తెలంగాణ
Shankar Rao Convicted:రెండు కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టులోనే సృహతప్పిన మాజీమంత్రి శంకర్‌రావు, శిక్ష రద్దు చేసి జరిమానాతో సరిపెట్టిన కోర్టు
Naresh. VNSమాజీమంత్రి శంకర్‌రావు(Ex-minister Shankar Rao )ను రెండు కేసుల్లో దోషి(convicted)గా తేల్చింది ప్రజా ప్రతినిధుల కోర్టు. భూ వివాదానికి(Land case) సంబంధించి బెదిరించారన్న ఆరోపణలతో షాద్‌నగర్‌(Shadnagar)లో 2015లో ఓ కేసు నమోదైంది.
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
Hazarath Reddyహైదరాబాద్ గురువారం బూడిద మేఘాల దట్టమైన దుప్పటిని చుట్టుకొని నిద్రలేచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, నాగోల్‌, మీర్‌పేట్‌, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది.
COVID Clusters on IIT Campuses: హైదరాబాద్ ఐఐటీ కాలేజీలో కరోనా కల్లోలం, గత 24 గంటల్లో 123 మందికి కరోనా, ప్రస్తుతం క్యాంపస్‌లో 2 వేలమంది విద్యార్థులు, 250 మంది ఫ్యాకల్టీలు
Hazarath Reddyతెలంగాణలో కాలేజీల్లో కరోనా కల్లోలం రేపుతోంది, ముఖ్యంగా గత 24 గంటల వ్యవధిలో ఐఐటీ కాలేజీల్లో (COVID Clusters on IIT Campuses) కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని హైదరాబాద్‌ ఐఐటీలో బుధవారం నాటికి 123 మందికి కరోనా సోకింది.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,319 మందికి కరోనా, ఇద్దరు మృతి, తాజాగా 474 మంది రికవరీ
Hazarath Reddyబుధవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,319 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Corona cases in Telangana) 7,00,094 కాగా, మరణాల సంఖ్య 4,047 ఉంది. ఇక రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,77,708 ఉండగా, తాజాగా 474 మంది రికవరీ అయ్యారు.
KCR Letter to PM Modi: ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు లేఖ, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్, రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపాటు
Naresh. VNSప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్(Kcr Letter to Modi). ఎరువుల ధరల పెంపుపై కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు (KCR opposes hike in fertilizer rates). పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన కోరారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌లు(fertilizer prices) త‌గ్గించాల‌ని, కోట్ల మంది రైతుల త‌ర‌పున విజ్ఞప్తి చేస్తున్నాన‌ని కేసీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.
Fire Breaks Out at GHMC: జీహెచ్ఎంసీ జోనల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం, పలు ఫైల్స్‌ దగ్ధం, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyభాగ్యనగరం సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్‌ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్లో మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
Minister Thalassani: సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతా, తెలంగాణ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు, సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలని తెలిపిన మంత్రి
Hazarath Reddyఏపీలోని సినిమా థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై (I will talk to AP ministers on the issue of theaters) ఆ రాష్ట్ర మంత్రుల‌తో తాను మాట్లాడ‌తాన‌ని తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tejaswi Yadav Meets CM KCR: జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్, బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు, బీహార్‌ విపక్ష నేత తేజస్వియాదవ్‌‌తో ప్రగతి భవన్‌లో భేటీ
Hazarath Reddyజాతీయ రాజకీయాలపై అసక్తి చూపుతున్న కేసీఆర్‌ బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి మంగళవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ (Tejaswi Yadav Meets CM KCR) అయ్యారు.
Telangana Rains: తెలంగాణను ముంచెత్తిన అకాల వర్షాలు, మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ, ఆరు జిల్లాలో బీభత్సం సృష్టించిన వరుణుడు
Hazarath Reddyవచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని తన బులిటెన్ లో పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.
Telangana: ప్రేమించుకున్నారు, పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకున్నారు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన, మరో ఘటనలో కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
Hazarath Reddyయాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదని, పెళ్లికి కూడా ఒప్పుకోరని (Fearing their families disapproval to their marriage) భావించిన ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది.
