టెక్నాలజీ

YouTube Down: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ సర్వర్ డౌన్, వీడియోలను అప్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు, ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ

Hazarath Reddy

యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడంలో చాలామంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ వీడియోలను ప్రాసెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటోంది

Oracle Layoffs: లేఆప్స్ ప్రకటించిన టెక్ దిగ్గజం ఒరాకిల్, 3,000 మందికి పైగా ఉద్యోగులను సెర్నర్‌ నుంచి తొలగించినట్లుగా వార్తలు

Hazarath Reddy

క్లౌడ్ మేజర్ ఒరాకిల్ 28.4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ రికార్డ్స్ సంస్థ సెర్నర్‌లో 3,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.

BT Layoffs: టెలికాం రంగంలో భారీ లేఆఫ్స్, 55 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ టెలికాం దిగ్గజం బీటీ గ్రూపు, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

ఖ‌ర్చులు త‌గ్గించే ఉద్దేశంతో బ్రిట‌న్‌కు చెందిన బీటీ గ్రూపు(BT Group) 55 వేల మంది ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న‌ది. 2030 వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగ‌నున్న‌ట్లు చెప్పింది. బ్రిటీష్ టెలికామ్స్ అండ్ టెలివిజ‌న్ గ్రూపు బీటీలో సుమారు 42 శాతం సిబ్బందిని త‌గ్గించ‌నున్నారు.

AI Hallucinates: విద్యార్థులు పరీక్షలు చూసి రాసారని అబద్దం చెప్పిన చాట్‌జీపీటీ, క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్‌, నిజం తెలుసుకుని తర్వాత క్షమాపణలు

Hazarath Reddy

టెక్సాస్‌ యూనివర్సిటీలో చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్‌ చేశాడో ప్రొఫెసర్‌. రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్‌ చేశాడు.

Advertisement

Instagram Down: యూజర్లకు చుక్కలు చూపిస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫీడ్ లోడ్‌ అవ్వదు, స్టోరీస్ కనిపించవు, ట్విట్లర్‌లో ఇన్‌స్టాను ఆటాడుకుంటున్న నెటిజన్లు

VNS

సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ మరోసారి యూజర్లను (Instagram Down) ఇబ్బంది పెడుతోంది. ఈ ఉదయం నుంచి కొన్ని దేశాల్లో ఇన్‌స్టా యూజర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇన్‌ స్టా ఓపెన్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తోంది. అంతేకాదు ఇన్ స్టాలో ఫీడ్ (Insta App Not Loading) కనిపించడం లేదు. అమెరికాలో ఈ సమస్య అధికంగా ఉంది.

Zepz Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆఫ్స్, 420 మంది ఉద్యోగులపై వేటు వేసిన ఫిన్‌టెక్ యునికార్న్ జెప్జ్

Hazarath Reddy

ఫిన్‌టెక్ యునికార్న్ జెప్జ్ 420 మంది ఉద్యోగులను లేదా 26 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రభావితమైన వారికి తెలియజేయడం ప్రారంభించిందని మీడియా నివేదించింది. NBC ప్రకారం, వెస్ట్రన్ యూనియన్ ప్రత్యర్థి అయిన లండన్ ఆధారిత మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ ప్రొవైడర్‌లో ఉద్యోగాల కోతలు ప్రధానంగా Zepz కస్టమర్ కేర్ మరియు ఇంజనీరింగ్ బృందాలపై ప్రభావం చూపుతాయి.

Which Smartphone Sundar Pichai Uses: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉపయోగించే ఫోన్ ఏంటో తెలుసా, ఓ సారి స్టోరీపై లుక్కుసుకోండి

Hazarath Reddy

గూగుల్ ప్రతి సంవత్సరం కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంది. అయితే కంపెనీ సీఈవో స్వయంగా వాటిని ఉపయోగిస్తారా? కొత్త ఇంటర్వ్యూలో, సుందర్ పిచాయ్ కొత్త పిక్సెల్ ఫోల్డ్‌ను స్వయంగా పరీక్షించినట్లు వెల్లడించారు.

Fraud WhatsApp Number Deactivation: స్పామ్ కాల్స్ వస్తున్న వాట్సాప్ నెంబర్లను బ్లాక్ చేసేందుకు వాట్సాప్ చర్యలు, కేంద్రం నోటీసులతో రంగంలోకి దిగిన మెటా

VNS

స్పామ్ వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ లకు చెక్ పెట్టేందుకు కేంద్రం చేసిన కృషి ఫలించింది. ఏదైనా నెంబర్ నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నట్లు గుర్తించి, దాన్ని రిపోర్ట్ చేస్తే వెంటనే ఆ నెంబర్ ను బ్లాక్ చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు మెటా అంగీకారం తెలిపినట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి.

Advertisement

Elon Musk On Indian Food: భారతీయ వంటకాలు సూపర్ అంటున్న ఎలాన్ మస్క్, ఇండియా వచ్చి ఇక్కడి వంటకాలను రుచి చూడండి అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్‌ సీఈవో (Twitter CEO) ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) భారతీయ వంటకాలకు ఫిదా అయ్యారు. డేనిఎల్‌ (Daniel) అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ భారతీయ వంటకాల గురించి ఓ పెస్టు పెట్టారు.

Vodafone Layoffs: లేఆఫ్స్ ప్రకటించిన టెలికాం దిగ్గజం వొడఫోన్, రాబోయే మూడేళ్లలో 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఈఓ డెల్లా

Hazarath Reddy

టెలికాం దిగ్గజం వోడాఫోన్ లే ఆఫ్స్ ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో 11,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్గరీటా డెల్లా ప్రకటించారు. ఇది కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలలో తక్కువ లేదా వృద్ధిని అంచనా వేయడం, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణమని కంపెనీ తెలిపింది.

Amazon Layoffs: అమెజాన్ లేఆఫ్స్, 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన ఈ కామర్స్ దిగ్గజం, 9,000 మంది తొలగింపు ప్రకటనలో భాగంగా నిర్ణయం

Hazarath Reddy

అమెజాన్ ఇండియా తన క్లౌడ్ డివిజన్ AWSతో పాటు పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ (PXT) లేదా HR మరియు సపోర్ట్ వర్టికల్స్ నుండి దాదాపు 400-500 మంది ఉద్యోగులను తొలగించింది. మూలాధారాల ప్రకారం, మార్చిలో అమెజాన్ CEO ఆండీ జాస్సీ చేసిన 9,000 మంది తొలగింపు ప్రకటనలో భాగంగా దేశంలో తగ్గించడం జరిగింది.

Twitter New CEO: ట్విట్టర్ కొత్త సీఈవో ఖరారు, లిండాను నియమిస్తూ ఎలాన్ మస్క్ ప్రకటన, ఇకనైనా ట్విట్టర్ రాత మారేనా?

VNS

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) కంపెనీ కొత్త సీఈవో ను ప్రకటించారు. ట్విట్టర్ నూతన సీఈవోగా లిండా యక్కరినో ను ప్రకటించారు ఎలన్ మస్క్ (Elon Musk). ఈ ఉదయమే ఆరు వారాల వ్యవధిలో ఎట్టకేలకు ట్విట్టర్‌కి కొత్త CEO వస్తారని మస్క్ ధృవీకరించారు. NBCUniversal లో పనిచేస్తున్న లిండా యక్కరినో (Linda Yaccarino) సీఈఓ రోల్ చేపట్టనున్నట్లు ఇంటర్నెట్‌లో ఊహాగానాలు వినిపించాయి.

Advertisement

E-Commerce Platforms: నిబంధనలు ఉల్లంఘిస్తూ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌ విక్రయం, 5 ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసిన కేంద్రం

Hazarath Reddy

వినియోగదారుల రక్షణ చట్టం, 2019ని ఉల్లంఘించిన దృష్ట్యా, కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌లను విక్రయించే టాప్ ఐదు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) ఉత్తర్వులు జారీ చేసింది.

Over 500mn cyberattacks blocked in India: భారత్‌లో 500 మిలియన్ల కంటే ఎక్కువ సైబర్‌టాక్‌లు బ్లాక్, కొత్త నివేదికలో వెల్లడి

Hazarath Reddy

1 బిలియన్ గ్లోబల్ దాడులలో 500 మిలియన్ల కంటే ఎక్కువ సైబర్‌టాక్‌లు భారతదేశంలో నిరోధించబడ్డాయి, ఇది Q4, 2022, (829 మిలియన్ దాడులు)తో పోల్చితే, Q1, 2023లో సైబర్‌టాక్‌ల సంఖ్య 29 శాతానికి పైగా పెరిగింది. బుధవారం ఒక కొత్త నివేదిక చూపించింది.

Novavax Layoffs: ఫార్మా తయారీ రంగంలో మొదలైన లేఆప్స్, దాదాపు 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న నోవావాక్స్

Hazarath Reddy

కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీదారు అనిశ్చిత భవిష్యత్తు రాబడితో వ్యవహరించేటప్పుడు ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నందున నోవావాక్స్ తన వర్క్‌ఫోర్స్‌లో నాలుగింట ఒక వంతు మందిని తగ్గిస్తుంది.

Reels Impact on Sales In India: యాడ్స్ చూసిన తర్వాతే 77% మంది ఆ వస్తువును కొంటున్నారట, మెటా స్టడీలో కీలక విషయాలు వెల్లడి

Hazarath Reddy

రీల్స్ యాడ్స్ పవర్‌ను దేశంలోని బ్రాండ్‌లకు తీసుకెళ్లేందుకు రూపొందించిన #మేడియన్‌రీల్స్ ప్రోగ్రామ్‌ను మంగళవారం ప్రారంభించినట్లు మెటా ప్రకటించింది.

Advertisement

Zero Shadow Day Videos: జీరో షాడో డే వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో నీడ కనిపించలేదంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన నెటిజన్లు

Hazarath Reddy

మంగళవారం, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12:12 గంటలకు "జీరో షాడో డే" అనే ప్రత్యేకమైన ఖగోళ సంఘటన జరిగింది. సూర్యుని స్థానం నేరుగా తలపై ఉన్నపుడు మరియు నిలువు వస్తువులపై ఎటువంటి నీడను చూపనప్పుడు ఈ సంఘటన జరుగుతుంది.

LinkedIn Layoffs: లింక్డిన్‌కు లేఆఫ్స్‌ సెగ, 716 మందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేసిన మైక్రోసాఫ్ట్‌ కంపెనీ, చైనా జాబ్‌ అప్లికేషన్‌ షట్‌డౌన్‌ చేయాలని నిర్ణయం

Hazarath Reddy

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌కు లేఆఫ్స్‌ సెగ తగిలింది. తాజాగా, 716 మందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్‌ అప్లికేషన్‌ను షట్‌డౌన్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Intel Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, భారీగా కోతలను ప్రకటించిన చిప్ మేకర్ ఇంటెల్, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Hazarath Reddy

సాంకేతిక ఉద్యోగుల తొలగింపులు నిరంతరాయంగా కొనసాగుతున్నందున, సవాలుగా ఉన్న స్థూల-ఆర్థిక వాతావరణాన్ని నావిగేట్ చేస్తూ ఖర్చులను తగ్గించుకోవడానికి తమ శ్రామిక శక్తిని మరింత తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు చిప్ తయారీదారు ఇంటెల్ ధృవీకరించింది. అయితే, రాబోయే తొలగింపుల్లో ఎంత మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందో కంపెనీ వెల్లడించలేదు.

Diesel Cars To Be Banned in India? భారత్‌లో డీజిల్ కార్లపై నిషేధం, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఫోర్-వీలర్లను నిషేధించాలని ప్రభుత్వ ప్యానెల్ ప్రతిపాదన

Hazarath Reddy

దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిరోధించడానికి, గ్రీన్ ఎనర్జీతో నడిచే కార్లను ప్రోత్సహించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వ ప్యానెల్ డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధాన్ని ప్రతిపాదించింది.

Advertisement
Advertisement