టెక్నాలజీ
Aadhaar Linking To Social Media: సోషల్ మీడియాకు ఆధార్ లింక్ అనుసంధానించే ఆలోచనేది లేదు, పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడి
Hazarath Reddyగత కొంత కాలంగా సోషల్ మీడియాకు ఆధార్ అనుసంధానం(Aadhaar Linking To Social Media) ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం (Central government) అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Minister Ravi Shankar Prasad) దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ( no plans to link Aadhaar with social media account) ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.
Reliance Jio Call Rates: జియో యూజర్లకు ముకేష్ అంబానీ ఝలక్, త్వరలోనే ఛార్జీల పెంపు, వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ బాటలోనే, పెరుగుదల ఎంతనేది సస్పెన్స్..
Hazarath Reddyముకేశ్‌ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ రిలయన్స్‌ జియో(Reliance Jio) త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్‌ ఫోన్‌ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని (Reliance Jio to raise prices) ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర టారిఫ్‌ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
Mobile Tariff Hike: వినియోగదారులకు షాకిచ్చిన టెల్కోలు, డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు పెంపు, ఇప్పటికే కాల్ రేట్లు వసూలు చేస్తున్న రిలయన్స్ జియో
Hazarath Reddyటెలికామ్ వినియోగదారులకు వోడాఫోన్-ఐడియా (Vodafone-Idea), ఎయిర్‌టెల్ (Airtel) సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. డిసెంబర్ 1 నుండి మొబైల్ సేవా రేట్లను పెంచనున్నామని (Mobile call, data to cost more) ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ టెలికాం కంపెనీలు మొబైల్ సర్వీసు రేట్లను డిసెంబర్ 1 నుంచి పెంచాలని నిర్ణయించాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Panason Eluga Ray 810: ఆకర్శణీయమైన ఫీచర్లతో పానసోనిక్ ఎలుగా రే 810 భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర రూ. 16,990/-, ఈ ఫోన్‌‌కు సంబంధించిన విశేషాలు
Vikas Manda16MP + 2MP డ్యూయల్ వెనక కెమెరా సెటప్ మరియు 16MP సెల్ఫీ కెమెరాతో పాటు రెండు వైపులా ఫ్లాష్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 6.2-అంగుళాల HD + (720 x 1500 పిక్సెల్స్) తో అంచుల వరకూ కనిపించే 'నాచ్' డిస్ల్పే....
Aadhaar Card: కేవైసీ నిబంధనల్లో మార్పులు చేసిన ప్రభుత్వం, వలసదారులకు ఊరట, ఇకపై వలసదారులు ఎక్కడినుంచైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు
Hazarath Reddyమీరు వలసదారులా.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే మీకోసం ప్రభుత్వం శుభవార్తను తీసుకువచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంతోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.
ISRO Chandrayaan-3: చంద్రయాన్-3 వచ్చేస్తోంది, ఈ సారి గురి తప్పదు, సాఫ్ట్ ల్యాడింగ్ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో, వచ్చే ఏడాది చివరలో ప్రయోగం ఉండే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయిన్-3ని నింగిలోకి పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాడింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. నాసా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొనలేకపోయారు.
IRCTC New Rule: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త, అమల్లోకి ఓటీపీ ఆధారిత టిక్కెట్‌ రద్దు విధానం, రీఫండ్ వివరాలు నేరుగా మీ మొబైల్‌‌కే, ఏజెంట్ల మోసాలకు ఇకపై అడ్డుకట్ట
Hazarath Reddyఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (Indian Railways and Indian Railways Catering And Tourism Corporation) ప్రయాణికులకు శుభవార్తను అందించింది. ఈ కొత్త విధానం ప్రకారం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఏజెంట్ల ద్వారా బుకింగ్‌ అయిన టిక్కెట్లను వివిధ కారణాలతో రద్దు చేసుకొన్నప్పుడు రీఫండ్‌ నగదు ఎంత అనేది ప్రయాణికుడికి తెలిసిపోతుంది.
TRAI MNP's New Rule: మొబైల్ వినియోగదారులకు శుభవార్త, ఎంఎన్‌పీ ఇకపై రెండు రొజుల్లోనే పూర్తి, డిసెంబర్ 16వ తేదీ నుంచి అమల్లోకి, ట్రాయ్ ప్రకటనలో వెల్లడి
Hazarath Reddyదేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ (TRAI) శుభవార్తను అందించింది. ఇకపై ఎంఎన్‌పీ( Mobile Number Portability) ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి వినియోగదారుడు తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతోంది.
Reliance Jio Good News: కేబుల్ కనెక్షన్ లేకుండా 150 ఛానళ్లు చూడొచ్చు, జియో సెటప్ బాక్స్‌లో ఆఫర్, జియో సెట్ టాప్ బాక్స్‌లో ప్రత్యేకంగా జియో టీవీ+ యాప్
Hazarath Reddyన వినియోగదారులకు సెట్ టాప్ బాక్సు(Jio Set-top Box)లను పంపిణీ చేయడం ప్రారంభించింది.ట్రయల్ పీరియడ్ ముగిసి జియో సర్వీసులకు నగదు చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి కంపెనీ సెట్ టాప్ బాక్సులను అందిస్తోంది.
AP Sand Online Booking Process: ఇకపై ఇసుక కొరత తీరినట్లే, ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో భారీగా నిల్వ, బుకింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyఏపీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక కొరత తీరినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం( AP GOVT) పలు చోట్ల ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వను ఉంచింది. విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంది.
