Mumbai, Jan 15: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే పలుమార్లు తేదీని పొడగించగా నేటితో ఈ గడువు ముగియనుంది.
యూఎఎన్ అనేది ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను నిర్వహించడానికి సాయపడే 12-అంకెల సంఖ్య. ఈపీఎఫ్ఓ (EPFO) ద్వారా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌కి లింక్ చేయడం తప్పనిసరి.
దేశంలో ఉద్యోగ కల్పనపై దృష్టి సారించే ఉపాధి-కేంద్రీకృత పథకం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు మీ బ్యాంక్ ఖాతాతో మీ ఆధార్‌ను సీడ్ చేయడం తప్పనిసరి.
ఈపీఎఫ్ యూఎఎన్ ఎలా యాక్టివేట్ చేయాలి?
ఈపీఎఫ్ అధికారిక వెబ్సైట్( www.epfindia.gov.in)కి వెళ్లండి.
‘Our Services’పై క్లిక్ చేసి, ’employees’పై క్లిక్ చేయండి.
‘మెంబర్ యూఎఎన్ / ఆన్లైన్ సర్వీసులు’ ఎంచుకోండి.
‘మీ యూఎఎన్ యాక్టివేట్ చేయండి. (కుడి వైపున ఉన్న ‘ముఖ్యమైన లింక్‌లు’ ) ఎంచుకోండి.
యూఎఎన్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా వంటి మీ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేసి, ‘GetAuthorization pin’పై క్లిక్ చేయండి.
అప్పుడు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
‘I Agree’ఎంచుకుని, OTPని ఎంటర్ చేయండి
‘OTPని ధృవీకరించండి. యూఎఎన్ యాక్టివేట్ చేయండి’పై క్లిక్ చేయండి ఇకపై ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది..ఎలా పనిచేస్తుందంటే..
ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సబ్సిడీ/ఇన్సెంటివ్ చెల్లింపులను ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ ద్వారా నిర్ధారించడంతో పాటు 100% బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ అందించడమే లక్ష్యంగా ఉంది.
Alert for EPFO Members
It is mandatory to seed your Aadhaar with your Bank Account to avail the benefits of the Employment Linked Incentive (ELI) Scheme, an employment-centric scheme focusing on job creation in the country. Do it timely to avoid last-minute hassle!#EPFOwithYou #HumHainNaa #EPFO #EPF… pic.twitter.com/mn4Eom0U1T
— EPFO (@socialepfo) January 9, 2025
EPFO సభ్యులు యూనివర్శల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేసి, తమ ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్లతో లింక్ చేయాల్సిన తుది గడువు 2024 జనవరి 15(నేడే). ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే, ELI స్కీమ్ ద్వారా లబ్ది పొందలేరు.ఆధార్‌తో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం ELI స్కీమ్ లబ్ధులను పొందటానికి తప్పనిసరి అని వెల్లడించింది.
ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ సేవల సరఫరా విధానాలను సులభతరం చేయడం. అలాగే పారదర్శకత పెంచడం ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ప్రక్రియ ద్వారా EPFO కార్యాలయాలకు భౌతికంగా వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించి, 24/7 సేవలను ఇంటి నుండే పొందవచ్చు.