World

First Covid Case: ప్రపంచంలో మొట్టమొదట కోవిడ్ సోకిన మహిళ ఎవరో తెలిస్తే, షాక్ తినడం ఖాయం, వూహాన్ మార్కెట్లో జరిగింది ఇదే, తేల్చిచెప్పిన అమెరికా పరిశోధకులు

Krishna

వూహాన్ లోని హువానాన్ మార్కెట్ లో సీ ఫుడ్ విక్రయించే ఓ మహిళే మొట్టమొదటగా కోవిడ్ సోకిన వ్యక్తి అని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. డిసెంబర్ 11, 2019 నే ఆమెలో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయని తాజా అధ్యయనం చెబుతోంది.

Lockdown in Austria: తగ్గని కరోనా కేసులు, మళ్ళీ అక్కడ పూర్తి స్థాయి లాక్‌డౌన్, ప‌ది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంద‌ని తెలిపిన ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ అలెగ్జాండ‌ర్ ష‌ల్క‌న్‌బ‌ర్గ్

Hazarath Reddy

యురోపియ‌న్ దేశం ఆస్ట్రియాలో మ‌ళ్లీ క‌రోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ దేశంలో మ‌రోసారి లాక్‌డౌన్ (Lockdown in Austria) అమ‌లు చేయ‌నున్నారు. సోమ‌వారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమ‌లులోకి రానున్న‌ది.

Chemical Castration: అత్యాచారం చేస్తే ఇకపై అది అవుట్, జీవితాంతం సెక్స్‌కు పనికిరాకుండా రేపిస్టులకు కెమికల్‌ క్యాస్ట్రేషన్‌, క్రిమినల్‌ లా సవరణ బిల్లు 2021ను ఆమోదించిన పాకిస్తాన్ పార్లమెంట్

Hazarath Reddy

రేపిస్టులపై కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పదేపదే లైంగికదాడులకు పాల్పడే నేరగాళ్లకు కఠిన శిక్ష అమలు చేసేందుకు కొత్త బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఒకటి కంటే ఎక్కువ లైంగికదాడుల కేసుల్లో దోషులుగా తేలినవారికి కెమికల్‌ క్యాస్ట్రేషన్‌ (Chemical Castration) చేయనున్నారు.

Red Crabs: గుండె ఝలదరించే వీడియో, రోడ్డు మీద లక్షలాది ఎర్ర పీతలు, వీటి దెబ్బకు రహదారులన్నీ మూసివేత, ఇళ్లలోనే ఉండిపోయిన జనాలు

Hazarath Reddy

ఆస్ట్రేలియాలో క్రిస్మస్ ఐలాండ్‌లో లక్షలాది పీతలు (Red Crabs) వలస వెళ్తూ.. రోడ్లపైకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ ప్రాంత దారులన్నీ స్థానిక అధికారులు మూసివేశారు.

Advertisement

ISRO: దటీజ్ ఇండియా, అంతరిక్షంలో పెను ప్రమాదాన్ని అడ్డుకున్న చంద్రయాన్-2, ప్రమాదం జరిగి ఉంటే అంతరిక్షం వ్యర్థాలతో నిండిపోయి ఉండేదని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

ఇస్రో మరో ఘనతను సాధించింది. చంద్రుడి ఉత్తర ధ్రువంలో చంద్రయాన్-2 ఆర్బిటర్ (Chandrayaan-2) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన లూనార్ రీకనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌వో)ను ఢీకొట్టకుండా ( Evasive Measure Carried Out Recently) రక్షించింది.

China: చైనా మళ్లీ కొంప ముంచింది, వుహాన్ మార్కెట్లో 18 రకాల వైరస్‌లు, పలు రకాలైన జంతువుల్లో ఈ వైరస్‌లు కనుగొన్నట్లు తెలిపిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం

Hazarath Reddy

కరోనావైరస్ పుట్టుకతో ప్రపంచానికి షాకిచ్చిన చైనా నుంచి మరో షాక్ న్యూస్ బయటకు వచ్చింది. కరోనావైరస్ తొలి కేసు వెలుగు చూసిన వుహాన్ మార్కెట్లో మరో 18 రకాల వైరస్ లను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. చైనా యొక్క ప్రసిద్ద మార్కెట్ లో ఈ క్షీరదాల వైరస్ (Mammalian Viruses) ని వారు కనుగొన్నారు.

Shocking: షాకింగ్ న్యూస్, టాయిలెట్‌లో కూర్చున్న వ్యక్తి పురుషాంగాన్ని కాటేసిన కొండ చిలువ, నొప్పితో ఆస్పత్రికి పరుగులు పెట్టిన బాధితుడు, ఆస్ట్రియాలో ఘటన వెలుగులోకి

Hazarath Reddy

పొరుగువారి ఇంటి నుండి ఓపెంపుడు కొండచిలువ ఒక వ్యక్తి యొక్క టాయిలెట్‌లోకి ప్రవేశించింది. వ్యక్తి టాయిలెట్‌లో కూర్చున్న వెంటనే, కొండచిలువ అతని ప్రైవేట్ భాగాన్ని (Python Bite On Genitals) కాటు వేసింది.

Snake Bite On Genitals: పురుషాంగాన్ని కాటేసిన నాగుపాము, నొప్పితో విలవిలలాడిపోయిన బాధితుడు, దక్షిణాఫ్రికాలో షాకింగ్ ఘటన వెలుగులోకి

Hazarath Reddy

47 ఏళ్ల వ్యక్తి విహారయాత్ర కోసం దక్షిణాఫ్రికాకు వచ్చాడు. అయితే అతను టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అతని ప్రైవేట్ పార్ట్‌లో విషపూరితమైన కింగ్ కోబ్రా పాము కాటు (Snake Bite On Genitals) వేసింది.

Advertisement

Pakistan: సాటి స్త్రీ పై ఇంత అమానుషమా..మహిళా ఖైదీ దుస్తులు విప్పించి, ఇతరుల ముందు నగ్నంగా డ్యాన్స్ వేయించిన లేడీ ఇన్‌స్పెక్టర్, మండిపడిన పాకిస్తాన్ ఉన్నతాధికారులు, ఉద్యోగం నుంచి తొలగింపు

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అమానుష ఘటన ( Lady police officer forces female detainee) చోటు చేసుకుంది. పోలీస్ రిమాండ్‌లో ఓ ఉన్న మహిళపై లేడీ ఇన్‌స్పెక్టర్ షబానా ఇర్షాద్ అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె దుస్తులు విప్పించి జైలులోని ఇతరుల ముందు డ్యాన్స్ (strip and dance naked in front of inmates) చేయించింది.

New COVID Variant B.1.X: మళ్లీ కొత్త వేరియంట్ల షాక్, ఫ్రాన్స్‌లో కలకలం రేపుతున్న B.1.X లేదా B.1.640 వేరియంట్,నార్వేలో క‌రోనావైర‌స్‌లో కొత్త ర‌కం డెల్టా స్ట్రెయిన్, చైనాను వణికిస్తున్న డెల్టా వేరియంట్‌

Hazarath Reddy

కొత్త కోవిడ్-19 వేరియంట్‌కు సంబంధించిన అనేక కేసులను ఫ్రాన్స్ గుర్తించింది, ఐరోపాలో వైరస్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ అక్కడ కలకలం రేపుతోంది. B.1.X లేదా B.1.640 అని పిలవబడే వేరియంట్ (New COVID Variant B.1.X), అక్టోబర్‌లో బన్నాలెక్ మరియు ఫినిస్టేర్‌లలో కనుగొనబడిందని ఫ్రెంచ్ దినపత్రిక Le Telegramme నివేదించింది.

Polluted Cities: అత్యంత చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న ఢిల్లీ, ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యమున్న నగరాల్లో ఢిల్లీకి మొదటిస్థానం

Naresh. VNS

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా మాస్క్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి.. చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ జాబితాలో భారత్ నుంచి ముంబై, కోల్‌కతా కూడా చేరాయి.

Insurance Fraud: ఇన్సురెన్స్ డబ్బుల కోసం కాళ్లు నరుక్కున్న వ్యక్తి, కోర్టులో విషయం బయటపడటంతో బెడిసికొట్టిన ప్లాన్

Naresh. VNS

డబ్బుల కోసం ప్రాణాలు తీసేవాళ్లను చూశాం…మోసాలు చేసేవాళ్లను చూశాం..కానీ హంగేరీకి చెందిన ఓ వ్యక్తి ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. సుమారు 14 బీమా పాలసీలను తీసుకున్న ఆ వ్యక్తి, వాటిని క్లైయిమ్ చేసుకునేందుకు ఈ పనికి పాల్పడ్డాడు.

Advertisement

Premature Baby: 5 నెలలకే పుట్టాడు, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కాడు. అమెరికాలో అసాధారణ చిన్నారి, ఆరు నెలల పాటూ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన బాబు

Naresh. VNS

సాధారణంగా మహిళ తన బిడ్డను తొమ్మిది నెలల పాటూ కడుపులో మోస్తుంది. కొన్ని కేసుల్లో మాత్రమ 7 నెలలకే డెలవరీ అవుతారు. అయితే అలబామాకు చెందిన ఓ మహిళ మాత్రం 5 నెలలకే ప్రసవించింది. గిన్నీస్‌బుక్ రికార్డు సృష్టించింది.