Jagadish Reddy COVID: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా, ఐసోలేషన్‌లోకి వెళ్లిన టీఆర్ఎస్ నేత, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని మంత్రి పేర్కొన్నారు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 1,825 కోవిడ్ కేసులు, కరోనాతో ఒకరు మృతి, ప్రస్తుతం తెలంగాణలో 14,995 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో ఒక్కరోజులోనే 1,825 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ6,95,855 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,77,466 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Telangana: మిస్టరీగా మారిన మొండెం లేని మనిషి తల, నల్గొండ జిల్లాలో మహంకాళి దేవాలయం వద్ద షాకింగ్ ఘటన, మరో ఘటనలో.. వరంగల్ జిల్లాలో భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు
Hazarath Reddyనల్లగొండ జిల్లాలో దారుణ ఘటన (Nalgonda Horrific Incident) చోటుచేసుకుంది. జిల్లాలోని చింతపల్లి మండలం గొల్లపల్లిలో దుండగులు... గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేశారు. ఆ తర్వాత.. తలను, మొండెంను వేరు చేసి విరాట్‌నగర్‌లోని మహంకాళి ఆలయం (Mahankali temple) వద్ద పడేశారు.
Booster Dose in Telangana: బూస్టర్ డోస్ గురించి పూర్తి సమాచారం ఇదే, తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమైన బూస్టర్‌ డోస్‌ పంపిణీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ పంపిణీని మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. చార్మినార్‌ యునానీ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొదటి డోసును స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్‌ అంజద్‌ ఖాన్‌ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏండ్లు దాటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్‌ డోసు(Booster Dose in Telangana) వేస్తున్నారు.
Corona in TS: తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు పొడిగింపు, కొత్తగా 1,673 మందికి కరోనా, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 48,583 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123 కేసులు గుర్తించారు.
SCR Increases Platform Ticket Rate: ఫ్లాట్‌ఫాం మీదకు ఎక్కితే బాదుడే, భారీగా రేట్లను పెంచిన దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.50కి పెరిగిన ఫ్లాట్‌ఫాం టికెట్ రేటు
Naresh. VNSరైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే(South Central Railway). ప్రయాణికులతో పాటూ, వారి బంధువులు కూడా రైల్వే స్టేషన్లలోకి రాకుండా ఉండేందుకు ఫ్లాట్‌ ఫాం టికెట్ల రేట్ల(increases platform ticket rate)ను పెంచింది. సంక్రాంతి(Sankranthi) సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. దీంతో ఫ్లాట్‌ ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచారు.
Ramesh Babu Dies:సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం, మహేష్ బాబు సోదరుడు రమేష్‌ బాబు కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Naresh. VNSకృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు(Ramesh Babu) (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతి (AIG Hospital)కి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు(Ramesh Babu) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Vanama Raghava Arrest: వనమా రాఘవకు 14 రోజులు రిమాండ్, భద్రాచలం జైలుకు వనమా రాఘవ తరలింపు..
Krishnaపాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవకు 14 రోజులు రిమాండ్ విధించారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు వనమా రాఘవను భద్రాచలం సబ్‌ జైలుకు తరలించారు.
Palvancha Ramakrishna Another Selfie Video: బయటపడ్డ రెండో సెల్ఫీ వీడియో, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో మలుపు, వనమా రాఘవకు పెరిగిన చిక్కులు...
Krishnaరెండో వీడియోలో మృతుడు నాగరామకృష్ణ మరిన్ని సంచలన విషయాలను వెల్లడించాడు. తాను చనిపోయే విషయం ప్రజలకు తెలియాలని పేర్కొన్నాడు. తనకు అప్పులు ఇచ్చిన వారికి న్యాయం జరగాలంటూ వీడియోలో వెల్లడించాడు. తాను ఆత్మహత్య చేసుకోవటానికి సూత్రధారి వనమా రాఘవ అంటూ పేర్కొన్నాడు.
Telangana Family Suicide In Vijayawada: విజయవాడలో దారుణం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య, మృతులు నిజామాబాద్ వాసులుగా గుర్తింపు..
Krishnaవిజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కుటుంబంగా గుర్తింపు.