తెలంగాణ
CJI NV Ramana: చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్‌ సీఎం కేసీఆర్, న్యాయాధికారుల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించిన సీజేఐ ఎన్వీ రమణ
Hazarath Reddyసీజేఐ ఎన్వీ రమణ ( Justice NV Ramana) మాట్లాడుతూ న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.
Telangana: భరించలేని మానసిక ఒత్తిడి, తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ ఎమ్మెల్యే కూతురు, కన్నీరుమున్నీరవుతున్న తండ్రి
Hazarath Reddyతెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె మహాలక్ష్మి(27) గురువారం తెల్లవారుజామున సారపాకలోని స్వగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు (TRS Former Mla's Daughter Ends Life ) పాల్పడ్డారు.
Telangana: నిరుద్యోగులకు శుభవార్త, 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపిన తెలంగాణ సర్కారు, విడివిడిగా జీవోలు జారీ చేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు
Hazarath Reddyతొలి విడతలో 30,453 పోస్టుల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ.. తాజాగా బుధవారం మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విడివిడిగా జీవోలు జారీ చేశారు
Ambedkar Jayanti 2022: తెలంగాణలో 125 అడుగుల డాక్టర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహం, 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తామని తెలిపిన తెలంగాణ మంత్రి
Hazarath Reddyభార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ (Minister KT Rama Rao) ట్వీట్ చేశారు. ఎంత కాలం జీవించామన్నది కాదు.. ఎంత గొప్పగా జీవించామన్నదే జీవితం అనే అంబేద్క‌ర్ సూక్తిని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Akbaruddin Owaisi: అక్బ‌రుద్దీన్ ఓవైసీకి నాంప‌ల్లి కోర్టులో ఊర‌ట, రెండు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం, ఓవైసీ విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేసిన‌ట్లు ఆధారాలు చూప‌లేద‌ని పేర్కొన్న కోర్టు
Hazarath Reddyఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీకి నాంప‌ల్లి కోర్టులో ఊర‌ట ల‌భించింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. నిజామాబాద్, నిర్మ‌ల్‌లో అక్బరుద్దీన్ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై అప్పట్లో రెండు కేసులు నమోదయ్యాయి.
Telangana Cabinet Revoke GO 111: జీవో 111 ఎత్తివేస్తూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం, ఇక హైదరాబాద్ శివారు భూములు ఇక బంగారమే, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెక్కలు, పర్యావరణ వేత్తల ఆందోళన
Krishna111 జీవోను ఎత్తేయాలని కేబినెట్‎లో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు తొలగించి జీవోను ఎత్తేస్తామని.. అందుకోసం సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.
Pride Place: ప్రైడ్ ప్లేస్ ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ను ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి, ట్రాన్స్ జెండర్లకు చట్టపరంగా భద్రత, రక్షణ కల్పించేలా చేస్తామని వెల్లడి
Hazarath Reddyట్రాన్స్ జెండర్లకు చట్టపరంగా భద్రత, రక్షణ కల్పించేలా చేస్తామన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్ర మహిళా సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రైడ్ ప్లేస్ అనే ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ట్రాన్స్ జెండర్ల భద్రత కోసం ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేశామన్నారు.
Hyderabad: ఎండల దెబ్బకు హైదరాబాద్‌లో పొంగుతున్న బీర్లు, గత 10 రోజుల్లో రికార్డు స్థాయి అమ్మకాలు, వచ్చే నెలలో గత రికార్డులు బద్దలవుతాయని చెబుతున్న అధికారులు
Hazarath Reddyప్రస్తుతం అందుతున్న అధి‌కా‌రిక సమా‌చారం ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి 10 వరకు బీర్ల అమ్మ‌కాల్లో పెరు‌గు‌దల నమో‌ద‌వు‌తు‌న్నది. నిరు‌టితో పోలిస్తే ఏప్రిల్‌ ఒకటి నుంచి పది వరకు బీర్ల అమ్మ‌కాలు 20% పెరి‌గాయి. కేవలం పది రోజు‌ల్లోనే పది లక్షల కేసుల బీర్లు అమ్ము‌డ‌య్యాయి. నిరుడు ఇదే సమ‌యంలో ఈ లెక్క 8.3 లక్షల కేసుల బీర్లుగా ఉన్నది. ఇతర రకాల మద్యం అమ్మ‌కాల్లో స్వల్పంగా తగ్గు‌దల నమో‌దైంది.
CM KCR at Dhrana: పీయూష్ గోయ‌ల్ కాదు.. పీయూష్ గోల్ మాల్, మోదీని త‌రిమికొడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరిక, ఇంటిగ్రేటెడ్ అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ రూపొందించాలని కేంద్రానికి డిమాండ్
Hazarath Reddyకేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.