Coronavirus Pandemic: యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా కల్లోలం, ఒక్కసారిగా పెరిగిన కేసులు, మరణాలు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

పలు దేశాల్లో తగ్గుముఖం పట్టిన కోవిడ్ తాజాగా యూరప్ దేశాలను మళ్లీ వణికిస్తున్నది. వరుసగా గత ఆరు వారాల్లో వైరస్‌ (Coronavirus Pandemic) కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన వారంలోనే కరోనా మరణాలు 10 శాతం పెరిగినట్టు డబ్ల్యూహెచ్‌వో (WHO) ఆందోళన వ్యక్తం చేసింది.

Xi Jinping: మావో సరసన జిన్‌పింగ్, చారిత్రాత్మక తీర్మానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఆమోదం, శాశ్వత అధికారానికి రూట్‌ క్లియర్‌ చేసుకున్న చైనా నియంత

Naresh. VNS

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకున్నారు. జీవితాంతం తానే చైనా అధ్యక్షుడిగా ఉండేలా చారిత్రాత్మక తీర్మానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఆమోదం తెలిపింది. వందేళ్ల చరిత్రతో రూపొందించిన డ్యాక్యుమెంట్‌ను ప్లీనరీ ఆమోదించడంతో జిన్‌పింగ్ అధికారానికి ఢోకా లేకుండా పోయింది.

Coronavirus Fifth Wave: కరోనావైరస్ పిఫ్త్ వేవ్ ముంచుకొస్తోంది, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఫ్రెంచ్‌ ఆరోగ్యమంత్రి ఆలివర్‌ వెరాన్‌

Hazarath Reddy

ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ ఐదో దశ (Coronavirus Fifth Wave) దేశంలో త్వరలో ప్రారంభం కావొచ్చునని.. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్‌ ఆరోగ్యమంత్రి ఆలివర్‌ వెరాన్‌ హెచ్చరించారు.

Advertisement

Coronavirus in China: చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, లాక్‌డౌన్ మొదలు పెట్టిన యంత్రాంగం, పలు సిటిమాల్స్ మూసివేత, కరోనా పరీక్షలను ముమ్మరం చేసిన వైద్యారోగ్యశాఖ

Hazarath Reddy

చైనాలో మరోసారి కరోనావైరస్ కలకలం రేపుతున్నది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో కరోనా కేసులు (Coronavirus in China) ఒక్కసారిగా పెరిగాయి. బీజింగ్‌లోని సెంట్రల్ ప్రావిన్స్ అయిన చాయాంగ్, హైడియన్‌లలో గురువారం ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో వైరస్‌ (Covid Outbreak) సోకిన వ్యక్తుల సన్నిహితుల నుంచి వ్యాపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Coronavirus in Germany: లాక్‌డౌన్ దిశగా జర్మనీ, ఒక్కరోజే 50వేలకు పైగా కేసులు, వ్యాక్సిన్ వేసుకోని వారివల్లనే వైరస్ విజృంభణ

Naresh. VNS

జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ ఇన్ఫెక్షన్ రేటు భారీగా పెరుగుతోంది. బుధవారం దాదాపు 40వేల కరోనా కేసులు నమోదు కాగా, గురువారం 50 వేలు దాటాయి. ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఐసీయూల్లో చేరే కరోనా రోగుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో మిగిలిన సర్జరీలు నిలిచిపోయాయి.

India-China Border Tensions: చైనాతో మళ్లీ యుద్ధం వస్తే చూస్తూ ఊరుకోవాలా, భారీగా సామాగ్రిని తరలించడానికి రహదారులు అవసరం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, చైనా నిర్మిస్తున్న గ్రామాలపై స్పందించిన భారత ఆర్మీ

Hazarath Reddy

టిబెట్ ప్రాంతంలో చైనా భారీ నిర్మాణాన్ని చేపట్టిందని, 1962 నాటి యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడానికి భారత్-చైనా సరిహద్దు వరకు భారీ వాహనాలను తరలించడానికి సైన్యానికి విస్తృత రహదారులు అవసరమని (Broader Roads Needed to Combat) కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Malala Yousafzai: పెళ్లి చేసుకున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా, పాక్‌ యువకుడితో నిరాడంబరంగా నిఖా.

Naresh. VNS

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ (Malala Yousafzai) సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. అస్సర్‌ మాలిక్‌ అనే యువకుడితో మలాలా వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో మాలిక్‌ను నిఖా (Nikkah) చేసుకున్నారు.

Advertisement
Advertisement