తెలంగాణ
COVID in TS: గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదు, తెలంగాణలో గత 24 గంటల్లో 2,295 మందికి కోవిడ్
Hazarath Reddyతెలంగాణలో కరోనా కల్లోలం రేపుతోంది. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 2,295 మందికి పాజిటివ్ గా తేలింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదయ్యాయి.
Telangana: కామాంధుడి కథ ముగిసింది, ట్యూషన్ పేరుతో 12 మంది బాలికలపై అత్యాచారం, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు
Hazarath Reddyట్యూషన్ పేరుతో అభం శుభం తెలియని 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ కీచక టీచర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష (Tutor, hostel manager) పడింది. అలాగే సంస్థ నిర్వాహకుడికి కూడా యావజ్జీవ శిక్ష విధించారు. ఇక ఈ నేరాన్ని (Rape of 12 minor girls in Nalgonda) దాచిన ఓ మహిళకు ఆర్లెళ్ల జైలు శిక్షను విధిస్తూ నల్లగొండ జిల్లా ఒకటో అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది.
COVID in Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు, తాజాగా ఇద్దరు మృతి, కొత్తగా 232 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రొజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారీన పడి ఇద్దరు మరణించారని తెలిపింది. ఇవాళ కొత్తగా 232 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Vanama Raghava Arrest: వ‌న‌మా రాఘ‌వ అరెస్ట్‌, పాల్వంచలో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో, రాఘ‌వ‌ను పోలీసుల‌కు అప్ప‌గించిన ఎమ్మెల్యే వ‌న‌మా..
Krishnaపాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వనమా రాఘవను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటిక్రితమే హైదరాబాద్ కు వచ్చిన కొత్తగూడెం పోలీసులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తన కొడుకు రాఘవను అప్పగించారు.
COVID In TS: కరోనా థర్డ్ వేవ్ మొదలైంది, తెలంగాణలో వచ్చే నాలుగు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటా, బయటా మాస్క్‌ ధరించాలని తెలిపిన రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాసరావు
Hazarath Reddyతెలంగాణలో కరోనాతో పాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు కీలకమని (next four weeks will be crucial in the wake of the spread) రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి నెల మధ్యలో కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
Telangana Shocker: భర్త మృతితో ఇద్దరితో రాసలీలలు, ఇదేం పాడు పనని భర్త స్నేహితుడు అడిగితే రోకలిబండతో కొట్టి చంపేసింది, వనస్థలిపురంలో హత్య కేసును చేధించిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో వనస్థలిపురంలో గతంలో సంచలనం రేపిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును వనస్థలిపురం పోలీసులు ( Vanasthalipuram Police) ఛేదించారు. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన ఘటనలో ఇద్ధరినీ అరెస్టు (Woman, paramour arrested in murder case) చేసి రిమాండ్‌కు తరలించారు
Telangana: ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్‌లు 30 శాతం పెంచుతూ కేసీఆర్ సర్కారు నిర్ణయం, పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా వేల ఆశా వర్కర్లు అందించిన సేవలకుగాను అందిస్తున్న ఇన్సెంటివ్‌లను ( performance incentives for ASHA workers) పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నెలవారీ ప్రోత్సాహకాలను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.
Telangana Bandh Update: కేసీఆర్‌ని జైలుకు పంపిస్తాం, వదిలే ప్రసక్తే లేదు, జైలు నుంచి విడుదలైన బండి సంజయ్‌, జనవరి 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ
Hazarath Reddyతెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌తో (Bandi Sanjay Arrest) వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో అక్రమ కేసులను నిరసిస్తూ, 317 జీవోను పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతాపార్టీ జనవరి 10న రాష్ట్ర బంద్‌కు (Telangana Bandh ) పిలుపునిచ్చింది.
COVID in TS: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, తెలంగాణలో ఒక్కరోజే 1,520 మందికి కరోనా, ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వీరిలో 1,520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరుకుంది.
