తెలంగాణ

PM Modi's Visit to Telangana: ఈ నెల 5న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, బందోబ‌స్తుపై స‌మీక్ష‌ నిర్వహించిన తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌, ప్రధాని మోదీ పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఫిబ్రవరి 5న నగరానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు (PM Modi's Visit to Telangana) సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ (Chief Secy omesh Kumar) గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ( review meeting with officials) నిర్వహించారు.

Constitution Not KCR's Property: కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలు, రాజ్యాంగాన్ని కాదు.. నిన్నే మార్చాలంటూ సీఎంపై దళిత సంఘాల నేతలు మండిపాటు, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

Hazarath Reddy

దేశ రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కోసం తాను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్లపై నిరసనలు (Constitution Not KCR's Property) వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి

COVID in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 2,646 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 747 కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో 2,646 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారు. 3,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 94.96 శాతంగా ఉంది.

COVID in TS: తెలంగాణలో కొత్తగా 2.850 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 859 కొత్త కేసులు

Hazarath Reddy

రాష్ట్రంలో మంగళవారం 94,020 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,850 మంది వైరస్‌ బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 3.03 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.66 లక్షలకు చేరింది. తాజాగా 4,391 మంది కోలుకోగా, మొత్తం 7.27 లక్షల మంది రికవరీ అయ్యారు

Advertisement

Telangana: సకిని రామచంద్రయ్య, కనకరాజుకు రూ. కోటి నగదు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్, పద్మశ్రీ అవార్డు అందుకున్న ఇరువురికి శుభాకాంక్షలు

Hazarath Reddy

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు అతని సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో సీఎంను మంగళవారం ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా రామచంద్రయ్య కలిశారు.

Telangana CM KCR: బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తాం, ఆయన బట్టలు మారిస్తే దేశం బాగుపడుతుందా, దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి, కేంద్ర బడ్జెట్ 2022పై మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది దారుణమైన బడ్జెట్‌, అది పసలేని, పనికిమాలిన బడ్జెట్‌ అని, ఏ వర్గానికీ మేలు చేయని బడ్జెట్‌ అని అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కేసీఆర్‌ కేంద్ర బడ్జెట్‌పై (BJP, Union Budget 2022-23) మాట్లాడారు.

CM KCR On Budget 2022: కేంద్ర బడ్జెట్‌ మాటల గారడీ తప్ప ఏమీ లేదు, ఇదొక దిక్కుమాలిన, పనికిమాలిన, పసలేని బడ్జెట్, సీఎం కేసీఆర్ ఆగ్రహం

Krishna

"కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

Union Budget 2022-23 Highlights: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త, త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా, పెన్నా-కావేరి నదుల అనుసంధానం, భారత్‌లో సొంత డిజిటల్ కరెన్సీ, నిర్మల బడ్జెట్ 2022 ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే..

Hazarath Reddy

నాలుగోసారి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ 2022 ను (Union Budget 2022-23 Highlights) ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 2,861 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 234, రంగారెడ్డి జిల్లాలో 165, ఖమ్మం జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి.

TRS Boycotts Presidential Speech: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు, పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ ఎంపీలు నిరస‌న

Hazarath Reddy

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేప‌థ్యంలో ఈ రోజు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు.

Karimnagar Road Accident: వయసు 16.. అయినా 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి నలుగురి మృతికి కారకుడయ్యాడు, కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి

Hazarath Reddy

కరీంనగర్‌ పట్టణణంలో కారు ఆదివారం ఉదయం బీభత్సం సృష్టించిన సంగతి విదితమే. వేగంగా దూసుకొచ్చిన కారు కమాన్‌ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న గుడిసెల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి (Karimnagar Road Accident) చెందారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Hyderabad Drug Case: హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాపై సంచలన విషయాలు, డ్రగ్స్‌ ఇంటర్నేషనల్‌ పెడ్లర్‌ టోనీ నుండి కీలక విషయాలు తెలుసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలోని పలు చోట్ల ఎక్సైజ్, పోలీసులు ( Hyderabad Police) ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మల్లెపల్లి అత్తాపూర్, గోపనపల్లిలో దాడులు జరిగాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

Advertisement

Covid in TS: తెలంగాణలో కొత్తగా 2,484 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు చేయగా... 2,484 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 138, రంగారెడ్డి జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 108, ఖమ్మం జిల్లాలో 107 కేసులు గుర్తించారు.

TRS Parliamentary Party meeting: కేంద్రంపై ఇక యుద్ధమే! తెలంగాణకు రావాల్సిన వాటాకోసం గట్టిగా పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం

Naresh. VNS

టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ (TRS Parliamentary Party meeting) స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ (Praghathi Bhavan) లో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రిగింది. దీనికి టీఆర్ఎస్ ఎంపీలు హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీల‌తో చ‌ర్చించారు.

Cold wave In Telanagana: తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్, చలికి గజగజ వణుకుతున్న హైదరాబాద్ వాసులు, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం

Naresh. VNS

తెలంగాణలో చలి పంజా (Cold Wave) విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవగా.. చలికి జనం వణుకుతున్నారు. మరో రెండు రోజుల పాటూ ఇదే తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Telangana Schools Open From Feb 1st: ఫిబ్రవరి ఒకటి నుంచి స్కూళ్లు ప్రారంభం, కరోనా కేసుల తగ్గుదల, తీవ్రత లేకపోవడంతో నిర్ణయం..

Krishna

తెలంగాణలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల 31వ తేదీ వరకూ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 3,877 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 3,877 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 348, రంగారెడ్డి జిల్లాలో 241, హనుమకొండ జిల్లాలో 140, నల్గొండ జిల్లాలో 133 కేసులు గుర్తించారు.

Road Accident in Bhadradri Kottagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి,

Krishna

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు.

New National Highway Between TS-AP: తెలుగు రాష్ట్రాల మధ్య ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ ఆమోదం, రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో కొత్త జాతీయ రహదారి నిర్మాణం

Hazarath Reddy

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్‌ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 3,944 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,372 పాజిటివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 3,944 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,372 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డి జిల్లాలో 259, ఖమ్మం జిల్లాలో 135, సంగారెడ్డి జిల్లాలో 120, హనుమకొండ జిల్లాలో 117, నిజామాబాద్ జిల్లాలో 105, సిద్దిపేట జిల్లాలో 104, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 101 కేసులు గుర్తించారు.

Advertisement
Advertisement