Technology

WhatsApp Text Bomb: వాట్స్‌యాప్‌లోకి భయంకరమైన వైరస్, యూజర్లకి టెక్ట్స్ బాంబ్ సందేశాలు, ఓపెన్ చేస్తే ఫోన్ క్రాష్, అలర్ట్‌గా ఉండాలని సూచించిన వాబీటా ఇన్ఫో

Hazarath Reddy

ప్రపంచంలో అత్యంత పాపులర్ మెసేంజిగ్ యాప్ వాట్స్‌యాప్ హ్యాకింగ్ (WhatsApp crash) భారీన చిక్కుకుంది. దీనిపై బ్రెజిల్ హ్యాకర్లు దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. టెక్ట్స్ బాంబ్ గా పిలిచే స్కేరీ మెసేజ్‌ వైరస్ వాట్సాప్ నెట్ వర్క్ మీద దాడి (new text bomb) చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో తెలిపింది. ఆగస్టు మధ్యలో ఈ వైరస్ మొదలైందని ఇప్పుడు ప్రపంచదేశాలకు ఇది విస్తరించిందని వాబీటా ఇన్ఫో తెలిపింది. కొద్ది రోజుల క్రితం వాట్స్‌యాప్‌ ఓఎస్ ఆండ్రాయిడ్ ఫ్లాట్ పాం మీద కొత్త ఫీచర్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో యూజర్లు చెప్పాలని వాబీటా ఇన్ఫో కోరింది.

Reliance Retail: రిల‌య‌న్స్‌లోకి వెల్లువలా పెట్టుబడులు, తాజాగా రూ.7500 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు తెలిపిన సిల్వర్ లేక్, ఇప్పటికే జియోలో 1.35 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టుబడి పెట్టిన అమెరికా దిగ్గజం

Hazarath Reddy

అమెరికాకు చెందిన సిల్వ‌ర్ లేక్ సంస్థ రిల‌య‌న్స్ రిటేల్ వెంచ‌ర్స్‌లో రూ.7500 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ఇవా‌ళ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సంస్థ పేర్కొన్న‌ది. ఆ పెట్టుబ‌డితో ఆర్ఆర్‌వీఎల్‌లో సిల్వ‌ర్ లేక్ సుమారు 1.75 శాతం వాటాను సొంతం (Reliance Retail Ventures Sells 1.75% Stake to Silver Lake) చేసుకుంది. రిల‌య‌న్స్ సంస్థ‌లో సిల్వ‌ర్ లేక్ .. బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డి పెట్ట‌డం ఇది రెండ‌వ సారి.

PUBG Ban: టెన్సెంట్ గేమ్స్ తో సంబంధాలను తెంచుకున్న పబ్‌జీ కార్పొరేషన్, భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పబ్‌జీ మొబైల్ గేమ్ ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ (PUBG Ban) మొబైల్ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంతో పాటు దేశంలో డేటా భద్రత కోసం భారత ప్రభుత్వం చైనా యాప్స్ ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక పబ్‌జీలో బాగా పాపులర్ అయిన బ్యాటిల్ రాయల్ గేమ్ అనేది సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ. అయితే పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ (Tencent Games) ప్రమోట్ చేస్తోంది. ఇక ఇండియాలో పబ్‌జీ మొబైల్ వర్షన్ రిలీజ్ చేసింది కూడా టెన్సెంట్ గేమ్స్ కంపెనీనే.

Chandrayaan-3: చంద్ర‌యాన్-3 మిష‌న్‌ రెడీ, వ‌చ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగం, చంద్ర‌యాన్-2కి భిన్నంగా చంద్ర‌యాన్‌-3, ఆర్బిట‌ర్ లేకుండానే చందమామ మీదకు, వెల్లడించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Hazarath Reddy

చందమామను జల్లెడ పట్టేందుకు చంద్ర‌యాన్-3 మిష‌న్‌ రెడీ (Chandrayaan-3) అవుతోంది. చ‌ంద్రుడిపైకి చంద్ర‌యాన్-3 మిష‌న్‌ను వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే ప్ర‌యోగించ‌నున్న‌ట్లు భార‌త అంత‌రిక్ష శాఖ‌కు చెందిన స‌హాయ‌మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh) తెలిపారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌యాన్-2తో పోలిస్తే చంద్ర‌యాన్‌-3 భిన్నంగా ఉంటుంద‌న్నారు. చంద్ర‌యాన్‌-3లో ఆర్బిట‌ర్ (Will Not Have Orbiter) ఉండ‌ద‌న్నారు. అయితే ఆ ప్రాజెక్టులో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ ఉన్నాయ‌న్నారు.

Advertisement

Airtel Xstream Fiber Plans: ఎయిర్‌టెల్ నుంచి భారీ ఆఫర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ప్యాకేజీలను ప్రకటించిన మెబైల్ సేవల దిగ్గజం, సెప్టెంబరు 7 నుంచి అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రముఖ టెలికం కంపెనీ దిగ్గజం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను (Airtel Xstream Fiber Plans) ఆదివారం విడుదల చేసింది. సెప్టెంబరు 7 నుంచి వినియోగదారులకు ఈ ప్యాక్‌లు (Airtel customers broadband plans) అందుబాటులోకి వస్తాయి. దీనిలో భాగంగా రూ.499కే అన్‌లిమిటెడ్ డేటా, టీవీ ఛానెళ్లు, ఓటీటీ యాప్స్ అన్నింటినీ ఇస్తోంది. ఈ బండిల్ ఆఫర్‌లో 550టీవీ ఛానెళ్లు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

Vodafone Idea Brands Now ’VI‘: జియోకు సవాల్, రూ. వొడాఫోన్ ఐడియాలోకి త్వరలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, వీఐ పేరిట సరికొత్త లోగోను విడుదల చేసిన మొబైల్‌ సేవల దిగ్గజం

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న మొబైల్‌ సేవల దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా వీఐ పేరుతో కొత్త వైర్‌లెస్‌ సర్వీసుల బ్రాండును (Vodafone Idea Rebrands) ప్రవేశపెట్టడంతోపాటు.. సరికొత్త లోగోను (Vodafone Idea Now VI) సైతం ఆవిష్కరించింది. తద్వారా డిజిటల్‌ సేవలలో (digital experience) భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియోలకు ధీటైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐడియాతో విలీనం తదుపరి పలు సర్కిళ్లలో సేవలను సమీకృతం చేశాక రెండేళ్లకు సరికొత్త వ్యూహాలను వొడాఫోన్‌ ప్రకటించడం గమనార్హం!

Airtel Unlimited Data Offer: ఎయిర్‌టెల్‌ అపరిమిత డేటా ఆఫర్‌, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు డేటా పరిమితిని తొలగించనున్న కంపెనీ, జియోతో పోటీలో భాగంగా నిర్ణయం

Hazarath Reddy

ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు కంపెనీ శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు (Airtel broadband Plans) అయిన బేసిక్, ఎంటర్‌‌టైన్‌మెంట్, ప్రీమియం, తదితర వాటికి ఇప్పటివరకు ఉన్న డేటా పరిమితిని తొలగించనుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్‌ (Airtel Unlimited Data Offer) ఇవ్వనుంది. అయితే తమ ఖాతాదారులు జియోకు (JioFiber) మారకుండా ఉండే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొబైల్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PUBG Banned in India: పబ్జీ ఇండియా నుంచి అవుట్, భద్రతా కారణాలతో పబ్జీ గేమ్‌తో సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం, పబ్‌జీకి ఇండియాలో 50 మిలియన్ల మందికి పైగా యూజర్లు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్‌ను నిషేధించింది. వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం (118 Chinese Mobile Apps Banned) విధిస్తున్నట్టు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ (Ministry of Electronics and Information Technology) నిర్ణయం తీసుకుంది. గతంలో గల్వాన్‌ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరో భారీ దెబ్బ కొట్టింది.

Advertisement

Airtel Free Data Offer: ఎయిర్‌టెల్ 2 జిబి ఉచిత డేటా, రూ.10 లేస్ కొంటే చాలు, స్నాక్,కూల్ డ్రింక్ బ్రాండ్ పెప్సీకోతో డీల్ కుదుర్చుకున్న భారతి ఎయిర్‌టెల్

Hazarath Reddy

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్నాక్, కూల్ డ్రింక్ బ్రాండ్ పెప్సీకోతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఉచిత ఇంటర్నెట్ డేటాను (Airtel Free Data Offer) అందించేలా ఆఫర్లను ప్రకటించాలని నిర్ణయించింది. లేస్, కుర్ కురే, అంకుల్ చిప్స్ తదితర ప్యాక్ లను కొనుగోలు చేసే వారికి ఉచితంగా ఇంటర్నెట్ డేటాను (Airtel Lays Offer) అందించనున్నట్టు ప్రకటించింది. రూ. 10 ప్యాక్ తో 1 జీబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా (Airtel PepsiCo Offer) ఇస్తామని చెబుతోంది.

Illegal E-Ticket Booking Racket: ఐఆర్‌సీటీసీకి హ్యాకింగ్ సెగ, పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అక్రమంగా తత్కాల్ టికెట్లు బుకింగ్, అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

Hazarath Reddy

ఇండియన్ రైల్వే కి హ్యాకింగ్ సెగ తగిలింది. ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌ను హ్యాక్ చేసేందుకు (IRCTC Tatkal System Faces Hack) ఇల్లీగల్ ఆపరేటర్స్, హ్యాకర్స్ (Pakistani Hackers) ప్రయత్నిస్తున్నట్లుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-RPF గుర్తించింది. ఇందుకోసం వారు పాకిస్తానీ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇండియన్ రైల్వేస్‌తో పాటు, బ్యాంకు ఓటీపీలను బైపాస్ చేసి మరీ తత్కాల్ టికెట్లు బుక్ (Illegal E-Ticket Booking Racket) చేస్తున్నట్టు బయటపడింది.

Jio Fiber Plans Revamped: జియో కొత్త వ్యూహం, రూ. 399కే జియో ఫైబర్ ప్లాన్, ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ పేరిట కొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించిన జియో

Hazarath Reddy

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్‌కు (JioFiber) సంబంధించి కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం (new broadband plans) అవుతాయని తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్లు అమల్లోకి వస్తాయని జియో తెలిపింది. ఇందులో భాగంగా ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌' పేరిట సరికొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్టు రిలయన్స్‌ జియో (Reliance Jio) ప్రకటించింది. డాటా వినియోగం, వేగంపై ఎలాంటి పరిమితి లేకుండా నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం అవుతాయని జియో తెలిపింది.

Digital Transactions Row: పేమెంట్ దారులకు గుడ్ న్యూస్, భీమ్‌–యూపీఐ చెల్లింపు ఛార్జీలను వాపస్ చేయాలని బ్యాంకులకు సూచించిన సిబిడిటి, జనవరి 1, 2020 నుంచి అదనపు ఛార్జీల విధించకూడదని ఆదేశాలు

Hazarath Reddy

ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా జరిగే లావాదేవీలపై బ్యాంకులు ఎటువంటి అదనపు ఛార్జీలు (Extra charge) విధించలేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (SBDT) ఆదివారం (ఆగస్టు 30) తెలిపింది. కొత్త నియమం జనవరి 1, 2020 నుండి వర్తిస్తుంది. "... చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల చట్టం 2007 లోని సెక్షన్ 10 ఎ ఆధారంగా, MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్) తో సహా ఏదైనా ఛార్జ్ 2020 జనవరి 1 న లేదా తరువాత వర్తించదు. సూచించిన ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా చెల్లింపు జరుగుతుంది ”అని సిబిడిటి (Central Board of Direct Taxes (CBDT)) ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.

Advertisement

Reliance-Future Group Deal: రిలయన్స్ రూ.24,713 కోట్ల డీల్, ప్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలను సొంతం చేసుకున్న రిల్, ఈ–కామర్స్‌ రంగంలో పట్టు సాధించేందుకు కొత్త వ్యూహం

Hazarath Reddy

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన వ్యూహలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను ప్రపంచ వ్యాప్త దిగ్గజ కంపెనీగా దానిని తీసుకువెళుతున్నాడు. తాజాగా రిలయన్స్ కిషోర్‌ బియానీ (Kishor Biyani) ప్రమోట్‌ చేస్తున్న ప్యూచర్‌ గ్రూప్‌ను కొనుగోలు (Reliance-Future Group Deal) చేసినట్లు శనివారం రిలయన్స్‌ ప్రకటించింది. ప్యూచర్‌ గ్రూప్‌కు (Future Group) చెందిన వేర్‌హౌస్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్, రిటైల్ బిజినెస్ తదితర విభాగాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది.

TikTok-Triller Deal Rumors: దూసుకొస్తున్న అమెరికా గడువు, టిక్ టాక్‌పై కన్నేసిన మరో అమెరికా దిగ్గజం, 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో ట్రిల్లర్ సంప్రదింపు, అలాంటిదేమి లేదని తెలిపిన టిక్ టాక్

Hazarath Reddy

ఇండియాలో బ్యాన్ అయిన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ (TikTok) కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ (Triller) చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను (ByteDance) సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో (TikTok-Triller Deal) సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది.

Nokia Phones Launched: నోకియా నుంచి ఒకేసారి 4 కొత్త ఫోన్లు, నోకియా 5.3, నోకియా సీ3, నోకియా 150, నోకియా 125 ఫోన్లను లాంచ్ చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్, ధర,ఫీచర్లపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా భారత మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు (Nokia Phones Launched) విడుదల చేసింది బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, అలాగే ఎంట్రీ లెవల్ నోకియా సీ 3, దీంతో పాటు రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. కాగా 5.1కి కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.ఇందులో నోకియా సీ3ని ఇండియాలొ తొలిసారి లాంచ్ చేసింది.

Sunil Mittal: మొబైల్ యూజర్లకు భారీ షాక్, త్వరలో మోగనున్న మొబైల్ ఛార్జీల ధరలు, రాబోయే ఆరు నెలల్లో డేటా ధరలు పెరుగుతాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్

Hazarath Reddy

త్వరలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. రానున్న ఆరు నెలల్లో మొబైల్ చార్జీల ధరలు పెరగనున్నాయని (mobile services rate hike) టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ (Bharti Airtel chairman Sunil Mittal) సంకేతాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లో మొబైల్ చార్జీల మోత (mobile services prices) తప్పదని అంటున్నారు. తక్కువ డేటా ధరలతో టెలికాం పరిశ్రమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు.

Advertisement

Best Prepaid Plans: రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి

Hazarath Reddy

ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్-ఐడియా కస్టమర్లను నిలుపుకోవటానికి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్రణాళికలను (Best Prepaid Plans) అందిస్తున్నాయి. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారీ డేటా మరియు SMS లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ప్రతి ధర బ్రాకెట్‌లోని చాలా ప్లాన్‌లు ఇలాంటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్రణాళికలు డబుల్ డేటా, బండిల్ చేసిన అనువర్తనాలు, కాంప్లిమెంటరీ సేవలు మరియు మరిన్ని వంటి అదనపు ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి.

Jio Cricket Plans: జియో నుంచి రెండు సరికొత్త ప్లాన్లు, క్రికెట్ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితం, ఆఫర్లపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్‌లను (Jio Special Prepaid Recharge Plans) విడుదల చేసింది. ఐపీఎల్ 2020 సందర్భంగా క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. జియో క్రికెట్ ప్లాన్స్ (Jio Cricket Plans) పేరుతో రూ. 499 , రూ. 777 ప్యాక్ లను లాంచ్ చేసింది. 399 రూపాయల గల ప్లాన్‌లో విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది.

Jio Free Data offer: జియో 5 నెలల ఉచిత డేటా ఆఫర్, జియో టూ జియో ఉచిత కాల్స్, జియోఫై 4జీ వైర్‌లెస్‌ హాట్‌స్పాట్‌ కొనుగోలు దారులకు మాత్రమే

Hazarath Reddy

రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్‌ (Jio Bumper Offer) ప్రకటించింది. ఐదు నెలల పాటు ఉచిత 4జీ డేటా, జియో-జియో ఫ్రీ ఫోన్‌ కాల్స్‌ను (Jio to Jio free Calls) ఇస్తున్నట్లు ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌ లెస్‌ హాట్‌స్పాట్‌ కొనుగోలు దారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియోఫైని జియో స్టోర్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ కొనుగోలు చేయాలి. దీని ధర రూ.1,999గా ఉంది. అది కొన్న తరువాత జియోఫైకి సంబంధించిన ప్లాన్లలో ఏదో ఒక దానితో సిమ్‌ను యాక్టివేట్‌ చేయించుకోవాలి. ఒకసారి సిమ్‌ యాక్టివేట్‌ అయిన తరువాత దానిని జియోఫైలో (Jiofi) వేసి ఉపయోగించుకోవచ్చు. సిమ్‌ యాక్టివేట్‌ అయ్యిందో లేదో అన్న విషయాన్ని మై జియో యాప్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

TikTok-Reliance Jio Deal: రిలయన్స్ చేతికి టిక్ టాక్ ? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త, అధికారికంగా స్పందించేందుకు నిరాకరించిన రిలయన్స్ గ్రూపు

Hazarath Reddy

ఇండియాలో చైనాకు చెందిన బైట్ డాన్స్ అనుబంధ సోషల్ మీడియా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను (TikTok) నిషేధించిన తరువాత, ఆ సంస్థ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ (mukesh ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్) టిక్‌టాక్‌ను కోనుగోలు చేయనుందన్న అంచనా వార్త (TikTok-Reliance Jio Deal) ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement