తెలంగాణ
GHMC Mayor News: గ్రేటర్ చరిత్రలో తొలిసారిగా...జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీల‌త బాధ్యతలు స్వీకరణ, జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మేయ‌ర్
Hazarath Reddyగ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా మోతె శ్రీల‌త రెడ్డి (Mote Srilatha Reddy) సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు హాజ‌ర‌య్యారు.
TS's COVID19 Update: కరోనావైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య నిపుణుల సూచన, తెలంగాణలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyరాష్ట్రంలో రెండు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ తిరిగి చేపట్టనున్నారు. తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లకు రెండో మోతాదు టీకా పంపిణీ, అలాగే ఇప్పటివరకు టీకా వేయించుకోని ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు.....
Mini Medaram Jatara 2021: సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర, ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27 వరకు మినీ మేడారం జాతర, ఫిబ్రవరి 22 నుంచి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
Hazarath Reddyగిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ఫిబ్ర‌వ‌రి 24 న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిన్నజాతరకు (mini medaram jatara) ముందే వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
YS Sharmila Meeting: షర్మిల నోటి వెంట జై తెలంగాణ నినాదం, దివంగత వైఎస్సార్ పాలనను తీసుకురావడమే లక్ష్యమంటున్న షర్మిలారెడ్డి, హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం
Hazarath Reddyదివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలారెడ్డి తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు (YS Sharmila Meeting) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించగా..నేడు హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం (Hyderabad And Rangareddy Leaders) నిర్వహించారు.
Lawyer Couple's Murder Case: వామనరావు దంపతుల హత్య కేసు, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కీలకంగా మారిన వామనరావు ఆడియో రికార్డు, మార్చి 1 లోపు దీనిపై కౌంటర్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyరామగిరి మండలం కల్వచర్ల సమీపంలో బుధవారం జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసులో నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్‌ను రాత్రి 11 గంటలకు భారీ బందోబస్తు మధ్య పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంలో మంథని కోర్టుకు తీసుకొచ్చారు. జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్, జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు ఎదుట ముగ్గురినీ హాజరు పర్చారు. జడ్జి నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించా రు. అనంతరం వారిని పోలీసులు కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు.
Transgender Desk: హిజ్రాలతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ భేటీ, తెలంగాణలోనే తొలిసారి..సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డెస్క్ ప్రారంభించిన ససైబరాబాద్ పోలీస్ శాఖ, సమస్యలేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచన
Hazarath Reddyతెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Cyberabad cp vc sajjanar) నిన్న సమావేశమయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్‌జెండర్లు హాజరయ్యారు.
Tree City of The World 2020: హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు, 'ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020' జాబితాలో భాగ్యనగరానికి చోటు, భారత్ నుంచి ఎంపికైన ఏకైక నగరంగా ఖ్యాతి
Team Latestlyప్రపంచంలోని 63 దేశాల నుండి 120 నగరాలను పరిగణలోకి తీసుకోగా వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ఎఫ్.ఏ.ఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుండి ఏకైక నగరం హైదరాబాద్....
COVID in TS: తెలంగాణలో మళ్ళీ కోవిడ్ విజృంభించే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలంటున్న ఆరోగ్య నిపుణులు, రాష్ట్రంలో కొత్తగా మరో 165 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyతాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,97,278కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 19....
Digital Survey of Lands : త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే, రిజిస్ట్రేషన్లు- మ్యూటేషన్లు ఇకపై పారదర్శకం, రెవెన్యూ అధికారుల బాధ్యతలపై జాబ్ చార్ట్, సీఎం కేసీఆర్ సమీక్షలో కీలక నిర్ణయాలు
Team Latestlyభూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికారుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. సేద్యం చేసే పంటలు పండించాల్సిన రైతులు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యం కూడా. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యం. రెవెన్యూ శాఖలో....
Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 163 కోవిడ్ కేసులు నమోదు, 1700కి చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో నేడు హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోస్ కోవిడ్ టీకా పంపిణీ
Team Latestlyరాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత రాత్రి 8 గంటల వరకు 24,920 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 163 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 637 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.....
