తెలంగాణ

Harish Rao Slams Congress: దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఘనత కేసీఆర్‌దే, కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటుందని హరీష్ రావు విమర్శలు

Hazarath Reddy

24 గంటల పాటు కరెంట్‌ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు.

Bandi Sanjay on 2028 Telangana Elections: తెలంగాణలో 2028లో ఎగిరేది బీజేపీ జెండానే, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. యూఎస్‌కు చెందిన ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఎన్‌ఆర్‌ఐ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వర్చువల్ గా సమావేశమయ్యారు.

YouTuber Harsha Sai: బెయిల్ రావడంతో విదేశాల నుంచి హైదరాబద్‌కు వచ్చిన యూట్యూబర్ హర్ష సాయి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యక్షమైన వీడియో ఇదిగో..

Hazarath Reddy

గతకొన్నాళ్లుగా విదేశాలలో ఉన్న హర్ష సాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు యూట్యూబర్ హర్ష సాయి.

TS TET Notification 2024: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల,2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు, నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ

Hazarath Reddy

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న సంగతి విదితమే.

Advertisement

Medak Horror: వీడియో ఇదిగో, ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి తెగబడిన ప్రేమోన్మాది, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో బాధితురాలు

Hazarath Reddy

మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు.

Telangana Road Accident: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న బస్సును వెనక నుండి ఢీకొట్టిన మరో బస్సు, 30 మందికి గాయాలు

Hazarath Reddy

కోదాడ సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్‌ 2) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి.

Hyderabad: మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చిన ఘటనలో నలుగురు మైనర్లు అరెస్ట్, గతంలో కూడా ఈ రకమైన వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మైనర్లు

Hazarath Reddy

కొందరు ఆకతాయిలు మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చి హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రస్తుతం వారు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు.

Telangana: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

నాగర్ కర్నూల్ - బిజినేపల్లి మండలంలో నందివడ్డేమాన్‌కు చెందిన తిరుపతయ్య (60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లాడు.. ఈ క్రమంలో లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి బజ్జీల బండి వద్ద కోడిగుడ్డు కొనుక్కొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది.

Advertisement

Hyderabad Metro Rail: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో ఎక్కడికక్కడే ఆగిపోయిన మెట్రో రైళ్లు, సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపిన అధికారులు

Hazarath Reddy

ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. అరగంట పాటు మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్‌, రాయదుర్గం, మియాపూర్‌, ఎల్బీనగర్‌ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. బేగంపేట మెట్రో స్టేషన్‌ లో 15 నిమిషాలుగా మెట్రో ట్రైన్‌ నిలిపివేశారు అధికారులు.

Lady Aghori Naga Sadhu in AP: ఆత్మార్పణ అంటూ తెలంగాణలో హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షం.. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ (వీడియో)

Rudra

ఆత్మార్పణ అంటూ తెలంగాణలో గత కొన్నిరోజులుగా హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షమైంది. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ కారును స్థానికులు వెంబడించారు.

QR Code: క్యూఆర్ కోడ్ తో కాకతీయుల చరిత్ర.. చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకే..!

Rudra

వరంగల్ లోని చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తు శాఖ అధికారులు వినూత్న పద్దతిని తీసుకొచ్చారు. ఈ మేరకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు.

Disqualification Petition of BRS MLAs Today: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ పై నేడు హైకోర్టులో విచారణ.. పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించనున్న కేఏ పాల్

Rudra

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిల్ దాఖలైంది.

Advertisement

Rush in Temples: నేడు కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. భక్తుల విశేష పూజలు.. (వీడియో)

Rudra

హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు భక్తులు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు.

TET Day Today: టెట్ కు సంబంధించి నేడు రెండు కీలక పరిణామాలు.. మరికాసేపట్లో ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఇక, నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Rudra

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్) కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు నేడు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదలకానున్నాయి.

Telangana: ఇందిరమ్మ రాజ్యంలో జాతిపితకు ఘోర అవమానం, మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చిన దుండుగులు, వీడియో ఇదిగో..

Vikas M

సికింద్రాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతిపిత మహాత్మా గాంధీని ఆకతాయిలు అవమానించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో గాంధీ విగ్రహం నోట్లో బాంబులు పెట్టి పేల్చిన ఆకతాయిలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Hyderabad Dog Attack: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో రెండున్నరేళ్ల బాలుడి వీదికుక్కలు దాడి, నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు

Vikas M

అల్లాపూర్‌లోని రాణాప్రతాప్‌నగర్‌లో వీధికుక్కలు దాడి చేయడంతో రెండున్నరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిసిటివి ఫుటేజ్ ఆందోళనకరమైన సంఘటనను బంధించింది, రెండు కుక్కలు సమీపించినప్పుడు పిల్లవాడు తన ఇంటి వెలుపల ఆడుకుంటున్నట్లు చూపిస్తుంది, తరువాత ఒక నల్ల కుక్క అతనిపైకి దూసుకెళ్లి వీధిలోకి లాగింది.

Advertisement

Low Pressure in Bay Of Bengal: బంగాళాఖాతంలో మ‌రోసారి అల్ప‌పీడనం, ఈ నెల 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు

VNS

ఇప్పటికే దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Bhatti Vikramarka Bus Yatra: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బస్సుయాత్ర, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్న బస్సు యాత్ర, ప్రభుత్వ పనితీరు తెలుసుకోనున్న భట్టి

Arun Charagonda

త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర చేపట్టనున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణాలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర సాగనుంది.

Warangal: డాక్టర్ల నిర్లక్ష్యం...శిశువు మృతి, భూపాలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన..వీడియో ఇదిగో

Arun Charagonda

భూపాలపల్లిలో PHCలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో సోమవారం అడ్మిట్ అయింది.

Telangana: చికెన్ ఫ్రైలో పురుగు, స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాద్ యువకుడు, షాక్‌తో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు

Arun Charagonda

హైదరాబాద్ - హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి అనిరుధ్ అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా పురుగు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జీహెచ్ఏంసీకి ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement