తెలంగాణ

CM KCR Visits Gandhi Hospital: నేనున్నా..ధైర్యంగా ఉండండి, సీఎం హోదాలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రికి కేసీఆర్, వైద్య సేవల గురించి ఆరా, ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ సీఎం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తొలిసారిగా సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని (CM KCR visits Gandhi Hospital) సందర్శించారు. స్వయంగా కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గచ్చిబౌలి టిమ్స్‌కు సీఎం కేసీఆర్‌ వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR) దగ్గర ఉంది.

Telangana Shocker: రెండేళ్లుగా ట్రాన్స్‌జెండర్‌‌తో సహజీవనం, మంచంపై అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్‌జెండర్‌ మృతి, పోలీసులకు ఫిర్యాదు చేసిన ట్రాన్స్‌జెండర్‌ సోదరుడు

Hazarath Reddy

ఏడాదికాలంగా ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ జావిద్‌తో సహజీవనంలో ( living relationship) ఉన్నారు.అమృత సోదరుడు కూడా హైదరాబాద్ లోని బడంగ్‌పేటలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అమృత తన గదిలోని మంచంపై మృతి (suspicious death of transgender) చెందింది.

TSPSC Update: తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభమయ్యేనా? టీఎస్‌పీఎస్‌సీ నూతన చైర్మన్‌గా జనార్ధన్ రెడ్డి నియామకం, ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన గవర్నర్

Team Latestly

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ మరియు సభ్యులను సీఎం కేసీఆర్ ఈరోజు నియమించారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఇప్పుడు లైన్ క్లియర్ అయింది....

Telangana Lockdown: తెలంగాణలో ఈనెల 30 వరకు లాక్‌డౌన్ పొడగింపు, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు యధాతథం, సడలింపును దుర్వినియోగం చేయవద్దని ప్రజలకు సూచన

Team Latestly

ప్రజలు లాక్ డౌన్ సడలింపులను దుర్వినియోగం చేయవద్దని. అవసరాల మేరకే సడలింపులను వినియోగించుకోవాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి....

Advertisement

Telangana Extends Lockdown: తెలంగాణలో మే 30 వరకు లాక్‌డౌన్ పొడగిపు, నిబంధనలు యధాతథం.. ఈనెల భేటీ కావాల్సిన రాష్ట్ర మంత్రివర్గం రద్దు!

Vikas Manda

Telangana Health Bulletin: తెలంగాణలో మే 30 వరకు లాక్‌డౌన్ పొడగిపు, రాష్ట్రంలో 'ఆయుష్మాన్ భారత్' పథకం అమలుకు నిర్ణయం; టీఎస్‌లో కొత్తగా 3982 కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య అథారిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు ప్రభుత్వ వైద్యం...

Telangana: హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల‌కు 15 శాతం స్టైఫండ్ పెంపు, ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ సర్కారు, రూ. 19,589 నుంచి రూ.22,527కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ

Hazarath Reddy

తెలంగాణ‌లోని జూనియర్‌ డాక్టర్లు, హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం (Telangana Government) తీపి క‌బురు చెప్పింది. హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌ (House surgeons and-pgs) స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు హెల్త్ సెక్ర‌ట‌రీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌గా, వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Telangana Shocker: స్నేహితుల పార్టీ..బాగా తాగి బూతులు తిట్టిన ఓ స్నేహితుడు, తట్టుకోలేక చంపేసిన మరో స్నేహితుడు, హైదరాబాద్ నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ ఏకంగా ఓ స్నేహితుని ప్రాణాలను (Friend Assassinates His Friend) తీసింది. తన జోలికి వస్తే సహిస్తా కాని ఫ్యామిలీ జోలికి వస్తే సహించలేనంటూ స్నేహితుడు మరో స్నేహితునిపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నేరేడ్‌మెట్‌ ఠాణా (Hyderabad Neredmet) పరిధిలో చోటు చేసుకుంది.

Advertisement

Etela vs Gangula: గంగులా..2023లో అధికారంలో ఉండవని తెలిపిన ఈటెల రాజేందర్, నా వెంట్రుక కూడా పీకలేరని ఛాలెంజ్ చేసిన కమలాకర్, తెలంగాణలో హీటెక్కిన మాజీ మంత్రి ఈటెల ఎపిసోడ్

Hazarath Reddy

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ రాజకీయాలు అదే స్థాయిలో వేడెక్కాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి. ప్రధానంగా హుజుర్‌నగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ వర్సెస్ ఈటెల రాజేందర్ (Etela vs Gangula) అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి.

Raghurama Krishnam Raju case: రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం, జ్యుడిషియల్‌ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు, వైద్య పరీక్షలను వీడియో తీస్తున్న అధికారులు

Hazarath Reddy

నరసపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్‌ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ నాగార్జునను హైకోర్టు నియమించింది.

Fire Accident in HYD: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు సజీవ దహనం, ముగ్గురికి తీవ్ర గాయాలు, నారాయణగూడ అవంతి నగర్‌లో ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ నారాయణగూడ అవంతినగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident in HYD) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు.

COVID Review: కరోనా చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించుకోవాలని సీఎం కేసీఆర్ సూచన, తెలంగాణలో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం

Team Latestly

కరోనా వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో పూర్తిగా ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం కోరారు...

Advertisement

Corona in TS: తెలంగాణలో తగ్గుతూ పోతున్న రోజూవారీ కోవిడ్ కేసులు, తాజాగా 3,961 పాజిటివ్ కేసులు నమోదు, 5 వేల మందికి పైగా రికవరీ; టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు

Team Latestly

కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోరిక మేరకు తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 26 వరకు పెంచుతున్నట్లు ఎంసెట్ కన్వీనర్ సోమవారం ప్రకటించారు. ఇప్పటివరకు 1 లక్ష 50 వేలకు పైబడి ఎంసెట్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు....

KSN Murthy Dies: మాజీ ఐజీ కేఎస్‌ఎన్‌ మూర్తి కరోనాతో కన్నమూత, గబ్బర్ సింగ్ గా ప్రసిద్ది చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, హైదరాబాద్‌లో 991–92లో మత ఘర్షణలు అణిచివేసిన మూర్తి

Hazarath Reddy

గబ్బర్ సింగ్ గా ప్రసిద్ది చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, మాజీ ఐజీ కేఎస్‌ఎన్‌ మూర్తి కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగాయి.

TS Lockdown Row: కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఎందుకు నిర్వహించడం లేదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ అమలుపై ముగ్గురు సీపీలకు అభినందనలు, తదుపరి విచారణ జూన్ 1కి వాయిదా

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర కరోనా పరిస్థితులపై హైకోర్టు (TS High Court) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ (TS Lockdown) సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న ముగ్గురు కమిషనర్లను తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) అభినందించింది.

TS Coronavirus Update: తెలంగాణలో కొత్తగా 3,816 పాజిటివ్‌ కేసులు, 27 మంది కరోనాతో మృతి, 50,969కి చేరుకున్న యాక్టివ్‌ కేసులు, హైదరాబాద్‌కు చేరుకున్న రష్యా కరోనా టీకా స్పుత్నిక్-వి

Hazarath Reddy

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్‌ కేసులు (TS Coronavirus Update) నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో మరో 5,892 మంది చికిత్సకు కోలుకున్నారు. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,28,823కు పెరిగాయి

Advertisement

Warangal Shocker: సైకో భర్త పైశాచికం..ఇద్దరు భార్యలను దారుణంగా చంపేశాడు, మొదటి భార్యను ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టాడు, డబ్బులు తీసుకురాలేదని రెండో భార్యను కూడా చంపేశాడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వరంగల్ పోలీసులు

Hazarath Reddy

ప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకొని ఇద్దరు మహిళలను కిరాతకంగా హత్య (Sadist Husband assassinated his two wives) చేశాడు ఓ శాడిస్టు భర్త. రెండో భార్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు మొదటి భార్య ఉదంతం తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

Krishna Water Dispute: కృష్ణా మిగులు నీరుపై సీడబ్ల్యూసీ కీలక వ్యాఖ్యలు, సంవత్సరంలో కోటా మేరకు నీటిని వాడుకోకపోతే ఆ మిగులు జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కు, వివాదాన్ని బోర్డు నేతృత్వంలో పరిష్కరించుకోవాలని సూచన

Hazarath Reddy

కృష్ణా నదీ జలాల వాటా మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఒక నీటి సంవత్సరంలో కోటా మేరకు నీటిని వాడుకోకపోతే.. ఆ మిగులు జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది.

Hussain Sagar: హైదరాబాద్ వాసులకు మరో షాక్, హుస్సేన్ సాగర్, నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కరోనా జన్యు పదార్థాలు, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో పెరగడం ప్రారంభమైన జన్యు పదార్థాలు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరవాసులకు శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే వార్తను చెప్పారు. హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు (Coronavirus genetic material) కనపడ్డాయని తెలిపారు. సాగర్ తో పాటు ఇతర చెరువుల్లో (Hussain Sagar and other lakes in Hyderabad) కూడా ఈ పదార్థాలు కనిపించాయని.. అయితే, కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదనే విషయం ఒక అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.

TS Covid Update: తెలంగాణలో కొత్తగా 4,298 మందికి కరోనా, తాజాగా 32 మంది మరణించడంతో 2,928కి చేరుకున్న మొత్తం మృతుల సంఖ్య, సేవా ఆహార్ పేరుతో ఉచిత భోజ‌న కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పోలీస్‌శాఖ

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 64,362 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (4,298 new COVID-19 cases) అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 601 కేసులు గుర్తించారు. మేడ్చల్ లో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 6,026 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 32 మంది (32 deaths in 24 hours) మరణించారు.

Advertisement
Advertisement