TRS Dharna in Delhi: ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష, రైతుల ప‌క్షాన కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలిపిన రాకేశ్ తికాయ‌త్, దీక్ష వేదిక‌గా టీఆర్ఎస్ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌
Hazarath Reddyధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ దీక్ష (TRS Dharna in Delhi) చేప‌ట్టింది. రైతుల ప‌క్షాన ప్ర‌జాప్ర‌తినిధుల నిర‌స‌న దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన దీక్ష‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ( CM KCR), రాకేశ్ తికాయ‌త్ హాజ‌ర‌య్యారు
Sri Rama Navami Celebrations: భద్రాద్రిలో కన్నులపండువగా శ్రీరామనవమి వేడుకలు, రెండేళ్ల తర్వాత ప్రత్యక్షంగా భక్తులకు నేరుగా తిలకించే అవకాశం, వేలాదిగా చేరుకుంటున్న భక్తులు
Naresh. VNSభద్రాచలంలో (Badrachalam) రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు (Sri ramanavami) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో (Mithila stadium) జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు.
Fire Accident In Hyderabad: మైలార్ దేవ్ పల్లి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం, ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..
Krishnaరంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. చుట్టుపక్కలంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్లాస్టిక్ కంపెనీ ఇళ్ల మధ్య ఉండటంతో దట్టమైన పొగకు స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
TSRTC Increased Ticket Fares: మరోసారి పెరిగిన బస్సు ఛార్జీలు, డీజిల్ సెస్ పేరుతో ధరలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ, ఆర్డినరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.2 వసూలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.5 పెరిగిన ధరలు
Naresh. VNSతెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ (Ordinary) సర్వీసులకు రూ.2 పెంచారు. ఎక్స్ ప్రెస్ , డీలక్స్ (Deluxe), మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా నిర్ణయించారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.
Telangana: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో, బస్సును ఓవర్ టేక్ చేయబోయి మహిళ తల మీద నుంచి వెళ్లిన లారీ
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌లోని రామంత‌పూర్‌లో శుక్ర‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. యాక్టివాపై వెళ్తున్న ఇద్ద‌రు దంప‌తుల‌ను వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో భార్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, భ‌ర్త‌కు తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.
TRS Protest: కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు, బీజేపీ సర్కార్ వడ్లు కొనుగోలు చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తేల్చి చెప్పిన కేసీఆర్ సర్కారు
Hazarath Reddyతెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు (TRS organises innovative protest) కొనసాగుతున్నాయి. కాగా, రైతుల ఆందోళనలకు మద్దతుగా ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.
Revanth Reddy House Arrest: రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు హౌస్ అరెస్ట్, పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్
Hazarath Reddyదేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్‌ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళనలకు ప్లాన్‌ చేశారు.
Ram Navami 2022: రెండు సంవత్సరాల తరువాత శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాచలం, ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం కార్యక్రమాలు
Hazarath Reddyదక్షిణ అయోధ్యగా పేరుగాంచిన తెలంగాణలోని భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిగే రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు (Bhadradri all set for grand Rama Navami) జోరుగా కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
Hyderabad Drug Case: డ్రగ్స్‌ పెడ్లర్స్‌ అందరినీ అరెస్ట్‌ చేశాం, కొందరు కస్టమర్లను పట్టుకోవాల్సి ఉందని తెలిపిన నార్కోటిక్స్‌ టీమ్‌ డీసీపీ చక్రవర్తి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో నమోదైన తొలి డ్రగ్స్‌ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రేమ్‌ ఉపాధ్యాయకు హష్‌ ఆయిల్‌ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతిని హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Hyderabad: మత్తుమందు ఇచ్చి అవయవాలు ఎత్తుకెళ్లారు! గోవాలో మిస్సైన టెంపో డ్రైవర్ తలపై మిస్టరీ కుట్లు, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్, కళ్లు తెరిస్తే కానీ మీస్టరీ వీడే అవకాశం లేదు
Naresh. VNSబోరబండలో నివాసముంటున్న శ్రీనివాస్..టెంపో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మార్చి 19న 10 మందిని గోవా తీసుకువెళ్లిన శ్రీనివాస్ 20న సాయంత్రం అదృశ్యమయ్యాడు. దీంతో కూడా వచ్చిన ప్రయాణికులు బోరబండలోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని గోవా వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడ శ్రీనివాస్ కోసం గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
KTR Satire on Modi: ప్రధాని మోదీపై సెటైర్ విసిరిన తెలంగాణ మంత్రి కేటీఆర్, దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి ప్రధాని మోదీపై వ్యంగ్యం ప్రదర్శించారు. గత రెండు వారాల్లో.. దేశవ్యాప్తంగా దాదాపు 10రూ. పెరిగిన పెట్రో ధరలను ప్రస్తావిస్తూ కేటీఆర్‌ మంగళవారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు.