టెక్నాలజీ

JIo Wireless Data: జియో మరో సంచలన నిర్ణయం, వైర్ లెస్ డేటా ఛార్జీల బాదుడుకు రెడీ, రూ.15 నుంచి రూ.20కి పెంచాలని ట్రాయ్‌కి లేఖ రాసిన రిలయన్స్ జియో

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) తన యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు వైర్ లెస్ డేటా (JIo Wireless Data) టారిఫ్‌లను పెంచాలని జియో (Jio) నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 15గా ఉన్న 1 జీబీ డేటా ధరను రూ. 20కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్‌కు జియో లేఖ రాసింది.

Vodafone Idea: ఒక జీబీ డేటాకి రూ.35 చెల్లించాల్సిందే, డాట్‌కు లేఖ రాసిన వొడాఫోన్‌ ఐడియా, టెలికాం శాఖకు రూ. 8 వేల కోట్లు చెల్లించిన భార‌తీ ఎయిర్‌టెల్‌

Hazarath Reddy

టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) సంచలన ప్రతిపాదనలు చేసింది. భారీ నష్టాలకు తోడు ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు (AGR dues) వివాదంతో మరింత కుదేలైన ఈ సంస్థ మొబైల్‌ డేటా, కాల్‌ చార్జీలపై కొన్ని సవరణలు చేయాలని కోరుతోంది. డేటా చార్జీలను కనీసం 7 రెట్లు , కాల్‌ చార్జీలను 8 రెట్లు పెంచాలని కోరుతోంది. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది.

Google Pay: రూ.3 వేలు పంపిస్తే లక్ష రూపాయలు అకౌంట్లో పడ్డాయి, గూగుల్ పే నుంచి లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు, ఊహించని నగదు చూసి షాక్ తిన్న అనంతపురం కుర్రాడు

Hazarath Reddy

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో (Google pay) ఎవరైనా డబ్బులు ట్రాన్సఫర్ చేస్తే రివార్డు (scratch card) కింద మనకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. అయితే అనంతపురంలోని ఓ యువకుడికి గూగుల్ పేలో జాక్ పాట్ తగిలింది. గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఆ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది.

Hyderabad Police: దేశంలో తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్‌పై క్రిమినల్ కేసులు, దేశానికి వ్యతిరేకంగా వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్, 153 (A) , 121 (A) ,294, 505, రెడ్ విత్ 156(3) కింద కేసులు నమోదు

Hazarath Reddy

దేశంలో తమ ప్లాట్‌ఫామ్‌లపై ద్వేషం, దేశ వ్యతిరేక విషయాలను వ్యాప్తి చేయడానికి వీలు కల్పించారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad police) మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter), ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp), చైనీస్ షార్ట్-వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ (TikTok) పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Sir John Tenniel: జాన్ టెన్నిఎల్ 200వ జయంతి నేడు, ఇలస్ట్రేటర్‌గా, వ్యంగ్య కళాకారుడుగా ఎన్నో విజయాలు, పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్‌ను రూపొందించిన గూగుల్

Hazarath Reddy

ఇలస్ట్రేటర్ మరియు వ్యంగ్య కళాకారుడు సర్ జాన్ టెన్నియల్ 200 వ జయంతిని (John Tenniel's 200th Birth Anniversary) సంధర్భంగా గూగుల్ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ (Google Doodle) రూపొందించింది. ఫిబ్రవరి 28, 1820 న లండన్లో జన్మించిన సర్ జాన్ టెన్నియల్ (John Tenniel) 1893 లో తన కళాత్మక విజయాల కోసం తన సమయాన్ని కేటాయించాడు. 20 సంవత్సరాల వయస్సులో, టెన్నియల్ ప్రమాదం కారణంగా కుడి కంటిలో దృష్టిని కోల్పోయాడు.

Amazon's Fab Phones Fest: భారీ తగ్గింపులతో అమెజాన్ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, అత్యంత తక్కువ ధరకే ఫోన్లను సొంతం చేసుకోండి, ఈ నెల 29 వరకు సేల్

Hazarath Reddy

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వైబ్‌సైట్లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను (Amazon's Fab Phones Fest) మళ్లీ ప్రారంభించింది. నేటి నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. ఇందులో భారీ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. అలాగే ఐసీఐసీఐ (ICICI), కోటక్‌ మహీంద్రా కార్డుల )Kotak Mahindra) ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

WhatsApp’s Hidden Feature: వాట్సాప్‌లో రహస్య ఫీచర్, మీ మెసేజ్ అవతలి వారు చూశారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు, ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

ఇక బ్లూటిక్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసిన వ్యక్తి మీ మెసేజ్‌ చదివాడో లేదో తెలుసుకోవాలంటే... మీరు చాటింగ్‌ చేస్తున్న వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినట్లైతే.. వారికి ఓ వాయిస్‌ మెసేజ్‌ చేయండి. ఆ వ్యక్తి మీ వాయిస్‌ రికార్డింగ్‌ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్‌ పడిపోతాయి. అతడు బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినప్పటికి వాయిస్‌ మెసేజ్‌ విన్నప్పుడు మాత్రం బ్లూటిక్స్‌ పడిపోతాయి. ఇది ఒకరకంగా వాట్సాప్‌లోని లోపమని చెప్పొచ్చు. గత సంవత్సరమే ఈ సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది.

