitment 2022: తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభవార్త, రాష్ట్ర పోలీసు శాఖ‌లో ఖాళీగా ఉన్న 16,027 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Hazarath Reddy

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు వ‌రుస‌గా శుభవార్త‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌న్నింటినీ భ‌ర్తీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీ సాక్షిగా కీలక ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆయా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి తెలంగాణ (Telangana) ఆర్థిక శాఖ వ‌రుస‌గా అనుమ‌తులు మంజూరు చేస్తూ వ‌స్తోంది.

Advertisement
Advertisement