తెలంగాణ

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

VNS

దేశవ్యాప్తంగా హోలీ పండుగ (Holi festival) ను ఘనంగా జరుపుకుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఎంతో సంతోషంగా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శాఖ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Telangana Weather Alert: తెలంగాణ ప్రజలకు కూల్‌న్యూస్‌, రాబోయే రెండు రోజుల పాటూ తగ్గనున్న ఎండల తీవ్రత

VNS

భానుడి ప్రతాపానికి అతలాకుతలమ‌వుతున్న ప్రజలకు వాతావరణ నిపుణులు చల్లటి కబురు చెప్పారు. రాబోయే 48 గంటలు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో టెంపరేచర్‌ తక్కువ స్థాయిలో నమోదు అవుతుందన్నారు

Korutla SI Shankaraiah: పేకాటలో పట్టుబడ్డ వారి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన కోరుట్ల ఎస్సై శంకరయ్య

Hazarath Reddy

జగిత్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కోరుట్ల ఎస్సై శంకరయ్య. ఓ వ్యక్తి నుంచి కేసు రాజీ కోసం 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి. పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని తెలపడంతో 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు

Hyderabad: వీడియో ఇదిగో, ప్రియురాలితో ఆ పనిలో ఉండగా భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య, మహిళను చితకబాదుతుండగా భర్త గోడదూకి పరార్

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుని భార్య చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను (Wife Catches Husband Red-handed With Lover) భార్య చితబాదగా.. భార్యను చూసి గోడ దూకి పారిపోయిన భర్త వీడియోలు వైరల్ అవుతున్నాయి

Advertisement

Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. శిరీషను భర్త, ఆమె ఆడపడుచు (భర్త సోదరి) స్వాతి కలిసి హత్య (Hyderabad Woman Murder Case) చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

Nude Call To Telangana MLA: తెలంగాణ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్.. ఫోన్ ఎత్తడంతో రికార్డు, డబ్బులు పంపాలని డిమాండ్, పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు

Arun Charagonda

తెలంగాణ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు.

Telangana Cabinet Meet: మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఏపీతో నీటి వివాదం,బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం!

Arun Charagonda

మార్చి 6న(గురువారం) తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.

Telangana Inter Exams: నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

Arun Charagonda

నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు

Advertisement

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Hazarath Reddy

కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసు జారీ చేసింది,

Newlywed Dies by Suicide: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అయినా అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

హైదరాబాద్‌లో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం PS పరిధిలో దేవిక ( 35) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. 6 నెలల క్రితమే గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్న దేవిక, సతీష్. ప్రస్తుతం ఖాజాగుడా ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు దంపతులు

Blast Caught on Camera: వీడియో ఇదిగో, కూకట్పల్లిలో భారీ పేలుడు, ఒకరికి తీవ్ర గాయాలు, సిలిండర్ లోకి అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని ఓ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విరాలిలాఉన్నాయి.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ లోని ఓ గ్యాస్ సర్వీస్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలిడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad Fire: వీడియో ఇదిగో, అంబర్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కింద నిర్మాణ సామగ్రి ఉన్న షెడ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పాటుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి

Advertisement

Telangana: వైస్ ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో స్కూలు విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసింది.

Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన

Rudra

పరీక్షల భయంతో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Viral Video: యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!

Rudra

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని రాయ్‌ బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు 15 మీటర్ల మేర ఎగిరి ఎదురుగా వస్తున్న ఆటో కిందపడ్డారు.

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Rudra

స్లీపర్‌, ఏసీ బోగీల్లో ప్రయాణం కోసం బెర్త్‌ రిజర్వు చేసుకున్నారు. అయితే అది కన్ఫాం కాలేదు. దీంతో మీరు వెయిటింగ్‌ లిస్ట్‌ లో ఉన్నారు. ప్రయాణ సమయం ముంచుకొచ్చింది.

Advertisement

Telangana Inter Exams: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత.. పేపర్ లీకైతే ఏ విద్యార్థి ద్వారా లీకైందో తెలుసుకునేలా సీరియల్ నంబర్

Rudra

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నది.

Telangana Teacher's MLC Elections: ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్, నల్గొండ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుంచి మల్క కొమురయ్య విజయం

Hazarath Reddy

నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ సన్నిహితుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.

Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.శిరీషది సహజ మరణం కాదని పోస్టుమారం నివేదిక ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఊపిరాడకుండా చేసి హత్య (Hyderabad Woman Murder Case) చేసినట్లుగా పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.

Man Injured in Wild Boar Attack: వ్యక్తిపై పగబట్టిన అడవి పంది, వెంబడించి మరీ దాడి చేసిన వీడియో వైరల్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన

Hazarath Reddy

మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన జరిగింది. శనివారం అకస్మాత్తుగా పట్టణంలోని ఓ గాజుల దుకాణంలోకి అడవిపంది చొరబడింది.

Advertisement
Advertisement