Jio 336 Days Validity Plan: ఒక్కసారి రీఛార్జ్ చేయండి, 336 రోజుల పాటు అపరిమిత ప్రయోజనాలు పొందండి, పాత ప్లాన్ల ప్లేసులోకి కొత్త ప్లాన్ తీసుకువచ్చిన జియో

Hazarath Reddy

Advertisement

The Beast Car: భారత రోడ్లపై అమెరికా ప్రెసిడెంట్ కార్ రయ్ రయ్.. భద్రతలో బెస్ట్ అని చెప్పబడుతున్న 'ది బీస్ట్' కార్ ప్రత్యేకతలు, డొనాల్డ్ ట్రంప్ పర్యటన విశేషాలు తెలుసుకోండి

Vikas Manda

బీస్ట్ డ్రైవర్లకు యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ తో శిక్షణతో పాటు, అత్యవసర సమయాల్లో ప్రెసెడెంట్ ను కాపాడేందుకు అవసరమయ్యే శిక్షణలు కూడా ఇస్తారు. కారును 180 డిగ్రీలలో ఎలా తిప్పాలి అనేదానిపై శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు డ్రైవర్ ఆరోగ్యం, మానసిక స్థితిని పరీక్షించిన తర్వాతే డ్రైవింగ్ కు అనుమతించబడతారు.....

Google Station: పోర్న్ దెబ్బ, యూజర్లకి గూగుల్ షాక్, రైల్వే స్టేషన్లలో ఇకపై ఉచిత వైఫై దొరకదు, దేశ వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్

Hazarath Reddy

రైల్వే ప్రయాణికులకు గూగుల్ (Google) చేదు వార్తను అందించింది. రైల్వేస్టేషన్‌లలో (Railway Stations) ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పాట్నాలోని రైల్వే స్టేషన్లలో ఎక్కువమంది గూగుల్ ఉచిత వైఫై సర్వీసును పోర్న్ వీడియోలు (Free porn) చూడటానికి మాత్రమే వినియోగిస్తున్నారని RailTel రిపోర్ట్ చేసింది. యూట్యూబ్, వికీపిడియాలను ఫాలో చేస్తూ వాటినే ఆ వీడియోలనే ఎక్కువగా చూస్తున్నారని తెలిపింది. సర్వీసులకు బదులు దాన్ని వాడటంతో గూగుల్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవడంలో ఓ భాగమని చెప్పవచ్చు.

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు, ఫిబ్రవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్, డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు ధరలు

Hazarath Reddy

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkar) వినియోగదారులకు శుభవార్తను అందించింది. తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి ’మొబైల్స్ బొనాంజా’ సేల్‌ను (Flipkart Mobile Bonanza Sale) ప్రకటించింది. ఈ సేల్‌ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది.

How To Use Disha App: దిశ యాప్ ఎలా వాడాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుందా, పూర్తి వివరాలు మీ కోసం

Hazarath Reddy

హిళల భద్రత (Women Safety) కోసం ఏపీ ప్రభుత్వం (AP government) ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌పై (Disha App) ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొం‍దించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

Advertisement

Uber Money Tech Hub: ఏసియాలోనే తొలి 'ఉబెర్ మనీ' గ్లోబల్ టెక్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు, ఈ వేసవి నాటికి సేవలు ప్రారంభిస్తామని ప్రకటించిన సంస్థ

Vikas Manda

ఇండియాలో తొలి గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ఏసియా-పసిఫిక్ ప్రాంతంలోనే తొలి ఆఫీస్ కాబోతుంది. ఉబెర్ మనీ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ టీమ్స్ ఇప్పటివరకు శాన్ ఫ్రాన్సిస్కో, పాలో ఆల్టో, న్యూయార్క్ మరియు ఆమ్‌స్టర్‌డ్యాంలలో మాత్రమే ఉన్నాయి.....

Aadhar New Rule: ఆధార్‌లో బంధుత్వాలు కనిపించవు, కేవలం కేరాఫ్ మాత్రమే ఉంటుంది, సాఫ్ట్‌వేర్‌లో కొత్త అప్‌డేట్ తీసుకువచ్చే ఆలోచనలో కేంద్రం, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

ఆధార్ కార్డు (Aadhar Card) గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ఇప్పుడు బాగా ట్రోల్ అవుతోంది. ఈ కథనం ప్రకారం ఇకపై ఆధార్ కార్డులో బంధుత్వాలు (Relationship) ఉండవు. అవేమి ఆధార్ కార్డులో కనిపించవు. ఇంతకు ముందు ఆధార్ కార్డ్‌లో సనాఫ్ అనో, డాటర్ ఆఫ్ అనో, లేకుంటే వైఫ్ ఆఫ్ తండ్రి పేరో లేకుంటే భర్త పేరో ఉంటుంది కదా? ఇక మీదట అవేమి లేకుండా ఆ రిలేషన్ స్థానంలో కేరాఫ్ అని రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.

Coronavirus Vaccine: కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటంలో గొప్ప పురోగతి, ఘనత సాధించిన భారతీయ శాస్త్రవేత్త

Vikas Manda

గత వారం కరోనావైరస్ సోకిన వ్యక్తి రక్త నమూనాల నుంచి వైరస్ ను వేరుచేయగలిగారు, ప్రొఫెసర్ వాసన్ బృందం కరోనా వైరస్ పై అధ్యయనాలు చేయడాని ముందుగా అవసరమైన పరిమాణంలో ఈ వైరస్ ను పెంచింది. ఈ పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితంతో.....

PAN Card: సెకన్లలో పాన్ కార్డు మీ చేతికి, కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం, ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎటువంటి అప్లికేషన్ పూర్తి చేయనవసరం లేదు

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ బడ్జెట్లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. వీటిల్లో పాన్ కార్డుకు సంబంధించి మార్పులు కూడా ఉన్నాయి. బడ్జెట్లో చెప్పిన వివరాల ప్రకారం.. ఇకపై పాన్ కార్డు (PAN Card) లేని వారు తమ ఆధార్ కార్డు(Aadhaar card) చూపిస్తే చాలు. వెంటనే పాన్ కార్డు మంజూరు చేస్తారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

Jio 4G Signals In Tihar Jail: తీహార్ జైల్లో జియో దందా, జైలు లోపల జియో 4జీ సిగ్నల్స్ కంట్రోలింగ్ సాధ్యం కావడం లేదు, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన అధికారులు, కేసు విచారణ 28కి వాయిదా

Hazarath Reddy

టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. తీహార్ జైలులోని అధికారులకు ఝలక్ ఇచ్చినంత పనిచేసింది. తమ వద్ద ఉన్న సాంకేతికతో తీహార్‌ జైలు లోపల జియో 4జీ సిగ్నల్స్‌ను (Jio 4G signals) నిరోధించలేకపోతున్నామని అధికారులు ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) తెలిపారు.

Poco X2 Smartphone: అసాధారణ ఫీచర్లు, సాధారణ ధరలతో పోకో ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదల, ధరలు మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఈ ఫోన్ ధరల విషయానికి వస్తే ఇండియాలో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ పోకో ఎక్స్2 ధర రూ. 15.999/-, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999/- , 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19.999/- , ప్రారంభ ఆఫర్ కింద....

PhonePe New Feature: ఫోన్‌ పేలోకి కొత్త ఫీచర్, ఇకపై లావాదేవీలు మరింత సులువు, ఛాట్ చేస్తూనే డబ్బులు సెండ్ చేసుకోవచ్చు

Hazarath Reddy

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌ పే (PhonePe) తమ వినియోగదారుల కోసం కొత్త చాట్ ఫీచర్ (Chat Feature) ప్రవేశపెట్టింది. తమ ప్లాట్ ఫాంపై డిజిటల్ చెల్లింపులు జరిపే యూజర్ల కోసం ఫోన్‌పే ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటినుంచి నగదు రిక్వెస్ట్ చేయొచ్చు లేదా ఏ ఇతర మెసేజింగ్ యాప్ (Messaging App) అవసరం లేకుండానే పేమెంట్ ధ్రువీకరించవచ్చు.

Arvind Krishna To Lead IBM: ఐబీఎం సీఈఓగా మనోడే, ఐబీఎంని ముందుకు నడిపించనున్న అరవింద్‌ కృష్ణ, ఐబీఎం నూతన సీఈఓ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

Hazarath Reddy

ప్రపంచంలోని ప్రముఖ సంస్థల ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారత సంతతి వ్యక్తులు సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ),(Microsoft CEO Satya Nadella) సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ సీఈఓ),(Google and Alphabet CEO Sundar Pichai) అజయ్ బంగా (మాస్టర్ కార్డు సీఈఓ),(MasterCard CEO Ajay Banga) శంతను నారాయణన్ (అడోబ్ సీఈఓ)ల (Adobe CEO Shantanu Narayen) సరసన మరొక భారతీయుడు చేరారు. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారతీయుడు అరవింద్ కృష్ణ(57)ను(Arvind Krishna) డైరెక్టర్ల బృందం ఎంపిక చేసింది.

Advertisement
Advertisement