MP Bandi Sanjay Bail Row: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు, వ్యక్తిగత పూచికత్తు కింద రూ. 40 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం, తదుపరి విచారణ ఈనెల 7కు వాయిదా
Hazarath Reddyబీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్‌ జుడిషియల్ రిమాండ్‌పై స్టే విధించిన హైకోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ బుధవారం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పూచికత్తు కింద రూ. 40 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
Corona in TS: తెలంగాణలో కరోనా విశ్వరూపం, ఒక్కరోజులోనే 1,052 కేసులు నమోదు, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 659 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో విశ్వరూపం చూపిస్తోంది. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 42,991 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,052 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 659 కొత్త కేసులను గుర్తించారు.
Telangana Shocker: కొడుకు ఆత్మహత్య, కోడలిని దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేసిన మామ, తెలంగాణ మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలిని మామ అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి (Woman hacked to death by father in law) చంపేశాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన (Telangana Shocker) చోటుచేసుకుంది.
JP Nadda Press Meet: ఇది మనకు ధర్మ యుద్ధం, కేసీఆర్‌ది అప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే పనిగా పెట్టుకున్నారు, పార్టీ ఆఫీసులో కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
Hazarath Reddyసంజయ్ బండిని మానవహారంగా నిర్వహించి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు (Telangana govt is the most undemocratic government) ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కేసీఆర్ తన భావాలను, మానసిక సమతుల్యతను కోల్పోయారని విమర్శించారు.
Bandi Sanjay Arrest Row: ర్యాలీ లేకుండా నిరసనతో ముగించిన జేపీ నడ్డా, గాంధీ విగ్రహానికి నివాళులు, సత్యాగ్రహం పూర్తయిందని తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Hazarath Reddyబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఇతర బీజేపీ నేతలు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
MP Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్‌‌కు హైకోర్టులో చుక్కెదురు, లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సింగిల్‌ బెంచ్‌, ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyఎంపీ బండి సంజయ్‌ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ (Telangana High Court Single Bench) తిరస్కరించింది. కరీంనగర్‌లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో (Lunch Motion Petition) కోరారు.
Suryapet: సూర్యాపేట ర్యాగింగ్ కేసులో ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు, వసతిగృహం నుంచి విద్యార్థులను శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులు, ఐదుగురు వైద్య విద్యార్థులపై కేసు నమోదు
Hazarath Reddyసూర్యాపేటలోని Medical Collegeకు చెందిన హాస్టల్ లో ఒక student Raging కు గురైన ఉదంతం కలకలం రేపిన సంగతి విదితమే. విచారణలో సూర్యాపేట మెడికల్‌ కాలేజీ ర్యాగింగ్‌ ఘటన నిజమేనని తేలింది. ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ హాస్టల్‌లో ర్యాగింగ్‌ (Suryapet Student Ragging Case) జరిగినట్లు నివేదికలో తేల్చింది. ర్యాగింగ్ చేసిన ఆరుగురు విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు.
Omicron in Telangana: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కల్లోలం, తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన కేసీఆర్ సర్కారు, పెరుగుతున్న కేసులతో నుమాయిష్‌ మూసివేత
Hazarath Reddyతెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు (Schools, colleges to remain shut in Telangana) ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 9 రోజులు సెలవులను ప్రకటించారు. 16వ తేదీ తర్వాత కరోనావైరస్ (Coronavirus) పరిస్థితులను బట్టి సెలవులపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
COVID in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 482 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు 100కి అటూఇటూగా నమోదైన కొత్త కేసులు, ఇప్పుడు 400 దాటాయి. గడచిన 24 గంటల్లో 38,362 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 482 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Bhadradri Kothagudem: పాల్వంచ కుటుంబం సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే కుమారుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, పరారీలో నిందితుడు, సూసైడ్ లెటర్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పాల్వంచ ఏఎస్పీ వెల్లడించారు.
Telangana Lockdown Update: కేసులు పెరిగితేనే తెలంగాణలో లాక్‌డౌన్, క్లారీటి ఇచ్చిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జనవరి చివరి వారంలో లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని తెలిపిన డీపీహెచ్
Hazarath Reddyతెలంగాణలో కరోనావైరస్ కేసులు, ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.