Lawyer Couple Hacked To Death: తెలంగాణలో దారుణం, నడిరోడ్డుపై హైకోర్ట్ న్యాయవాద దంపతుల హత్య, వాహనాన్ని అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి చంపిన దుండగులు, అధికార పార్టీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాల ఆరోపణ
Team Latestlyఖరీదైన నల్లటి కారులో వీరి కారును వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కల్వచర్ల సమీపంలో అడ్డగించి తన కారులో ఉన్న లాయర్ వామన్ రావును కారులోంచి కిందకు లాగి నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా నరికారు, కారులో ఉన్న అతడి భార్య నాగమణి మెడపై కూడా దుండగులు నరికారు. ఈ హత్య జరుగుతున్నప్పుడు రెండు ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే నిలిచిపోయాయి.....
Coronavirus Updates: దేశంలో రెండు కొత్త కరోనా స్ట్రెయిన్లు, కలవరపెడుతున్న యూకే వేరియంట్, ఒకే బిల్డింగ్‌లో 100 మందికి పైగా కోవిడ్, దేశంలో తాజాగా 11, 610 కేసులు, ఏపీలో 60 కొత్త కేసులు
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 11,610 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,833 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కు (Coronavirus Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
#HappyBirthdayKCR: సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు, కోటి మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ జీవితంలో ప్రముఖ ఘట్టాలను ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు పుట్టినరోజును (Telangana CM KCR Birthday) జరుపుకుంటున్నారు.ఆయన పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇవాళ‌ జాతీయ స్థాయి నేత‌ల నుంచి, రాష్ట్ర స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.
Covid in India: ముంబైలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, దేశంలో తాజాగా 9,121 మందికి కరోనా నిర్ధారణ, ఏపీలో 30 మందికి పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదు
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది.
Car Plunges into Canal in Jagtial: జగిత్యాలలో తీవ్ర విషాదం, ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు, కుటుంబంలో ముగ్గురు మృతి, ఒకరు సురక్షితంగా బయటకు, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyజగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద ఓ కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి (Car Plunges into Canal in Jagtial) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. వారిని కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. ఈ ఫ్యామిలీ జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Jagtial)TRS MLA Sanjay Kumar) సమీప బంధువులని తెలుస్తోంది.
India Covid Updates: మహారాష్ట్రను మళ్లీ వణికిస్తున్న కరోనా, తాజాగా 4 వేల కరోనా కేసులు, ఒకే రోజు 40 మంది మృతి, దేశంలో తాజాగా 11,649 మందికి కోవిడ్, తెలంగాణలో తాజాగా 99 కొత్త కేసులు, ఏపీలో 55 మందికి పాజిటివ్
Hazarath Reddyదేశంలో దేశంలో గత 24 గంటల్లో 11,649 మందికి కరోనా నిర్ధారణ (India Covid Updates) అయింది. అదే స‌మ‌యంలో 9,489 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరింది.
Covid Updates: కరోనా వ్యాక్సిన్ పనిచేయడం లేదా...తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు డాక్టర్లకు కరోనా, దేశంలో తాజాగా 12,194 కేసులు, ఏపీలో 54 మందికి కరోనా పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు, కరోనా పేషెంట్ల డేటా ఇచ్చేందుకు నిరాకరించిన చైనా
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 12,194 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus) అయింది. అదే స‌మ‌యంలో 11,106 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 92 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
MP Asaduddin Owaisi: హైదరాబాద్‌‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నం, లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు రెడీగా ఉండాలని సూచన
Hazarath Reddyహైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మోదీ సర్కారు యత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Hyderabad MP Asaduddin Owaisi) అన్నారు.
Robbers Attack: తెలుగువారిపై మహారాష్ట్రలో దొంగలు దాడి, షిర్డీ నుంచి వస్తుండగా కత్తులతో అడ్డగించిన దొంగల గుంపు, 8 తులాల బంగారం అపహరణ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
Hazarath Reddyమహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ వికారాబాద్ బండవేలికిచర్లకు చెందిన కుటుంబం పై వాసీలో దొంగలు దాడి (Robbers Attack) చేశారు. విచక్షణ రహితంగా చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా కత్తులతో దాడికి పాల్పడ్డారు.