Reliance Jio: యూజర్లకు జియో ఝలక్, రూ.149 ప్లాన్‌లో స్వల్ప మార్పులు, ఇకపై వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే, మిగతా ప్రయోజనాలు యథాతథం
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.149 ప్లాన్ బెనిఫిట్స్‌కు పలు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇకపై ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే 300 నిమిషాల జియో టు నాన్ జియో కాల్స్ వస్తాయి.
Nokia Smart TVs: నోకియా నుంచి స్మార్ట్‌టీవీలు,ఇండియాలో విడుదల చేయనున్న ఫ్లిప్‌కార్ట్, అదిరిపోయే ఫీచర్లతో ఇతర స్మార్ట్‌టీవీలకు పోటీ ఇవ్వనున్న నోకియా
Hazarath Reddyఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ( e-commerce major Flipkart) ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ నోకియా(Nokia)తో కలిసి త్వరలో స్మార్ట్‌టీవీలను తయారు చేసి ఇండియా(India)లో లాంచ్ చేయ‌నుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే నోకియాతో భాగస్వామ్యం అయింది.
Airtel RS.4 Lakh Insurance Plan: ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఎయిర్‌టెల్ బంపరాఫర్, రూ.599 ప్లాన్‌ మీద రూ.4 లక్షల బీమా సౌకర్యం, భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం, ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyభారతి ఎయిర్‌టెల్‌ (Airtel) తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల (prepaid plan Users) కోసం బంపర్‌ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్‌ (Rs 599 prepaid plan) రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(Bharti AXA Life Insurance)తో ఒప్పందం కుదుర్చుకుంది.
Tik Tok Smartphone: ఇండియాలో సెన్సేషనల్ వీడియో షేరింగ్ యాప్ 'టిక్ టాక్' ఓనర్ నుంచి స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaచెప్పుకోవాల్సింది, ఈ ఫోన్‌లోని లాక్ స్క్రీన్ స్వైప్ చేయగానే నేరుగా ఇన్ బిల్ట్ 'టిక్ టాక్' యాప్ ఓపెన్ అవుతుంది, సింగిల్ స్వైప్ తో యాప్ క్లోజ్ చేయవచ్చు, ఇందులో 48 మెగాపిక్సెల్ గల సోనీ IMX 586 సెన్సార్‌ కెమెరా ప్రధానమైనది....
Jio Discount Offers: జియో మరో బంపరాఫర్, పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.50 తగ్గింపు, రూ.444, రూ.555 ప్యాక్‌లపై మాత్రమే, కోడ్ వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఐయూసీ ఛార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత రీఛార్జ్ ప్యాక్ రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీఛార్జ్ కు 1.5 జిబి డేటాను అందిస్తున్న జియో దానికి అదనంగా ఐయూసీ ఛార్జీలను తీసుకుంటోంది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ ల పేరుతో రూ.444, రూ.555 ఆఫర్లను ప్రవేశపెట్టింది.
Jio Extends Diwali offer: రిలయన్స్ జియో శుభవార్త, రూ.699కే జియో ఫోన్ ఆఫర్ మరో నెల రోజులు పొడిగింపు, జియో ఫోన్ వాడేవారి కోసం ఆల్‌ ఇన్‌ వన్ మంత్లీ ప్లాన్స్
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా తన జియో ఫోన్‌ను రూ.1500కు కాకుండా కేవలం రూ.699కే సొంతం చేసుకునే ఆఫర్‌ను గతంలోనే జియో ప్రకటించగా. ఇప్పుడా ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు జియో తెలిపింది.
Call Ring TIme: 30 సెకన్ల పాటు కాల్ రింగ్ ఉండాలి, ల్యాండ్ లైన్ అయితే 60 సెకండ్లు, ట్రాయ్ తాజా నిర్ణయం, టెలికాం సంస్థల వార్ ముగిసినట్లే !
Hazarath Reddyగత కొంత కాలంగా మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ఫోన్‌‌కు చేసే ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది.
DEET App: ఉద్యోగ అణ్వేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్, డీఈఈటీ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం మరింత సులభం, మోసపూరిత ఉద్యోగ ప్రకటనల బారి నుంచీ రక్షణ
Vikas Mandaఉద్యోగార్థులు తమ స్మార్ట్ ఫోన్ లో DEET APP ను ఇన్ స్టాల్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాలి. ఏ సెక్టార్ లో ఉద్యోగాన్ని అణ్వేషిస్తున్నారు, గతంలో ఏమైనా ఎక్స్ పీరియన్స్ ఉందా, సాలరీ ఎంతవరకు ఆశిస్తున్నారు అనే ఆప్షన్స్...
Twitter Bans Political Campaigns: రాజకీయ ప్రచారాలను బ్యాన్ చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఎటువంటి యాడ్స్ కనపడవు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నిర్ణయం, వెల్లడించిన ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ
Hazarath Reddyసోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ట్విట్టర్ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.
WhatsApp Hacking: వాట్సప్ హ్యాకింగ్‌పై దిమ్మతిరిగే నిజాలు, ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా హ్యాకింగ్, బాధితుల్లో ప్రముఖ ఇండియా జర్నలిస్టులు, ఫిర్యాదు చేసిన వాట్సప్, ఆగ్రహం వ్యకం చేసిన భారత్
Hazarath Reddyభారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్‌’అనే స్పైవేర్‌ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ వాట్సప్‌ చేసిన ప్రకటన సంచలనం రేపింది.