తెలంగాణ

Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, మూసీ నది పునరుజ్జీవంపై ప్రధాన చర్చ ..మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయంపై రానున్న క్లారిటీ

Arun Charagonda

తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మూసీ నది పునర్జీవనం ప్రాజెక్టుపై మంత్రివర్గంలో చర్చ, పునరావాసితులకు సంపూర్ణంగా ప్రభుత్వం సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు.

Gussadi Kanakaraju Official last rites by TG Govt.: గుస్సాడీ కనకరాజు మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం

Rudra

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Copying In Group 1 Exam: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్.. చీర కొంగులో చిట్టీలతో పాటు చేతి మీద కొన్ని జవాబులు రాసుకొనివచ్చిన మహిళా అభ్యర్థి.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు

Rudra

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు.

Samantha On Second Marriage: రెండో పెండ్లి గురించి నటి స‌మంత సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

Rudra

స్టార్ హీరోయిన్ స‌మంత.. నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళ‌తో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు.

Advertisement

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టు రద్దు

Rudra

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది.

Viral Video: మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ భీభత్సం.. వీడియో వైరల్

Rudra

మహబూబాబాద్ జిల్లాలో ఓ మందుబాబు హల్ చల్ సృష్టించాడు. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో ఓ గుర్తు తెలియని భీభత్సం సృష్టించాడు.

Gussadi Kankaraju Died: గుస్సాడీ క‌ళాకారుడు క‌న‌క‌రాజు క‌న్నుమూత‌, ఆదివాసీల నృత్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గొప్ప క‌ళాక‌రుడు, రేపు స్వ‌గ్రామంలో అంత్య‌క్రియ‌లు

VNS

తెలంగాణ కళాకారుడు, గుస్సాడీ నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు (Kanakaraju) కన్నుమూశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన ఆయన 70 ఏండ్ల వయసులో అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. రేపు మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు

Diwali 2024 School Holidays: స్కూళ్ల‌కు దీపావ‌ళి సెల‌వులు ఖ‌రారు, ఉత్త‌ర భార‌త్ లో హాలిడేస్ అలా? ద‌క్షిణాదిన ఇలా? దీపావ‌ళి, భాయ్ దూజ్, గోవ‌ర్ధ‌న్ పూజ‌ల పూర్తి సెల‌వుల వివ‌రాలివిగో..

VNS

దీపావళి పండుగ దగ్గరపడుతోంది. ప్రతి పండుగలాగే దీపావళి పండుగ (Diwali 2024) సందర్భంగా కూడా పండుగ సెలవులను ప్రకటిస్తారు. దీపాల పండుగను (Diwali Holiday) పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు వచ్చే వారం నుంచి మూతపడనున్నాయి.

Advertisement

Battalion Constables Leave Manual: బెటాలియ‌న్ కానిస్టేబుల్ కుటుంబాల‌కు గుడ్ న్యూస్, ఆందోళ‌న‌ల‌తో దిగి వ‌చ్చిన ప్ర‌భుత్వం

VNS

బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల (Constables Families) పోరాటం ఫలించింది. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు స్పెషల్‌ అదనపు డీజీపీ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సెలవుల విషయంలో తెలంగాణ బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు (Battalion Constables) ఊరట లభించింది.

KTR: మంచి మనసు చాటుకున్న కేటీఆర్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Arun Charagonda

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్‌కు పంపి మంచి మనసు చాటుకున్నారు కేటీఆర్. సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యలో జిల్లెల్ల వద్ద ఓ యాక్సిడెంట్‌లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కేటీఆర్‌ అంబులెన్స్ వచ్చే వరకు సమయం పడుతుందని, తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

BRS MLA Sanjay Kumar: రాజకీయ వ్యభిచారిగా మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రైతు పక్షపాతి జీవన్‌రెడ్డిపై కక్ష సాధింపు సరికాదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Arun Charagonda

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మండిపడ్డ కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ వ్యభిచారిగా మారారు అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకొని ఇప్పుడు తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు అనడం చూస్తుంటే నేను విడాకులు ఇవ్వలేదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అన్నట్టుగా ఉందన్నారు.

KTR On Electricity Charges Hike: పదినెలలకే కరెంట్ ఛార్జీల పెంపా?, డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించాలని కేటీఆర్ డిమాండ్, విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజల్లోనే ఎండగడతాం అని వెల్లడి

Arun Charagonda

విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నాం....పారిశ్రామిక వేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి ఉండేదన్నారు. మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి నెలకొందన్నారు.

Advertisement

Lizard At Beer Bottle:  బీరు తాగుతున్నారా అయితే జాగ్రత్త..బీరు బాటిల్‌లో బల్లి అవశేషాలు..వికారాబాద్‌లో షాకింగ్ ఘటన, వైన్స్ షాపు నిర్వాహకులతో గొడవకు దిగిన బాధితుడు!

Arun Charagonda

బీరు సీసాలో బల్లి అవశేషాలు కనిపించడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా ధారూరులో స్థానిక విజయదుర్గా వైన్ షాపులో రూ.4వేల విలువైన మద్యం కొనుగోలు చేశారు ఎం.లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య. బడ్వైజర్ బీరు సీసాలో బల్లి అవశేషాలు ఉన్నట్లు గుర్తించి వైన్స్ షాపు నిర్వాహకులను సంప్రదించగా నిర్వాహకులు తమకు ఏం సంబంధం లేదని బదులివ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Telangana Constable Wifes Protest: సచివాలయం ముట్టడికి కానిస్టేబుళ్ల భార్యల ప్రయత్నం, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు...వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి వచ్చారు బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మా కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోవాలని...ఒకే దగ్గర డ్యూటీ ఇస్తే చేసుకుంటారు కానీ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజుల డ్యూటీ చేయడం వలన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్లడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కానిస్టేబుళ్ల భార్యలు.

Defamation Case: కొండా సురేఖకు మొట్టికాయలు వేసిన కోర్టు, కేటీఆర్‌ పై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలు తొలగించాలని ఆదేశం

Arun Charagonda

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది కోర్టు. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడింది. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కొండా సురేఖ తన సామాజిక మాధ్యమాల్లో నుండి వెంటనే తొలగించాలని పేర్కొంది కోర్టు. అన్ని రకాల ప్లాట్‌ఫారమ్‌ల నుండి అన్ని మీడియా సంస్థలు తొలగించాలని ఆదేశించింది కోర్టు.

Telangana: సద్దిబువ్వ వద్దన్నందుకు తండ్రిని చితకబాదిన కొడుకు, కోడళ్లు...జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి

Arun Charagonda

సద్దిబువ్వ వద్దు అన్నందుకు తండ్రిని చితకబాదారు కొడుకు, కోడళ్లు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామానికి చెందిన గుర్రంబండి కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు. గుర్రంబండి నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో తన ఇంట్లోనే జీవనం చేస్తూ కొడుకుల దగ్గరే ఉంటున్నాడు. సద్ది అన్నం మెత్తగా ఉంది అని చెప్పడంతో కొడుకు, కోడళ్లు చికతబాదారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి.

Advertisement

Techie Suicide in Hyderabad: పని ఒత్తిడి తాళలేక, చేసిన అప్పులు తీర్చలేక సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన

Rudra

పని ఒత్తిడి తాళలేక ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ ఏడు అంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నగరంలోని కోకాపేటలో ఈ విషాదం చోటుచేసుకున్నది.

Kidnapper Rampage in Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌ లో బాలుడి కిడ్నాప్‌ కు య‌త్నం.. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌ లో బాలుడి కిడ్నాప్‌ య‌త్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హైదర్‌ గూడలో ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఓ యువకుడు యత్నించాడని స్థానికులు ఆరోపించారు.

Fire Accident in Tupran: మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)

Rudra

మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో ఈ తెల్లవారుజామున ఓ కారు షెడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

KTR: రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, చిట్టినాయుడు రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదన్న కేటీఆర్, రాష్ట్రంలో హౌలా సీఎం ఉన్నాడని ఆగ్రహం

Arun Charagonda

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే పనులు అక్కడ ఆగిపోయినయ్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్‌లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్... ఆదిలాబాద్‌కు వచ్చేటప్పుడు డిచ్‌పల్లి దగ్గర పోలీసుల భార్యలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల కుటుంబాలను పోలీసులే గుంజుకుపోయే పరిస్థితి ఉంది...ఇక్కడికు వస్తుంటే ఉట్నూరులో పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని జోగు రామన్న చెప్పారు అన్నారు.

Advertisement
Advertisement